సబ్ ఫీచర్

మార్పు.. ఇంటి నుంచే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఆడపిల్లలు సుమారు కోటి 20 లక్షలమందిలో పది లక్షల మంది తొలి పుట్టిన రోజు వరకు కూడా బతకడం లేదనేది ఓ సర్వే చెప్తున్నది. పుట్టబోయే బిడ్డ ఆడబిడ్డే అని తెలుసుకుని కడుపులోనే చంపేసేవాళ్ళు అనేకమంది మన సమాజంలో వేళ్లూనుకుని ఉన్నారు. సాంకేతిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా ఆడపిల్లల్ని బతికించడంలో మానవ ప్రయత్నం నానాటికీ తగ్గిపోతునే ఉంది.
కడుపులో ఉన్నప్పటికష్టాలు అన్నీ భరించి వాటిని కాస్త మర్చిపోయ చివరకు భూమి మీద పడిన తరువాత సంతోషాలు వస్తాయ అనుకొంటే ఇంకాఎన్నో కష్టాలు పెనం మీది నుంచి పొయ్యలోకి పడ్డట్టు అవుతుంది భూమిమీదకు కాలిడిన చిన్నారికి. అప్పటి నుంచి కామాంధుల కళ్లు తోడేళ్ల కళ్లల్లా చూస్తునే ఉంటాయ. ఈకాలంలో కళ్లు తెరవని నెలల పసికందులపైనా తమ కామాంధతను వెళ్లగక్కుతున్నారు. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెతను నిజం చేస్తూ అత్తగానో, ఆడపడచుగానో, లేక అమ్మగానో లేదా యజమాని రూపంలోనో ఏదో ఒకరూపంలో సాటి స్ర్తిని ఒక స్ర్తీ హింసిస్తునే ఉంది. కొందరు పుట్టిన శిశువు ఆడపిల్ల అని తెలిసాక ఎక్కడో వదిలి వేస్తున్నారు. మన దేశంలో కూడా తల్లిదండ్రులను పోషిస్తున్న కూతుళ్ళ సంఖ్య ఈమధ్యకాలంలో బాగా పెరుగుతోంది. ఆ తరుణంలోనే అత్త అనే స్ర్తి మూర్తిని హింసల పాలు చేసే కోడళ్లు తయారు అవుతున్నారు. ఇట్లాంటి మనదేశంలోనే రాజస్థాన్ ప్రాంతంలోని రాజ్యమండ్ జిల్లాలో పిప్లాంత్రి అనే గ్రామంలో ఆడపిల్ల పుట్టిందంటే గ్రామంలో ప్రజలంతా సంతోషంగా అడవికి వెళ్లి అమ్మాయి పేరుమీద 111మొక్కలు నాటుతారట. వారిని ప్రసార మాధ్యమాల ద్వారా అందరికీ చూపించాలి. అపుడన్నా సమాజం మారుతుందేమో. స్ర్తికి చెట్టుకు తేడా లేదని చెప్పవచ్చు. విత్తనం దగ్గరనుంచి పెద్ద మాను అయ్యేదాకా చివరకు ఎండిపోయన చెట్టు కూడా వంటచెరుకుగా ఫర్నిచర్ గా ఉపయోగపడే చెట్టు లాగే స్ర్తి కూడా చెల్లిగా, అక్కగా, తల్లిగా, భార్యగా, ఎన్నో విధాలుగా మగవారికి అండదండగా ఉంటుంది. స్ర్తి పురుషులిద్దరూ కష్టపడి కలసి పనిచేస్తే లోకమంతా ఆనందాల హరివిల్లు అవుతుంది. కాని ఇక్కడున్న వివక్షత వల్ల ఆడపిల్ల మనసు తీరనివేదనతో నిండి పోతుంది. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం దేశంలోని 79 శాతం మహిళలు కనీసం ఒక్క ఆడపిల్ల అయినా కావాలని అనుకుంటున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 2005-06లో నిర్వహించిన సర్వేలో 74 శాతం మహిళలు 65 శాతం పురుషులు తమకు ఆడపిల్ల కావాలని కోరుతున్నారని సర్వేలు చెబుతున్నాయ.
నగరంలోని 75 శాతం మహిళలు ఆడపిల్ల కావాలని కోరుకుంటుంటే, గ్రామాల్లో 81 శాతం మహిళలు తమ ఇంట్లో ఒక మహిళ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఓ అధ్యయనం ప్రకారం ఎనిమిదవ తరగతి బాలికల డ్రాపౌట్స్ శాతం ఏపిలో 3.80 శాతం, తెలంగాణలో 5.31 శాతం ఉంది. 9వ తరగతి బాలికలు ఏపిలో 2.90 శాతం, తెలంగాణలో 4.70 శాతం చదువులు ఆపేస్తున్నారు. ఇంటర్‌లో బాలికలు ఏపిలో 11.79 శాతం, తెలంగాణాలో 13.22 శాతం మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
ప్రభుత్వం, స్వచ్చంధ సంస్థలు లాంటి ఎందరో ఆడపిల్లలు బాగుండాలని కోరుకున్నా కోరుకుంటూ వారికే భ్రూణహత్యలు, మానభంగాలు, అత్యాచారాలు జరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలోనే బాల్య వివాహాలు జరుగుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా 15-18 సంవత్సరాలమధ్య వయస్సులో ఎక్కువమంది బాలికలకు వివాహాలు జరుగుతున్నాయి. ఇది కేవలం గ్రామాల్లోనే కాదు నగరాల్లో ఇలాంటి అకృత్యాలు జరుగుతునే ఉన్నాయ. వీటిని అరికట్టాలి అంటే తల్లిదండ్రులకు పిల్లల మానసిక, శారీరిక ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. వారికి సామాజిక బాధ్యతను తెలియపర్చాలి. పిల్ల్లల్లో అక్షరా సత్యతను కలిగించాలి.
సంప్రదాయల పేరిట ఆంక్షలు భారతీయ మహిళల వికాసాన్ని నిరోధిస్తున్నాయని కొంతమంది అభిప్రాయం. ఆడపిల్లలను రక్షించుకోవాలి. వారిని అన్నివిధాల సంరక్షించుకోవాలి అంటే ముందు మార్పు అనేది ఇంటినుండే రావాలి. అందరి మనస్సుల్లో మార్పు వస్తే ఆడపిల్లలు తలెత్తుకుని ప్రాణాలు పోసుకొని తిరగగలరు. సృష్టికే ప్రతిసృష్టి చేయగలరు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు