సబ్ ఫీచర్

మార్గదర్శకులు మీరే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులపై నానాటికీ అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిజమే అయితే వీటిని నిలువరించడం ఎలా అన్నదే సమస్యగా నేడు మారింది. పదేళ్లు దాటిన మగపిల్లలంతా పిలిచి వారికి సరియైన అమానుషాలకు ఒడిగట్టినపుడు ఆ ఆడపిల్లలు ఎంత ఆవేదన చెందుతారో వారికి విడమర్చి చెప్పాలి. కేవలం వారికే కాక చదువుకుంటున్న యువతతో చర్చలు జరిపి కోరిక పై నియంత్రణ ఉంటేనే అది సంతోషాన్నిస్తుంది కాని ఇతరులను ఇబ్బంది పెట్టి వాళ్లు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే వచ్చే ఆనందం కాదని వారికి వివరించి చెప్పాలి. అట్లానే రిటైర్డ్ అయిన వారిని పిల్చి కూర్చోబెట్టి జీవిత చరమాంకంలో ఉన్న వారు ఇతరులకు ఆదర్శంగా జీవించాలి, లేదంటే ఇతరులు చెడు దోవలో వెళ్తుంటే దాని వల్ల వచ్చే నష్టాలను చిన్నవారికి చెప్పాలి కాని, అవి అన్నింటినీ వదిలేసి పసికూనలను, ముక్కు పచ్చలారని చిన్నారులను తమ కాముకత్వానికి బలి చేయడం ఎక్కడి సంస్కృతిని అని వారిని గట్టిగా నిలదీయాలి. వారి కూతుర్లు, కోడళ్లు, మనవరాళ్లు ఇలా ఎంతమంది ఆడపిల్లలను వారి జీవితంలో వారు చూసి ఉంటారు. వారంతా కళ్లముందు కనిపిస్తూనే ఉంటారు కదా. ఆడపిల్ల అంటే ఆదిశక్తే కదా. ఆ శక్తి కనుకే కనుమరుగు అయిపోతే ఇక జీవనం ఎలా సాగుతుంది. సృష్టి ఏమూల నుంచి పుట్టుకువస్తుంది. అన్నీ తెలిసి మూర్ఖత్వానికి ఎందుకు ముందుకు వెళ్లుతున్నారు అని వారిని నయాన భయాన అడగాలి. వారి చేయూత తోనే యువత పెడమార్గాన్ని వదిలి మంచిమార్గంలోకి పయనిస్తారని వారు స్ఫూర్తిదాతలుగానో మార్గదర్శలుగానో మిగలాలి అని వారిలో చైతన్యాన్ని కలిగించాలి . వారి మూర్ఖపు ఆలోచనలకు స్వస్థిచెప్పేలా వారిని ఒప్పించాలి. ఇట్లా చేస్తేనే ఆడపిల్లలను రక్షించుకోగలం. కేవలం తప్పు చేసిన వారిని శిక్షించడం చట్టం చేస్తుంది. కాని స్వచ్ఛంధ సంస్థలు, ఆడపిల్లలున్న తల్లితండ్రులు, సమాజం మీద అభిమానమున్న ప్రతివారు ముందుకు వచ్చి యువతలోను, ముసలివారిలోను మార్పు తీసుకొని రావాలి.

--అయినం రఘరామారావు