సబ్ ఫీచర్

ప్రత్యేక పాటలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిల్క్‌బ్యూటీ తమన్నా భాటియా ఇటు హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక పాటలోనూ మెరుస్తోంది. ‘అల్లుడు శ్రీను’, ‘జై లవకుశ’ తదితర చిత్రాలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్‌కు మంచి గుర్తింపు లభించింది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లోని స్పెషల్ సాంగ్స్ ఆఫర్లు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చందు మొండేటి తెరకెక్కిస్తున్న ‘సవ్యసాచి’ చిత్రంలో నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ ‘హలోబ్రదర్’లోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు’అనే పాటను రీమిక్స్ చేస్తున్నారు. ఈ పాటలో చైతూతో ఆడి, పాడే అవకాశం తమన్నాకు దక్కింది. నాగార్జున, రమ్యకృష్ణ కలయికలో వచ్చిన ఈ సాంగ్ అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఈ సాంగ్ ఒరిజినల్ కంపోజర్ ఎం.ఎం.కీరవాణి ఈ రీమిక్స్‌సాంగ్‌ని కూడా కంపోజ్‌చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతూకు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తోంది.