సబ్ ఫీచర్

మల్లెలతో మురిపాల జడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలం వచ్చిదంటే మల్లెల గుబాళింపును ఆసాద్వించనివారు ఉండరు. ఎన్నిరకాల పూలున్నా పరిమళాలు వెదజల్లే గుప్పెడు మల్లెలనే ఇష్టపడతారు. ఇది పెళ్లిళ్ల సీజన్‌తో పాటు ఈ కాలంలో లభించే మల్లెలతో పూలజడలను వేయించుకోవటానికి ముచ్చటపడుతుంటారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ ముచ్చట ఎక్కువగా కనిపిస్తోంది. పిల్లలు, యువతలు, మహిళలు సైతం సొయగాలొలికే పూల జడల అలంకారం పట్ల మక్కువ చూపిస్తారు. మల్లెలను జడపాయల్లో కూర్చి అందంగా పూలజడను అలంకరించుకునే విషయంలో ప్రాచీన కాలం మొదలు ప్రస్తుత హైటెక్ యుగం వరకు పూలపట్ల మహిళలకు ఇసుమంతైనా తగ్గలేదు. ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా రకరకాల పూలజడలు వచ్చాయి. నిండుజడ, పాయలజడ, వాలుజడ, వంకులజడ, పలకలజడ, చక్రాలజడ, బిళ్లలజడ, పూసలజడ, పేర్లజడ, డైమండ్ జడ, పాముపడగ జడ, పెడల్స్ జడ, లల్లీ జడ, చేపజడ, క్రాస్ జడ, పుల్లల జడ, రెడీమేడ్ జడ వంటి ఎన్నోరకాల జడలు ప్రచారంలో ఉన్నాయి. హైందవ సంప్రదాయంలో వివాహ సమయం లో వధువుకు పూలజడ ముస్లింలు నిఖా (పెళ్లి) లోనూ మల్లెపూలను వాడటం ఆచారంగా వస్తోంది.
పూలజడ వేయటానికి పెద్దవారికి మూడు కిలోలు, పిల్లలకు రెండు కిలోల మల్లెలు అవసరం అవుతాయి. జడను సింగారించేందుకు కనకాంబరాలు, గులాబీలు, మరువంతో పాటు పూలరేకులను సైతం కూర్చి తాము ఎంచుకున్న డిజైన్‌కు అనుగుణంగా పూలను అల్లిక చేస్తారు. కనీసం ముగ్గురు మహిళలు రెండు గంటల సమ యం ఏకాగ్రతతో శ్రమిస్తే తప్ప అందమైన పూలజడ పూర్తికాదు. నిండుజడ, పేర్లజడ, పడగజడ, డైమండ్‌జడల రూపకల్పనకు ఎక్కువ సమయం పడుతుంది. శ్రమ ఓర్వలేని మహిళలు మార్కెట్‌లో లభించే రెడీమేడ్ పూలజడల ను అలంకరించుకుని ముచ్చటతీర్చుకుంటుంటారు. కిలో మల్లెలు, 50 గ్రాముల కనకాంబరాలు, కొద్దిగా మరువం కొప్పుల సింగారానికి వినియోగిస్తారు. అరగంటలో అందమైన కొప్పు వేసేయ్యవచ్చు. ఈ నేపథ్యంలో నిండుముడి, నాగరముడి, చుట్టుపాయలమూడి, నాలుగుపాయల ముడి అనే ముడులు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూల జడ వేయంచుకున్నారంటే తప్పకుండా పట్టుబట్టలు కట్టుకుని జడ కనిపించేలా ఫొటోలు తీయించుకుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పూలజడల ఫొటోలు తీసేందుకు స్టూడియోల నిర్వాహకులు, నిలువెత్తు అద్దాలు ఏర్పాటు చేయడమూ గమనార్హం. అదొక తీపి గుర్తుగా ఈనాటికీ అనేక ఇళ్లల్లో కనిపిస్తోంది.

- కరీముల్లా, పొన్నూరు