సబ్ ఫీచర్

విశ్వ చైతన్యం-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరబ్రహ్మేంద్ర స్వామి ఎంత అద్భుతంగా వివరించారో బ్రహ్మజ్ఞానాన్ని! కండ అంటే మాన శరీరం. కుండ అంటే మణిపూరకం. కుండలినీ అంటే ఆత్మశక్తి-జీవాత్మ. ధ్యానం చేస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే మన కుండలినీ శక్తి మణిపూరకానికి చేరుకుంటుంది.
నిండిన ఒక జలాశయంలా తయారై అక్కడినుండి మన ఆత్మప్రయాణం ఇక రెండు తాచుపాములు సృష్టికార్యం చేస్తున్నట్లు ‘2 డిఎన్‌ఎ’గా ప్రయాణం కొనసాగించి ఆపై క్రమంగా అనాహతం చేరుకుని వౌనమై, తేలిక అయి విశుద్ధం చేరుకుని శుద్ధ వాక్కుగా మారుతుంది. ఆ తర్వాత ఆజ్ఞాచక్రంలో ఆజ్ఞ అయి తదుపరి సహస్రారంలో పడగబట్టి నాట్యం చేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి పొంది చక్రవర్తిలా!
అగస్త్య మహర్షి సప్త సముద్రాల నీటిని మ్రింగి తన మణిపూరక చక్రం (కడుపు)లోఎలా నింపగలిగాడు? అంతటి అక్షయకుండ - ఎలా సాధ్యమైందిః సాధన మరి బంధన మన సాధనాశక్తి అవగాహన అనుభవాలతో అనుభూతి ఎంతగా చెందుతూ ఉంటే మన ఆత్మ ప్రయాణం (కుండలినీ ప్రయాణం) అంతగా జరుగుతూ ఉంటుంది. అర్జునుడిని గుడాకేశుడు అని సంబోధిస్తాడు శ్రీకృష్ణుడు. గుడాకేశుడు అంటే నిద్రపోనివాడు. తస్మాత్ యోగీ భవార్జున అని బోధిస్తాడు నారాయణుడు నరునికి. అర్జునుడు నరుడు శ్రీకృష్ణుడు నారాయణుడు. అర్జునుడు రాత్రిళ్లు తెల్లవార్లూ యోగసాధన మరి అస్త్ర శస్త్ర సాధాన చేసేవాడు నిరతమూ నిరంతరమూనూ.
ద్రోణాచార్యుల ప్రియశిష్యుడు అర్జునుడు. అస్తశ్రస్తవ్రిద్యల్లో అర్జునుడిని ఆరితేరిన విలుకానిగా తయారు చేశాడుద్రోణుడు. అశ్వత్థామ ద్రోణుని కుమారుడు. అతడు తండ్రి నుండి అర్జునుడిలా అన్ని అస్తశ్రస్తవ్రిద్యలూ నేర్చుకున్నడు. ‘బ్రహ్మాస్త్రం’ ప్రయోగించే విద్య తో సహా. అయితే బ్రహ్మాస్త ఉపసంహార విద్యను అర్జునుడు నేర్చుకోగలిగాడు. అశ్వత్థామ మాత్రం మరి ఏ కారణం వల్లనో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ఉపసంహార విద్య నేర్చుకోలేకపోయాడు. అపుడు తండ్రి తో అశ్వత్థామ ఇలా అన్నాడు. ‘పితృదేవా! మీరు అర్జునుడిని మీతో సమానమైన స్థాయిలో విద్యలన్నీ నేర్పారు. నేను మరికొంత కింద ఉన్నాను కనుక నాకు ఏదైనా ఒక అస్తవ్రిద్య మరొకటి నేర్పి దానిని అర్జునునికి నేర్పనని నాకు మాట ఇవ్వండి’ ద్రోణాచార్యుల వారు అశ్వత్థామకు చీకటిలో బాణాలు వేసే విద్య నేర్పాడు. దాన్ని శబ్దగ్రహణ విద్య అంటారు. ద్రోణుడు ఈ విద్యనేర్పుతూ తనలో తాను నవ్వుకున్నాడు. ఒకరోజు రాత్రి భోజనం చేస్తూన్నపుడు దీపాలు ఆరిపోయాయి. అర్జునుడు తన ఆహారాన్ని ఆ చీకటిలోనే తినేసాడు. అపుడే అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ రాత్రిపూటనే బాణం వదిలాడు. ఆ బాణం వెళ్లిన శబ్దం వింటూ మరో బాణం దానికి తగిలేట్టుగా వదిలాడు. అలా బాణం తరువాత బాణంవేస్తూ ఒక బాణపు రజ్జును తయారు చేసి ఆ శబ్దగ్రహణ విద్యను తనకు తానే నేర్చుకోగలిగాడు అర్జునుడు. ఎలా ఇది సాధ్యమైంది ఆ ఏకాగ్రత! ధ్యానంవల్ల! ధ్యానమొక్కటే రాజమార్గం- ధ్యానమొక్కటే రాజయోగం! ధ్యానం చేసేవారే దేవతలు! అరగంట ధ్యానం అరచేతిలో వైకుంఠం! ధ్యానమంటే కాఫీ త్రాగినంత సులభం! అర్జునుడు తెల్లవార్లూ ధ్యానయోగ సాధన మరియు అస్త్ర శాస్త్ర సాధన చేసేవాడు అని చెప్పుకున్నాం కదా! ఎంత శ్రద్ధగా ధ్యానం చేశాడో అంత శ్రద్ధగా విలువిద్యా సాధన చేశాడు కనుకనే శబ్దగ్రహణ విద్యను స్వయంగా సాధించాడు అర్జునుడు.
‘శ్రద్ధా - సబూరి’ అని ఎప్పుడూ బోధించేవారు షిర్డీ సాయిబాబా ‘శ్రద్ధ-సహనం’ అని. సాధన ఎంతో శ్రద్ధగా చేయాలి. అది ధ్యాన సాధన అయినా- విలువిద్యా సాధన అయినా! మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తూనే వుంటాయి. సహనంలో వాటిని సాధకుడు భరించాలి! సాధనమున సమకూరు పనులు ధరణిలోన! సాధన చేయమురా నరుడా సాధ్యము కానిది లేదురా అన్నారు తుకారాం.
స్వాధిష్ఠాన లక్షణమన నేయి- మణిపూరకమైన అగ్నిలో దగ్ధమై ‘విభూది’గా మారుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని శ్రీకృష్ణులవారు చెప్పినదాన్ని గురించి అర్జునుని ఆత్మశక్తి గురించి రేపు చెప్పుకుందాం! ఇది మణిపూరక శక్తి!

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908