సబ్ ఫీచర్

అవిశ్రాంత వైద్య విద్యావేత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొంబయి మూడేళ్ల వయసులోనూ ఆయన ఓ నిరంతర అనే్వషి.. వైద్య విద్యావేత్తగా తనకున్న సుదీర్ఘ అనుభవంతో ఆయన తెలుగు భాషకు ఎనలేని సేవలు చేశారు. అపురూపమైన వైద్య నిఘంటువులను, సైన్స్ పుస్తకాలను వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. ఆయనే- డాక్టర్ ఒ.ఎ. శర్మ. వైద్యరంగానికి, తెలుగు భాషకు చేసిన అవిరళ కృషికి గుర్తింపుగా ఆయనకు విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాల యాజమాన్యం శుక్రవారం నాడు (జూన్ 1న) గౌరవ సత్కారం జరుపుతోంది. వృద్ధాప్య భారాన్ని లెక్కచేయక ‘అవిశ్రాంత వైద్య విద్యావేత్త’గా ఆయన తెలుగు అకాడమీకి పారిభాషిక పదకోశం - వైద్యశాస్త్ర నిఘంటువు రూపకల్పనకు తుదిమెరుగులు దిద్దుతున్నారు.
జనరంజక వైద్యశాస్త్ర విజ్ఞాన ప్రచురణలలో భాగంగా డా.శర్మ ప్రాచీన, అర్వాచీన ఆరోపాలతో పాటు పదబంధాలు, న్యాయాలు, శాస్త్ర పరిభాష పదాలతో నిఘంటువులు వెలువరిస్తున్న విజ్ఞాన పారంగతులు. తెలుగులో వైద్య విజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు నూతన పదాలు, అర్థాలతో జతపరచడంలో ఆయనది అందెవేసిన చేయి. అనేక రకాల వ్యాధులపై తెలుగు జనావళికి అవగాహన కల్పించటానికి వీరి రచన ‘వ్యాధులు వి జ్ఞానం’ అకాడమీ ప్రచురణ ఎన్నో ముద్రణలకు నోచుకొంది. ఇప్పటికే అయిదు వైద్య నిఘంటువులను రూపొందించిన డా.శర్మ నేటికీ రచయితగా తెలుగు ప్రజకు వైద్య విజ్ఞాన కాంతి ప్రసరింపజేస్తున్నారు. ఛాతి, క్షయ, ఎక్స్ రేలపై అట్లాస్‌ను రూపొందించిన ఘనత వీరిదే. ఇంగ్లీషు,తెలుగు భాషల్లో ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు. విద్యార్థుల పాఠ్యాంశాలలో వీరి రచనలను విశ్వవిద్యాలయాలు వినియోగిస్తున్నాయి. ఛాతీ వ్యాధులు, క్షయపై 1979లోనే వీరి ఆంగ్ల పుస్తకం వెలువడింది. 1986లో ‘ఎపిఐ టెక్ట్స్‌బుక్ ఆఫ్ మెడిసిన్’ వెలుగు చూసింది. ఎన్నో మెడికల్ జర్నల్స్ వీరి వ్యాసాలు ప్రచురించాయి. దేశ, విదేశాల్లో ఎన్నో సదస్సులలో శర్మ తన పరిశోధనా పత్రాలు సమర్పించారు. ఆయన చేసిన వైద్య విజ్ఞాన ప్రసంగాలు కోకొల్లలు. 1977-79లో భారత ప్రభుత్వం తరఫున ఇరాన్‌లో, కెర్మాన్ ఆసుపత్రులో, 1983-89లలో సౌదీ అరేబియా టైఫ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఛాతీ వ్యాధులు, టిబి ఆసుపత్రులలో సేవలందించారు.
నిరాడంబర జీవనం, నిష్కళంక వ్యక్తిత్వ ఉన్న డా. శర్మ 1951లో ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి ఎంబీబీఎస్‌లో స్వర్ణపతక తొలి విజేతగా, 1961లో ఎండి (జనరల్ మెడిసిన్) చేసి, ట్రోపికల్ వ్యాధుల అధ్యయనం కొనసాగించారు. 1957లో టిడిడి, 1975లో ఎఫ్‌సిసిసి (యుఎస్‌ఎ), 1982లో ఎఫ్‌ఎన్‌సిసిపి, 1982లో ఎఫ్‌ఐఎఎమ్‌ఎస్, 1995లో ఎఫ్‌సిజిపి, 1999లో ఎఫ్‌ఐఎమ్‌ఎస్‌ఎ వంటి ఉన్నత విద్యార్హతలు సాధించారు. తిరుపతి వెంకటేశ్వర మెడికల్ కళాశాల, హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కళాశాలల్లో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో ఉస్మానియాలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. హైదరాబాద్‌లోని టీబీ, చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా సేవలందించారు. సౌత్ ఈస్ట్ ఏసియాలో టీబీ, చెస్ట్ వ్యాధుల నివారణలో హైదరాబాద్‌ను అగ్రస్థానానికి చేర్చిన ఘనత డా.శర్మదే.
జన సామాన్యానికి వైద్య విజ్ఞానం అర్థం అయ్యే విధంగా పుస్తకాలు రాసినా, వైద్య విద్యార్థులకు, రోగులకు ఆరేడు దశాబ్దాలకు పైగా సేవలందించినా ఆయన జాతీయ స్థాయి పురస్కారాల కోసం ఆరాటపడలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయన వ్యక్తిత్వ నిర్మలత్వానికి నిదర్శనం. హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ మదర్ థెరిసా 2005 అవార్డు, న్యూఢిల్లీ తెలుగు అకాడమీ రాష్ట్రీయ వికాస శిరోమణి 2005 అవార్డు, 2006 హెల్త్‌కేర్ ఇందిరా ప్రియదర్శిని అవార్డు, హెల్త్‌కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్స్‌డే 2009, 2011, 2013 అవార్డులు, 2011 గ్లోబల్ ఫౌండేషన్ శాంతి బహుమతులు వరించాయి. 1983-2013 మధ్య కాలంలో వివేకానంద హెల్త్ సెంటర్ తరఫున హైదరాబాద్ రామకృష్ణ మఠసేవా కేంద్రంలో వైద్య సేవలందించారు. 1925 మార్చి 8న జన్మించిన డా.శర్మ ముదిమిని లెక్కచేయకుండా నిరంతర సేవాపథంలో ప్రస్థానం కొనసాగిస్తూ, తాను చదివిన కళాశాలలో నేడు అభినందన సత్కారం అందుకొంటున్నారు.

చిత్రం..డాక్టర్ ఒ.ఎ. శర్మ

-జయసూర్య 94406 64610