సబ్ ఫీచర్

నేడు ఇవి అవసరమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి స్ర్తిలందరూ ఉద్యోగినులే అవుతున్నారు. కొంతమంది ఆఫీసులకు, పని చేయాల్సిన ప్రదేశాలకు వెళ్లి పనులు చేస్తున్నారు. మరికొంతమంది వర్క్ ఫ్రం హోమ్ అని ఇంట్లో ఉండి పనులు చేస్తున్నారు. మరికొంతమంది స్వయం ఉపాధిమార్గాలను ఎంచుకుని ఏదొక పనిలో పగటి పూట సమయాన్నంతా గడిపేస్తున్నారు. ఇట్లా అందరూ తీరిక దొరకని పనుల్లో సతమతమవుతున్నారు.
వీరిలో గర్భిణులు కూడా ఉంటున్నారు. ప్రభుత్వమైనా, ప్రయివేటు సంస్థలైనా గర్భం దాల్చిన వారికి మెటర్నిటీ సెలవులని ఇస్తున్నారు. వీటిని కాదనలేం. కాని ఆ తరువాత ఆఫీసులకు వచ్చే మహిళలకు కొంత ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అవే పిల్లలకు పాలివ్వడం. బిడ్డ పుట్టిన నాటి నుంచి తల్లిపాలను ఇస్తుంటారు. ఇది కనీసం ఆరునెలలు సాగాలని అంటారు. కొంతమంది సంవత్సరం దాకా కూడా పిల్లలకు పాలిస్తుంటారు.
అయితే ఉద్యోగస్థులైన స్ర్తిలకు ఇది ఎంతోకష్టంగా ఉంటుంది. అందుకే పిల్లలకు పాలిచ్చే సదుపాయం ఉన్న గదులను ప్రతి ఆఫీసులోను ఏర్పాటు చేస్తే ఆ పిల్లలకు పాలిచ్చే సమయంలో పాలు పట్టేసి తిరిగి ఆఫీసు పనిలో దూరచ్చు. ఇటువంటి సదుపాయాలు క్రష్‌లు నిర్వహించే వారు కూడా చేపడితే బాగుంటుంది. కాని అక్కడ కూడా ఇటువంటి సదుపాయాలు అంతగా ఉండడంలేదు. అమెరికా వంటి దేశాల్లో మహిళల కోసం ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది. తల్లిపాలను సీసాల్లో పట్టి పెట్టి పిల్లలకు కావాల్సిన పుడు వాడుతున్నారు. వీటికోసం తల్లిపాల బ్యాంక్స్ అనే ఏర్పాటు అమెరికా వంటి దేశాల్లోనే ఉన్నాయి. మన భారతదేశంలోను అందులో తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతి అంతగా లేదు. పూర్వం పొలం పనులు చేసే ఆడవారికి పొలం పనులు చేయించుకునే వారు అటువంటి సదుపాయాల్నిచ్చేవారట. వారు కాసేపు పాలు పట్టే ఆ పిల్లల కడుపు నింపిన తరువాత వారు హాయిగా ఆడుకునేటపుడు వీళ్లు పనులు చేసుకొనేవారట. కాని ఇప్పుడు ఉన్న 24 గంటల్లో 7, 8 గంటలే కాక 10 గంటలు పని చేయించుకునే వారు కూడా పిల్లలకు కావాల్సిన సదుపాయం గూర్చిఅంతగా పట్టించుకోవడం లేదు. కనుక ఇప్పుడైనా ఈ పాలిచ్చే గదుల ఏర్పాటు గురించి మహిళా సంఘాలు కూడా దృష్టి పెడితే బాగుంటుంది. అన్నీ ఆఫీసుల్లోను, పబ్లిక్ ప్లేసుల్లో కూడా ఇటువంటి ఏర్పాటున్న గదులను నిర్మించాలి.

- జి. కల్యాణి