సబ్ ఫీచర్

స్వాధ్యాయ సందోహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
(2)

వేదోపదేశం మానవులకు అతిక్రమించరానిది. ఎందుకంటే మానవ సమాజ హితం వేదధర్మాచరణ యందే వుంది. అందుకే వేదర్షి ‘మంత్రశ్రుత్యం చరామసి’- ‘‘వేదమంత్ర ధర్మోపదేశానుసారంగా నడచుకొంటాం’ అని మరో ప్రతిజ్ఞ చేయించాడు. ఈ రీతిగా అపౌరుషేయమైన వేదం ద్వారా మానవ సమాజ శ్రేయస్సు కొరకు ఋషుల ద్వారా వేదోపదేశం చేసాడు భగవానుడు. వేదమంత్రాల ద్వారా బోధింపబడే సద్బోధ గురూపదేశం కంటె భిన్నం కాదు. అందుకే మంత్రాన్ని వేదం గురువుగా ‘మంత్రో గురుః పునరస్తు’’ అని ఋగ్వేదం పేర్కొంది. ఏది కర్తవ్యమో- ఏది అకర్తవ్యమో తెలియనపుడు వేదమంత్రానే్న ఆశ్రయించాలి. మంత్ర శబ్దనికర్థం విచారణ చేయడమని కూడా ఉంది. అంటే ఏ పని కూడా విచారించకుండా చేయరాదని భావం. ఈ విధంగా వేదం ఈ వేదోపదేశాన్ని ఉదాహరణ పూర్వకంగా పక్షేభిరపి కక్షేభిరత్రాభి సం రభామహే’’- గడ్డిపోచ వంటి అల్పజనులతో కలిసిమెలసి చురుకుగా పనిచేస్తాం’’ అన్న వాక్యంలో వివరించింది. అంటే ఎటువంటివారినయినా అసహ్యభావంతో లేదా నీచులన్న దృష్టితో చూడమని వారి ఆంతర్యం. లోకంలో ఎంతటి నీచమైన వస్తువయినా దానికుండే ప్రాధాన్యమెంతో కొంత ఉండనే ఉంటుంది. తెలివైన వ్యక్తిదాని సహాయంతో కూడా కార్యాలను సాధించుకోగలడు.
ఈ రీతిగా ఈ మంత్రం ఒకరెక్కువ, మరొకరు తక్కువ అనే భావాలు మానవ సమాజానికి చేటు కలిగిస్తాయి. కాబట్టి వాటిని విడిచి అందరి ఎడల సమభావంతో కలసిమెలసి ప్రవర్తించండి అని మానవ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉంది.
ఇక రెండవ విపరీతార్థమేమంటే ‘కృతహననమ్’ అనగా చేసిన పాప పుణ్య కర్మలు వినాశనం కావడం. దీనివల్ల పైన ఆత్మ నశించేదని చెప్పబడిన కారణంగా శరీరం నశించడంతోబాటుగా కూడా నశించిపోతుందన్న అభిప్రాయం కలుగుతుంది. అలా ఆత్మ నశించడం ద్వారా పాప పుణ్యకర్మలు చేసిన ఆ ఆత్మ ఆ పాప పుణ్య ఫలితాలను అనుభవించకుండానే నశిస్తుందని సిద్ధాంతీకరించవలసి యుంటుంది. అది సనాతన ధర్మ వౌలిక సూత్రాలకే విరుద్ధం. ఈ విధంగా హేతుబద్ధంగాని ఈ దుర్వ్యవస్థను తొలగించేందుకే ఆత్మ ‘అనిపద్యమానం’, ‘ఆత్మ నాశనరహితమైనది’ అని వేదం పైమంత్రంలో స్పష్టంగా పేర్కొంది. వేదనావచనానుసారం ఆత్మనిత్యమూ- శాశ్వతమూ అని అంగీకరించడం ద్వారా పాప పుణ్య కర్మలను చేసిన ఆత్మకు ఆ పాప పుణ్య ఫలాలను ప్రదానం చేసి వానిని అనుభవింపజేసేందుకు ఈ జగత్ సృష్టిని భగవంతుడు చేసినాడని స్పష్టమవుతుంది. ఇదే సృష్టికి ప్రయోజమని సిద్ధిస్తున్నది.
ఇది ఇలా ఉండగా మరికొంతమంది శరీరం వలె ఆత్మ కూడా పుట్టేదేనని, అయినా అది నశించదని భావిస్తారు. ఇది వారు యుక్తియుక్తంగా అంటే తార్కికంగా (లాజిక్) చెప్పిన మాట కాదు. ఎందుకంటే పుట్టింది ఎక్కడైనా గిట్టకుండా (నశించకుండా) సృష్టిలో ఏదైనా ఎక్కడైనా ఉందా?
3.ఆ చ పరా చ పథిభిశ్చరంతమ్: ఈ వాక్యం ద్వారా వేదం ఆత్మకుగల స్వతంత్రను గట్టిగా ప్రకటించింది. ఆత్మకు ముఖ్యంగా స్వాతంత్య్రం ఉన్నపుడే కదా అది మంచిగాని చెడుగాని చేయగల్గుతుంది. వేదం ప్రకటించిన ఈ భావాన్ని గ్రహించి ఆత్మతత్త్వజ్ఞులు ‘కర్తుమకర్తు మన్యథా వా కర్తుం సమర్థః’- ‘‘దేనినైనా చేయడానికి చేయకపోవడానికి లేదా వ్యతిరేకంగా చేయడానికి ఆత్మకు సామర్థ్యం మరియు స్వాతంత్య్రముంది’ అని దృఢంగా చెప్పినారు. అందుకే ఆత్మ సర్వకార్యాలకు కర్త. అందువల్లనే మహాత్ములు ‘స్వతంత్రఃకర్తా’ ఏ పనిచేసేందుకైనా సంపూర్ణ స్వాతంత్య్రం కలవాడే ‘కర్త’ అని నిర్వచించారు. 4.మంచి మార్గంలో నడువు. మంచి పనులనే చేయి. దాని ఫలాలు కూడా మంచిగానే ఉంటాయి. అట్లే చెడు మార్గంలో నడుస్తూ చెడు పనులను గాని చేస్తే దాని ఫలితాలు కూడా దుఃఖదాయకంగానే ఉంటాయి.

..........................ఇంకావుంది