సబ్ ఫీచర్

ఇదీ వైజ్ఞానిక పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక పాశ్చాత్య వైజ్ఞానిక పురోగతిని పరిశీలిద్దాం. పాశ్చత్య వైజ్ఞానిక యుగానికి ‘‘ఐజాక్ న్యూటన్’’ని యుగకర్తగా భావించవచ్చు. అప్పటినుండి యిప్పటివరకూ పాశ్చాత్య శాస్తజ్ఞ్రుల దృష్టిలో వేదాంతం వేరు, విజ్ఞాన శాస్త్ర భావన వేరు. రెండు భిన్నధృవాలు. వారి దృష్టిలో ఒక పదార్థము, వేరొక పదార్థము వేరు వేరు పదార్థము మనసు వేరు, మనసు, మనసు, వేరు. ఈ విధంగా అన్నీ వేరువేరు. అంతా భిన్నమే ఏకత్వం లేదు. దీని పేరే ద్వయితము, మనమొక పుస్తకం చదువుతున్నామంటే, చదివేవాడువేరు, పుస్తకం వేరు, కాగితం వేరు, అక్షరాలు వేరు, ప్రింట్ (ఇంకు లేక సిరా) వేరు. ఈ విధంగా మొత్తమంతా భేదమే. ‘‘న్యూటన్’’ రుూ భిన్నత్వాన్ని తన జీవితంలోను, ప్రపంచంలోనూ సత్యమని నమ్మాడు. కాలక్రమంలో దీనికే ళ్ఘూఆజఒజ్ఘశ జూఖ్ఘజఒౄ అని పిలిపించారు. ఈ భావన ప్రధాన ప్రాతిపదికగా 19వ శతాబ్దపు శాస్త్ర పరిశోధన కొనసాగింది. 1905వ సంవత్సరంలో ఈ భావనకొక అఘాతం కలిగింది.
అదేమిటంటే ‘‘జ్యూరిచ్‌లోని పాలిటెక్నిక్‌కు చెందిన 21 సంవత్సరాల ‘ఆల్‌బర్ట్ ఐన్‌స్టీన్’ అనే వ్యక్తి ఒక సిద్ధాంత వ్యాసాన్ని ప్రకటించాడు. దానిపేరు ‘‘కదిలే పదార్థాల ఎలక్ట్రోడైనమిక్స్’’. దీనిలో ఆయన చెప్పిందేమిటంటే,ఘన పదార్థంగా కనిపించే ద్రవ్యం యదార్థానికి ఏదో ఒక శక్తి స్వరూపమేనని, అంతే కాక పదార్థాన్ని శక్తిరూపంగా మార్పుచేయడం సాధ్యమేనని చెప్పి సిద్ధాంతీకరించడమే కాక ఉ=ష2 అనే సుప్రసిద్ధ సూత్రాన్ని ఆవిష్కరించాడు.
దీనిననుసరించి ‘న్యూక్లియర్’ శక్తికి చెందిన కార్యక్రమాలన్నీ తరువాతి కాలంలో మొదలయ్యాయి.నేడు మనం అణురియాక్టర్ల రూపంలో పదార్థము- శక్తిగా రూపాంతరం చెందడాన్నిచూస్తున్నాము కదా! ఒక యురేనియన్ అణువును తీసికొని దానిలోని భాగాలను జఒఒజ్యశ అనే ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేస్తే దేనిలోని కొంత భాగం విధ్వంసం చెంది శక్తిరూపంలో పరిణామం చెందుతోంది. దీనినే అణుశక్తి అంటున్నాము. ఈ శక్తిని కొన్ని దేశాలు ఆయుద్ధంగా మార్చుకొని మానవ వినాశనానకి, మొత్తంప్రకృతి వినాశనానికి సిద్ధవౌతున్నాయి. మానవత్వానికి కాదు పరిణామంలో ‘‘న్యూటన్’’ ద్వైత సిద్ధాంతానికి ‘ఐన్‌స్టీన్’ సిద్దాంతావిష్కరణతో వైజ్ఞానికంగా పెద్ద దెబ్బతగిలిందనే చెప్పాలి. ఎందుకంటే పదార్థం వేరు, శక్తి వేరు కాదని తేలింది. ఈ ఆవిష్కరణ జరిగిన 22 సం.ల తరువాత 1927లో పైన చెప్పిన పాశ్చాత్య ద్వైత భావనకు మరో పెద్ద విఘాతమేర్పడింది. హైసన్‌బర్ అనే యువ శాస్తవ్రేత్త కొత్త సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. దాని పేరు అనిశ్చిత వాదము (అన్‌సర్టనిటీ ప్రిన్సిపల్).
ఈ వాదం నోబెల్ బహుమతి గెలుచుకుంది. నవీన శాస్త్ర విజ్ఞానంలో యిదొక కొత్త అధ్యాయంగా చెప్పారు. ఈ సిద్ధాంతాన్నననుసరించి ‘న్యూట్రాన్సు’ అనబడే అణుభాగాల ద్వారా న్యూక్లియరు రియాక్టరును తయారుచేస్తారు. ఈ పద్ధతిలో ఒక అణువు న్యూట్రాన్‌ల కిరణంతో బేధిస్తారు. ఈ ప్రక్రియ జరిగేటపుడు ఒక ప్రత్యేక సమయంలో ఆ న్యూట్రాన్ కిరణంలోని భాగాలను లెక్కపెట్టవచ్చును. ఆ భాగాల సంఖ్య స్థిరంగా వుంటే ఆ రియాక్టర్ బాగా పనిచేస్తోందని అర్థం. అంటే న్యూట్రాన్స్‌ను అతి సన్ననైన ఘనపదార్థ రేణువులుగా లెక్కించడం సాధ్యవౌతుందన్న మాట!
అంటే నూట్రాన్సు అనేవి అణువులోని ఖండాలు లేక భాగాలని నిశ్చయమైంది. అంతేకాక న్యూట్రాన్ కిరణాన్ని ఒక గాజు కటకంలోకి ప్రసరింపజేస్తే పరావర్తనం ఏర్పడుతుంది. అంటే న్యూట్రాన్ కిరణం తరంగ స్వభావం కలిగి వున్నదన్నమాట. తరంగ లక్షణం లేకపోతే పరావర్తనం ఏర్పడే అవకాశం లేదు.
అదేవిధంగా కాంతి కిరణాలు అనేక సందర్భాలలో అణుఖండాలుగాను, మరికొన్నిసార్లు తరంగాలుగాను వ్యవహరించడం కనిపిస్తూంటుంది. ఈ కాంతి కారణాలని అణు ఖండాలను నేడు ఫోటోన్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఫోటాన్సు సిద్ధాంతాన్ని కనుగొన్నందుకే ఐన్‌స్టీన్‌కు నోబుల్ బహుమతి ఇచ్చారు.

..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590