సబ్ ఫీచర్

పరపీడన పరాయణత్వం పాత మాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్క్సిస్టు పరిభాషలో పేర్కొనే ‘పరపీడన పరాయణత్వం’ అన్నమాటకు ఇకపై మాన్యత లేదు. సైబర్ విజ్ఞానంతో సమాజాలు సాధికారత సాధించే వైపు పయనిస్తున్నాయి. ఇదే ఈ కాలపు గొప్ప విప్లవం. గత రెండు శతాబ్దాలుగా చోటుచేసుకున్న రక్తపాత విప్లవాలకు కాలం చెల్లింది. ముఖ్యంగా కారల్ మార్క్స్ చూపిన మార్గంలో విప్లవాలకు నూకలు చెల్లాయి. నూతన ఆవిష్కరణలతో జ్ఞాన బలంతో, కృత్రిమ మేధ ఆసరాతో సమాజాలు సరికొత్త దిశగా అడుగులు వేస్తున్నాయి. నాల్గవ పారిశ్రామిక విప్లవం మానవ జాతిని సరికొత్త ఎత్తులో నిలుపుతోంది. గతంలో ఎవరూ ఊహించని ఆర్థిక నమూనా ఆవిష్కారమవుతోంది.
ఆర్థిక అంతరాల నెపంతో కోట్లాది మంది ప్రజల ప్రాణాలు తీసే ముతక భావజాలం మురిగిపోయింది. నిర్దయగా కోట్లాది మంది ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేసే వైనం ఇంకానా ఇకపై సాగదని సైబర్ ప్రపంచం చాటి చెబుతోంది. నిప్పుని కనుగొనడంతో ప్రారంభమైన మానవుని అంతర్గత శక్తి, చక్రం ఆవిష్కరించాక- ఆగకుండా ముందుకే అడుగేస్తూ ప్రస్తుతం ఆల్గరిథమ్స్ ఆధారంగా కృత్రిమ మేధతో జీవన సౌందర్యం మరింత వనె్నకెక్కుతోంది. ఆ పరిమళం మన చుట్టూ విస్తరిస్తోంది. నాల్గవ పారిశ్రామిక విప్లవం మనుషులను పూర్తిగా మార్చేస్తోందని ప్రపంచ వ్యాప్త నిపుణులు తరచూ చెబుతున్నారు. 18వ శతాబ్దం (1784)లో వచ్చిన తొలి పారిశ్రామిక విప్లవం ఆవిరియంత్రాన్ని తీసుకొస్తే, 19వ శతాబ్దం (1870)లో వచ్చిన రెండవ పారిశ్రామిక విప్లవం విద్యుత్‌ను పరిచయం చేసింది. 20వ శతాబ్దం (1969)లో వచ్చిన మూడవ పారిశ్రామిక విప్లవం ఎలక్ట్రానిక్స్‌ను మోసుకొచ్చింది. ఇక 21వ శతాబ్దం ప్రారంభంలో పైమూడు పారిశ్రామిక విప్లవాలకు పరాకాష్ఠగా సరికొత్త సైబర్ విప్లవం వెలుగు చూసింది. జీవ, భౌతిక, సైబర్ సాంకేతికతలు కలిసిపోవడం దీని ప్రత్యేకత. ఇది ఎంత దూరం వెళ్లిందంటే- త్రీడీ ప్రింటింగ్ ద్వారా మానవ అవయవాలను తయారుచేసేంతవరకు. అలాగే జీన్స్‌ను ‘ఎడిట్’ చేసే సౌలభ్యం సాధించేవరకు. వినడానికి ఇది వింతగా అనిపించినా ఎనె్నన్నో అద్భుతాల ఆవిష్కారమవుతున్నాయి. రాబోయే రోజుల్లో రోబోల సహచర్యం తప్పనిసరి కానున్నది. పని సంస్కృతి సంపూర్ణంగా మారబోతోంది. కీలకమైన ఈ రంగం మారితే జీవితంలోని మిగతా పార్శ్వాలన్నీ సహజంగానే రూపాంతరం చెందుతాయి. దాని ప్రాథమిక రూపం ఇప్పటికే మన ముందు కనిపిస్తోంది.
మన ఆశలకు, ఆలోచనలకు అద్దం పట్టేదే ఆధునిక విప్లవం అని నిపుణులు అంటున్నారు. అసాధ్యమనుకున్నవి చిటికెలో సాధ్యం అయ్యే ‘టూల్స్’ మన చేతికొస్తున్నాయి. ఈ నూతన పారిశ్రామిక విప్లవపు మరో ప్రత్యేకత ఏమిటంటే.. మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల ఫలితాలు అందుకోలేనివారు సైతం ఈ విప్లవ ఫలితాల్ని అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్‌ను పేర్కొంటున్నారు. ఆదివాసీ ఆవాసాల్లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం పెరుగుతోంది. ఇది శతాబ్దాల వారి మానసిక ప్రపంచాన్ని, ఆలోచనల్ని మారుస్తోంది. వారి ఎదుగుదలకు అంకురం వేస్తోంది. ఇది కదా నిజమైన విప్లవం! ఈ పరిణామాలను పట్టించుకోకుండా 18వ శతాబ్దపు విప్లవాల వైపు, రక్తపాతాలవైపు వారిని కదలిస్తామని కంకణం కట్టుకున్న మావోయిస్టులలు ఎంత కఠినాత్ములో తెలుస్తోంది.
ఇకపై శిలాజ ఇంధనం వాడకం తగ్గనున్నది. సౌర, పవన, జీవ ఇంధనం వేదికపైకి రాబోతోంది. వీటిని గ్రిడ్‌తో అనుసంధానం చేస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. అలాగే డిజిటల్ ట్రాన్స్‌పోర్ట్ (డ్రైవర్లు లేని వాహనాలు), డిజిటల్ హెల్త్, ఎడ్యుకేషన్ (ఎక్కడినుంచైనా వైద్యం, విద్య అందించడం), డిజిటల్ కమ్యూనికేషన్ (కోట్లాదిమంది ప్రజల అనుసంధానం) మన అనుభవంలో వున్నదే! తయారీ,సేవల రంగాలలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు ప్రభావితం కాని మానవ జీవన పార్శ్వం అంటూ ఏదీ లేదు. కమ్యూనికేషన్స్, రవాణా రంగాల్లో ధరలు తగ్గడం కారణంగా వ్యాపార లక్షణం మారిపోతున్నది. సంపద భావనలో మార్పు కనిపిస్తోంది. అపరిమితమైన డేటా అందుబాటులో ఉండటం, దాన్ని కంప్యూటింగ్ చేసే ప్రక్రియ వేగవంతం కావడంతో జీవన వేగం అనూహ్యంగా పెరిగింది.
5జిని ప్రవేశపెట్టనుండటంతో ఆ వేగం మరింత పెరుగుతోంది. నానో టెక్నాలజీ, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ సాంకేతిక ప్రభంజనానికి సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రతి పదిమందిలో చూస్తే దక్షిణ కొరియాలో 631 , సింగపూర్‌లో 488 రోబోలు ఉండగా, మన దేశంలో వాటి సంఖ్య మూడు మాత్రమేనని తెలుస్తోంది. ఈ దృశ్యం త్వరలో మారనున్నదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. గత సంవత్సరం భారత్ మూడువేల రోబోలను దిగుమతి చేసుకుంటే రానున్న రెండు సంవత్సరాల్లో మరో మూడువేల రోబోలను దిగుమతి చేసుకోనున్నది. అనుబంధ రంగాల సాంకేతిక పరిజ్ఞానం సైతం అందుబాటులోకి రానున్నది. దీనివల్ల ఏమర్థమవుతోందంటే, ఇపుడు రోజులు ఇకముందు ఉండవని..
సాంకేతిక పరిజ్ఞానం మనిషిని తనలో ఇముడ్చుకుంటున్నదని, కలిపేసుకుంటున్నదని విజ్ఞులు భావిస్తున్నారు. అనేక ‘చిప్స్’ మనిషి దేహంలో ఇమిడిపోనున్నాయి. జీవితకాలం పెరిగేందుకు ఇవి దోహదపడనున్నవి. ఇన్నోవేషన్ అనే మాట తారకమంత్రం కాబోతోంది. ఇప్పటికే ఆ పదం ప్రతిధ్వనిస్తోంది. కార్మిక రంగం బాగా కుంచించుకుపోవడంతో, మానవ శ్రమకు డిమాండ్ తగ్గుముఖం పట్టడంతో, జీవనశైలి సంపూర్ణంగా మారిపోతుండడంతో రోబోలతో కలసి పనిచేసే నైపుణ్యం పెంచుకోవలసిన అవసరం ఏర్పడుతుండంతో, భావోద్వేగాలు సైతం మారబోతున్నాయి. మార్క్సిజం పూర్తిగా మూలనపడనున్నది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగా, జీవ భౌతిక సాంకేతిక రంగాల సమ్మిళితం అవుతున్న నేపథ్యంలో మన దృష్టికోణం మరింత మెరుగ్గా ఉండాలి. మార్క్సిజం, మావోయిజం లాంటి సిద్ధాంతాలకు ఆకర్షితులై బతుకులు బలి ఇవ్వడం ఏ రకంగానూ ఆమోదనీయం కాదు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే వర్తమానం అడుగులుండాలి. అందుకు సహకరించే వారందరూ చిరస్మరణీయులవుతారు.

- వుప్పల నరసింహం 99857 81799