సబ్ ఫీచర్

స్వీట్ మెమొరీస్‌తో ఆల్బం నింపుకుందామా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొటీన్ ప్రకారం అయితే పొద్దునే్న అలారాల మోత- ఆ హోరును లెక్కచేయకుండా బద్ధకించి అలాగే పడుకుంటే.. ‘ఇంకా లేవలేదా’ అంటూ అమ్మా నాన్నలు హూంకరించేస్తారు. ‘తప్పదురా దేవుడా’ అనుకుంటూ నిద్రమత్తంతా నీళ్ళతో వదిలించుకుని ఓ గంట ఫటాఫటా చదివేసి, ఒకటిన్నర ఇడ్లీనో రెండు స్పూన్ల ఉప్మానో లాగించేసరికి కొంపలంటుకున్నట్లు స్కూలు వ్యాను రానే వస్తుంది. ఒక్క సెకను లేటైందో, వ్యాన్ డ్రైవర్ ఫైరింజన్‌లా హార్న్ మోగించి ఎక్కంగానే తీసికెళ్లి స్కూలు అనే జైల్లో పడేస్తాడు. ఒక్కో క్లాసు గట్టెక్కేసరికి నీరసం ముంచుకొస్తుంది.
నేరాలు చేసి జైలుకెళ్లిన వాళ్ళమీదైతే తెగ సానుభూతి కురిపిస్తారు కానీ ఏ తప్పూ చేయకుండానే సంవత్సరాల తరబడి స్కూలు శిక్ష అనుభవిస్తోంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా జాలిపడరేంటో. క్షణాలు నత్తలకంటే మెల్లగా నడిచి ఎలాగో స్కూలు ముగిసింది అనుకుంటే వెంటనే ట్యూషను ఒకటి. అదీ అయ్యాక కాసిని స్నాక్స్ చేతిలో పెట్టేసి మళ్లీ చదువు.. చదువు.. చదువు.. ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు, సోషలు, సైన్సు, హిందీ.. ఇవి చాలక జి.కె, కంప్యూటర్, ఎన్విరాన్‌మెంటు.. ఎట్రెట్సా.. ఎట్సెట్రా.. ఊపిరాడని చదువులతో విసిగిపోయిన చిచ్చరపిడుగులకి సెలవులు ఆడవిడుపనే చెప్పాలి.
వర్కింగ్ డేస్‌లో కంటే సెలవుల్లో పిల్లలలు టీవీ విపరీతంగా చూస్తున్నారనేది తల్లిదండ్రులందరి కంప్లయింటు. టీవీనే పెద్ద అడిక్షన్ అనుకుంటే వీడియో గేమ్స్ దానిముందు ఇంకా పెద్ద గీతలా తయారైదంటున్నారు. రోజురోజుకూ సైన్సు డెవలప్‌మెంట్ అవుతూ కొత్త కొత్త పరికరాలు మార్కెట్‌లో కొస్తున్నాయి. అందులో వీడియో గేమ్స్ ఒకటి. గంటల తరబడి వీడియో గేమ్స్‌తో కాలక్షేపాలు చేయడం పరిపాటి అయింది. సాఫ్ట్‌గేమ్స్ అయితే కొంతవరకూ ఫర్వాలేదు గానీ క్రైమును పెంచి పోషించేలా వుండే వీడియో గేమ్స్ ప్రమాదకరమని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ రకమైన వీడియో గేమ్స్‌వల్ల వీసమెత్తు ప్రయోజనం లేకపోయా శుద్ధ టైం వేస్టని తేల్చారు. వీటికి పర్యవసానం పిల్లల ప్రవృత్తి సైతం మారిపోతుందని, చిన్నపాటి విలన్లుగా తయారౌతారని మేధావులు హెచ్చరిస్తున్నారు.
సెలవులనగానే ఆటవిడుపు అనేమాట సామాన్యీకరణ. దీనికి చాలాకాలంగా మెజారిటీ స్కూళ్లలో మినహయింపు కనిపిస్తోంది. వెకేషనంటే ఎంజాయ్‌మెంట్ అని జనరలైజ్ చేయడానికి వీల్లేకుండా కుప్పలు తెప్పలుగా హోంవర్కులు ఇచ్చేస్తున్నారు. వీళ్లకి ఇంత వర్కా అని బాధపడని తల్లిదండ్రులు వుండరంటే ఉండరు. ఒక పక్కన ఆటలమీద ధ్యాస, ఇంకోపక్కన క్లాస్‌మేట్స్‌తో, కాలనీ ఫ్రెండ్స్‌తో మాట్లాడాలనే కుతూహలం, మరోపక్క టీవీ చూడాలనే ఉబలాటం. బొమ్మలేయాలని, కంప్యూటర్ గేమ్స్ ఆడాలని, ఫ్రెండ్స్‌తో ఛాట్ చేయాలని, ఓషన్ పార్కు, వౌంట్ ఒపేరాల్లాంటి వినోద స్థలాలకు వెళ్లాలని, రిసార్ట్స్‌కు వెళ్లాలని.. అబ్బబ్బ.. ఒకటా రెండా.. ఎనె్నన్ని సరదాలు.. వీటన్నిటినీ కట్టకట్టి ఏట్లో విసిరేసి హోంవర్కులు చేయాలంటే ఎంత బాధ? కానీ ఎవరితో చెప్పుగలరు? అమ్మా నాన్నలకి చెబితే జాలిపడి ప్రకటించకపోగా లాగిపెట్టి ఒక్కటిచ్చినా ఇస్తారు.
ఇక టీచర్లని ఇదేం హోంవర్క్ అని ఎదురు ప్రశ్నించనూ లేరు. చేయకుండా బ్లాంకు నోట్సులు చూపించి దెబ్బలు తినలేరు. మొత్తానికి వాళ్ళ పాలిట హోంవర్క్ మహా చిరాకెత్తించే అంశంగా తయారైంది.
మునుపటిలా పిల్లలంటే అమాయకత్వం జీర్ణించుకున్న బొమ్మలో, చెప్పింది చేస్తూ, నేర్పింది పలికే చిలకపలుకుల చిన్నారులో కాదు. వాళ్ళు చిచ్చరపిడుగులు కాదు.. లిటిల్ స్కాలర్స్. ఒక్కోసారి మితిమీరిన తెలివి అనర్థదాయకమని భయపడుతున్నారు తల్లిదండ్రులు.
వందలాది క్రియేటివ్ ఐడియాలున్నాయి. వాటివల్ల చిన్నారులకు ఎలాంటి హాని జరగకపోగా ఉల్లాసాల్లో మునిగి ఉత్సాహాల్లో తేలగలుగుతున్నారు. సోషల్ సర్వీస్ అనేది మహత్తరమైంది. అందులో వుండే ఆనందాన్ని అనుభూతుల్ని వర్ణించడం అంత తేలికకాదు.
గార్డెనింగ్ అలసట కలిగించేదేం కాదు కనుక సెలవుల్లో చిన్నారులకు కాసేపు తోట పని అప్పగిస్తే సరి- బుడతలు కాస్తా ఉడతల్లా మారుతారు. ఆహ్లాదానికి ఆహ్లాదం, ఆరోగ్యానికి ఆరోగ్యం. వారితో కలిసిపోయి కాసేపు ఆడుకోగల్గితే పెద్దలు కూడా ఆందోళనలు మర్చిపోవాల్సిందే. బొమ్మలు వేయడం, క్లేతో ఇమేజ్‌లు తయారుచేయడం దాదాపు పిల్లలందరికీ సరదానే. అలాంటివాటిని ప్రోత్సహిస్తే వాళ్ళెంతో హుషారుగా వుంటారు. సెలవుల్లో రీచార్జ్ అయ్యే మెథడ్స్ ఫాలో అయితే స్వీట్ మెమొరీస్‌తో ఆల్బం నింపుకోవచ్చు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి