సబ్ ఫీచర్

తొలి తెలుగు దళిత కిరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమసమాజ నిర్మాణం కోసం ఎందరో మహానుభావులు కృషిచేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ సామాజికవర్గాల అత్మగౌరవం తోపాటు వారు స్వయంశక్తిగా ఎదగటానికి ఎందరో సంఘ సేవకులు పనిచేశారు. ఇలాంటివారు చరిత్రపుటల్లో చెప్పుకోతగ్గవారు కొందరే. అణగారిన కులం నుండి వచ్చి సమాజ నిర్మాణంలో తనవంతు కృషి చేస్తూనే, తన అలోచనలు కార్యరూపంలో చూపిన దళిత శిఖరం, నేటి తరానికి మార్గదర్శి భాగ్యరెడ్డి వర్మ. అగ్రకులాల్లోని మహిళలను వంటింటికే పరిమితం చేసిన నాటి రోజుల్లో దళిత యువతుల కోసం ప్రత్యేకంగా 26 తెలుగు మీడియం పాఠశాలలు ఏర్పాటుచేసి నడిపిన ధీశాలి. ‘నేను దళితుడ్ని కాదు, ఈ దేశపు మూలవాసులం. అది హిందువులం’ అని ప్రకటించి నిజాం ప్రభుత్వం చేత ఒప్పించి దళితులకు అది హిందువుగా గుర్తింపు సాధించి పెట్టిన నేర్పరి. తాను పుట్టింది హైదరాబాద్‌లో అయనా ఆంధ్ర, కర్నాటక, మద్రాసులలో దళితుల సమస్యలపైన దేశం మొత్తం తిరగటంతో పాటు లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి దళితుల పక్షాన ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ను పంపటానికి భాగ్యరెడ్డి వర్మ ప్రతిపాదించారంటే ఆయన సామర్థ్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ ఇసామియా బజార్‌కు చెందిన మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు మే 22, 1988న జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు కుటుంబ అచారం ప్రకారం బాగయ్యగా నామకరణం చేశారు. చిన్న తనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబ భారం తనపైన పడంతో పనులు చేస్తునే శ్రీకృష్ణా ఆంధ్ర భాషా నిలయం వారి సహకారంతో చదువులు కొనసాగించారు.
కోఠిలోని ఆర్యసమాజ్ నాయకులైన బాజి కిషన్‌రావుతో కొంతకాలం పనిచేశారు. ఆయన చేస్తున్న సేవలను వారు గుర్తించి బాగయ్యగా ఉన్న ఆయనకు వర్మ అనే సేవా పురస్కారం ప్రదానం చేశారు. సమాజంలో ఉన్న కులవివక్ష వల్లే ఉన్నత కులాల వారికి ఉన్న హోదా, గౌరవం కింది కులాల వారికి లేదని గమనించిన ఆయన రేడు రెడ్డి అంటే పరిపాలించేవాడు అని తెల్సుకొని తన పేరులో రెడ్డిని చేర్చి భాగ్యరెడ్డి వర్మగా పేరు మార్చుకున్నారు. దేశాన్ని పరిపాలిస్తున్నది వలస వచ్చిన వారేననీ, ఈ దేశంలో పుట్టి పెరిగిన మూలవాసులందరు ఆది హిందువులేనన్న సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. కుల వివక్షకు కారణమైన సాంఘిక దురాచారాలు అంతం కావాలని పరితపించటంతో పాటు పేదల బస్తీల్లో పర్యటించి వారి సమస్యలు తెల్సుకొని పరిష్కారానికి కృషి చేశారు. హైదరాబాద్, సికింద్రబాద్ బస్తీల్లో మనె్న సంఘం కమిటీలను ఏర్పాటు చెయ్యటంతోపాటు ప్రతి బస్తీకి పంచకమిటీ ఏర్పాటు చేసి వారి సమస్యలను వారే పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా దేశంలో మొదటి సారి మహిళా పోదుపు గ్రూపులను బస్తీల వారిగా ఏర్పాటు చేశారు. ధనికుల ఇండ్లలో పనిచేసే పనిమనుషుల కోసం కమిటీ ఏర్పాటు చేశారు. పనుల కోసం దళితులు వాడుకునే పనిముట్ల ప్రదర్శనను మొదటిసారిగా ఏర్పాటు చేసి అందరి దృష్టి ఆకర్షించారు. మహిళల్లో చైతన్యం తీసుకురావటానికి ప్రధానంగా ఇసామియా బజార్‌లో బాలికల కోసం తెలుగు మీడియం పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్, సికింద్రబాద్‌లో 26 పాఠశాలలు ఏర్పాటు చేశారు. దళిత పేదలకు స్వాతంత్య్రంతోపాటు అత్మగౌరవం దక్కాలంటే పరిశుభ్రతను పాటించాలనీ, గోమాంసాన్ని భుజించటం మానివెయ్యాలనీ, మద్యపానానికి దూరంగా ఉండాలనీ, జంతుబలులు చెయ్యరాదనీ, బాల బాలికలు విద్యను అభ్యసించాలనీ విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. కుల వ్యవస్థలోని అంతరాలను తొలగించటానికి 1911లో ఉన్నత కులాల వారితో కలిసి సహపంక్తి భోజనాలు బస్తీలవారీగా ఏర్పాటు చేశారు. జగన్ మిత్ర మండలి పేరును 1911లో ఆది హిందూ సోషల్ లీగ్‌గా మార్చారు.
కులాల పేరుతో సమాజంలో జరుగుతున్న దురాచారాలు అణగారిన వర్గాల తండ్లాటగా మారిందనీ, అడుగడుగునా అవమానాలు పడుతున్నామనీ, దళితులు పంచములు కాదనీ ఈ దేశపు పాలకులని, ఇతర దేశాల నుండి వలస వచ్చిన ఆర్యులు తమ పూర్వీకులను బానిసలుగా చేసి సమాజానికి దూరంగా ఉంచారనీ, దళితులే ఈ దేశపు మూలవాసులని ప్రకటించారు. ఆది హిందువులుగా అధికారికంగా నిజాం గుర్తించాలనీ డిమాండ్ చెయ్యటంతో ఆయన ప్రతి పాదనను స్వీకరించిన అప్పటి నిజాం ప్రభుత్వ ప్రధాన మంత్రి రాజకిషన్ ప్రసాద్ దళితులను అది హిందువులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో ఆది ఆంధ్ర, మద్రాసులో ఆది ద్రవిడ, కర్నాటకలో ఆది కర్నాటక పేర్లతో నాటి ప్రభుత్వాలు గుర్తించాయి. ఒక వ్యక్తి సమ సమాజ నిర్మాణలో పంచములుగా గుర్తించబడి అలనా పాలనా లేనివారికి అండగా నిలిచి కుల వివక్షను దూరం చెయ్యటానికి ఎంతగానో కృషి చేశారు.
దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నిజాం సంస్థానంలో కుల సంఘాలు అవిర్భవించాయి. రెడ్డి సంఘం, కమ్మసంఘం, వెలమ సంఘం, వైశ్య, పద్మశాలి సంఘాలు ఏర్పాటైనాయి. వారు ఇసామియా బజార్, అబిడ్స్, నారాయణ గూడ ప్రాంతాల్లో కుల సంఘాలకోసం కమ్యూనిటీ భవనాలు నిర్మించటం ప్రారంభించారు. బాల బాలికలను విద్యవైపు ప్రోత్సహించి వసతి గృహాలు ఏర్పాటుచేశారు. ఈ క్రమంలో వారిని చూసిన భాగ్యరెడ్డి వర్మ తమ సామాజిక వర్గాలకు కూడ భవనం ఉండాలనీ హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ చౌరస్తాలో అది హిందూ భవన నిర్మాణం ప్రారంభించారు. దళితుల అత్మగౌరవం నిలపటంకోసం నిర్మించిన మొదటి భవనం అది.
సమాజంలో అగ్రకులాల వారిచే పంచములుగా పిలవబడి జనజీవనానికి దూరంగా ఉన్నవారి సమస్యలపై ఉద్యమిస్తూ 1917లో నవంబరు 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు మొదటిసారిగా పంచమ మహాసభ నిర్వహించారు. సమావేశం అనంతరం విజయవాడ దుర్గామాత ఆలయానికి దళితులు వస్తారనీ భావించిన ఆలయ నిర్వహకులు మూడు రోజల పాటు దేవాలయాన్ని మూసి వేశారు. మహాసభకు హాజరైన కొందరి అభ్యర్థన మేరకు పంచమ మహాసభ పేరుకు బదులుగా ఆది ఆంధ్ర మహాసభగా మార్చారు. ఆది ఆంధ్ర మహాసభ విజయవంతమైన విషయాలు తెలుసుకున్న ప్రముఖ రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపిల్ల నవలను సినిమాగా తీశారు.
సమాజంలో మహిళలకు సమానమైన గౌరవం ఇవ్వాలనీ అప్పుడే అభివృద్ధి సాధ్యమనీ బోధించేవారు. మొదటిసారిగా ఆయన బాలికల కోసం కోఠిలోని ఇసామియా బజార్‌లో పాఠశాల ఏర్పాటు చేశారు. నిజాం ప్రభుత్వ హయాంలో అన్నీ ఉర్దూ మీడియం పాఠశాలలు ఉంటే భాగ్యరెడ్డివర్మ తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేశారు. దేశంలో సామాజిక న్యాయంకోసం పోరాడిన తొలి తరం సంఘసంస్కర్తల్లో జ్యోతి బా పూలే వారసునిగా దళిత జాతి కోసం కృషి చేస్తున్న అంబేద్కర్ నాగపూర్, ముంబయి, మహారాష్టల్ల్రో జరిగిన కార్యక్రమాలను దగ్గరగా గమనించే వారు. 1932లో లక్నోలో జరిగిన జాతీయ దళితుల సమావేశానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. అదే సమావేశంలో లండన్‌లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశ దళితుల ప్రతినిధిగా అంబేద్కర్‌ను పంపాలనే నిర్ణయం జరిగింది.
భాగ్యరెడ్డి వర్మ బహుభాషా కోవిదుడు. తెలుగుతోపాటు, ఉర్దూ, తమిళం, కన్నడ, మరాఠి, ఆంగ్లం భాషలను అనర్గళంగా మాట్లాడేవాడు. ఆయన జీవించిన కాలం 50 సంవత్సరాలే అయనా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారు.

- ఆస శ్రీరాములు