సబ్ ఫీచర్

సమీక్షించుకోవలసిందే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనను మంచి మనిషి అని అందరూ అనుకోవాలన్న తాపత్రయం లేనివారు ఎవరూ ఉండరు. ఏ కొందరో తన గురించి ఇతరులు ఏమీ అనుకోనక్కర్లేదు అంటారు కాని వారి మనసులను తరచి చూస్తే ఎక్కడో ఒకచోట ఇతరులు తన గురించి ఏమనుకొంటారో అనే యావ ఉండనే ఉంటుంది. అందులోను మహిళలైతే ఈ భావన మరీ ఎక్కువ. ఉన్నత పదవుల్లోనో, లేక బాగా ధనవంతుల ఇళ్ళల్లో ఉన్న స్ర్తీలైతే తన గురింఛి మంచిదాన్నని అనుకోవాలి అని దానాలు ధర్మాలు చేస్తుంటారు. పేదవారిని అక్కున చేర్చుకుంటారు. అంతేకాదు సామాజిక బాధ్యత అని ఎన్నో మంచికార్యాలు కూడా అందరినీ కలుపుకుని చేపడుతుంటారు. ఇక మధ్యతరగతి స్ర్తీలైతే తమను మంచివారు అనుకోవాలని శక్తికి మించిన పనులు కూడా చేస్తుంటారు. ఆఫీసుల్లోను అంతే తమను మంచివారు అనుకోవాలని ఎంతో చేస్తుంటారు. ఇదంతా కేవలం ప్రచారం కోసం అయనా తమ శక్తిని పూర్తిగా ధారవోసి మరీ పనులు చేస్తుంటారు.
ఇది ఒకందుకు మంచిదే. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పొగడ్తలకోసం చేసినా అది నలుగురి మంచికోసం చేసినపుడు మంచిఫలితం వస్తుంది. ఒకసారి ఎవరికి వారు మంచే చేస్తున్నాను కదా అని కూడా ఆలోచించుకుంటే మరింత మంచి పనులు చేసే అవకాశాన్ని పెంచుకున్నట్టు అవుతుంది. ఎవరూ లేనప్పుడు విశ్రాంతిగా ఉన్నప్పుడు తన్ను తాను నిజంగా మంచి పనులే చేస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి.
సమాధానాన్ని వారి వారి అంతరంగం నుంచి రాబట్టుకోవాలి. అపుడే సరియైన సమాధానం వస్తుంది. ఏదైనా అహంకారం పొడచూపుతుందేమో కూడా ఆలోచించుకోవాలి. అపుడే ఎంత ఉన్నత స్థితుల్లోకి వెళ్లినా అహంకారం లేకుండా ఇంకా మంచిపనులు చేయడానికే ముందుకు వెళ్లడానికి మార్గాలు ఏర్పడుతాయ. మంచి చేయడానికి కూడా కొన్ని నియమాలను పెట్టుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోను దుష్టులకు భయపడకూడదు. అవసరమైనపుడు కోపాన్ని ప్రదర్శించాలి. చెడును అణచివేయడంలో తప్పులేదు. అర్హత లేనివారికి సహాయం చేయకూడదు. చేసిన సహాయాన్ని మరచిపోవాలి. చేసిన సహాయాన్ని గురించి చెప్పుకోకుండా సహాయం పొందినవారు తిరిగి సహాయం పొందేస్థితినుంచి బయటకు వచ్చారా లేదా అన్నది కూడా చూసుకోవాలి. వారు ఇతరులకు సాయం చేసే స్థితికి ఎదగాలని కోరుకుంటూ సాయం చేయాలి.

-బి.లత