సబ్ ఫీచర్

చిత్రాలతో చింతలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళకు కాదేది అనర్హము. కళాహృదయం ఉండాలి. కళ ఒకరి సొత్తు కాదు. పుట్టుకతో వచ్చిన కళ ఏదో ఒక రూపంలో బహిర్గతమవుతుంది. కళాభిరుచి ఉంటే ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా తమ నైపుణ్యానికి పదును బెడతారు. మన చుట్టూవున్న ప్రకృతియే మన ఉపాధ్యాయని. ఆ ప్రకృతే మనకు అన్నీ పాఠాలను నేర్పిస్తుంది. ఆకలైతే అన్నం ఎలా తింటామో కళను ఆవిష్కరించగలిగిన వారికి వారి చేతికి కుంచె ఇచ్చి దిద్దిస్తుంది ప్రకృతి. ఆ ప్రకృతే కళామతల్లి. ఆ తల్లి ఒడిలో అక్షరాలు దిద్దుకున్న కుంచెతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించవచ్చు. అట్లా ఆవిష్కరించగలిగిన కుంచె పట్టుకొన్న చేయనే ముచేల ఉమ.
కవిత్వం అన్నా, సాహిత్యంఅన్నా మక్కువ ఎక్కువ ఆమెకు. దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి ఎప్పుడూ తన వెంటనే పెట్టుకుంటుంది. ఆ అమృతం కురిసిన రాత్రేచదువుతూ ఉంటే ఎన్నో వెనె్నల పరిమళాలను మనసున చిత్రాలుగా మలుచుకుంటాయ అంటారామె. దానికి తోడుగా తండ్రి శతావధాని కీ.శే డా సిలి సుబ్బన్న. వీరు రచయతే. వీరి బాలల కథలు, పెద్దల కథలు అలనాడుపత్రికల్లో అచ్చు అయ్యేవి. అందుకే వారససత్వ సంపదగా ఉమకు కథలు రాయడం కూడా అలవాటు అయంది. చిన్న నాడే కథలు వ్రాసి ప్రముఖ పత్రికలకు పంపితే ప్రచురించేవారు. దీనికి కారణం మాత్రం ఇంటినిండా పుస్తకాలు, ఎందరో సాహితీ మిత్రులు, ప్రముఖులు నాన్నగారి దగ్గర సాహిత్య చర్చాగోష్టి జరపడంతో వారి మాటలు వింటూ వింటూ నాకు తెలియకుండానే నాలో సాహిత్య పిపాస కలిగింది వినమ్రంగా చెబుతారు ఆమె. అట్లా సాహిత్యంపై అభిమానం పెంచుకున్న ఉమ నేడు అటు సాహిత్య పరంగాను, ఇటు చిత్రకారిణిగాను తన దైన ముద్రను నిలుపుకుంటోంది.
వివాహానంతరం భర్త (వేణుగోపాల్) పరాయి దేశంలో ఉండడంవల్ల తెలుగుకి దూరమయ్యారు. గృహిణిగా బాధ్యతలు నిర్వహించడం, ఆ దేశంలో పరిస్థితులను బట్టి సమాజానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా నివసించడంవల్ల తన భావాలను చిత్రలేఖనంలో సమ్మిళితం చసి, రేఖలకు రంగులు అద్దడం ప్రారంభించారు. తాను చదువుకున్న చూసి తెలసుకొన్న సాహిత్యాన్నంతా కూడా కుంచెతో వంపడం ఆరంభించాను నేను ఆ పరిసరాల ప్రభావంతో అంటారు.
సాహితీ తృష్ణను చిత్రలేఖ తృష్ణగా మార్చుకొని 200 చిత్రాలకు ఊపిరిపోశారు. ఈమె చిత్రాలు ప్రముఖులతో పోటీపడి మాసపత్రిక మాతృదిన్సోవ ముఖచిత్రంగా వెలువడింది. స్ర్తియొక్క ఆరాటం, మానసిక పోరాటం, రాధాకృష్ణలు, శివపార్వతులను చిత్రించారు. నాలుగేళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎన్నో గ్యాలరీలు విజిట్ చేసి ఎంతో ప్రేరణ పొంది పెయింటింగ్స్ వేయడంలో లీనమై తన కాలాన్ని సద్వినియోగ పరచుకోవడమేగాక ఎగ్జిబిషన్స్ కూడా పాల్గొంటున్నారు. ఒక సోలో షో కూడా ఇచ్చారు. ఈమె చిత్రాలను కొందరి ఇష్టపడి మరీ వేయంచుకుంటూరు ఉంటారు. రెండు ఆర్ట్ క్యాంప్స్‌లో పాల్గొన్నారు. పెన్సిల్ డ్రాయింగ్, వాటర్ పెయింటింగ్స్ చిత్రాలే ఎక్కువగా చిత్రిస్తారు. సూర్యోదయాన్ని చిత్రించడం అంటే నాకెంతో ఇష్టమని చెప్తారామె. ఎక్కువ చిత్రిస్తారు. తెనాలి అంజత కళారామం వారి జ్యూరీ ఆవార్డ్స్ రెండు, అమలాపురం కోనసీమ కళారిషత్‌వారి జ్యూరీ అవార్డులు రెండు పొందారు. ప్రొద్దుటూరు కడప జిల్లాలో పుట్టి పెరిగారు. బికాం చదివారు. ఒక అక్క, ఇద్దరు అన్నలు, ముగ్గురు చెల్లెళ్ళు మధ్య నాలుగవ సంతానంగా జన్మించారు. ఈమెకు ఇద్దరు పిల్లలు. వారిని చక్కగా చదివించుకుంటూ వారుతెలుగుకు వారసులై జీవించేట్టు తన కృషిని సాగిస్తూనే చిత్రకళతో ఎంతోమంది అభిమానులను పొందుతున్నారు ముచేల ఉమ. చిత్రాలు గీస్తూ ఉంటే చింతలు కూడా దూరమవుతాయని మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఉమ అంటారు.

--వాణి