సబ్ ఫీచర్

విశ్వచైతన్యం-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంసారంలో ఉంట నిర్వాణం పొందడానికి కొన్ని జన్మ లు మాత్రమే చాలు. మహాభారత యుద్ధం కురుక్షేత్రం లో జరిగింది. కురుక్షేత్రం అంటే కర్మ క్షేత్రం కార్యాచరణ చేసే విందు అని అర్థం.
కృష్ణ అంటే క్రు అంటే కురు -ష్ణ అంటే పొందు అని అర్థం. యుద్ధం అంటే జీవితంలో యుద్ధం.
యుద్ధం తర్వాతనే శాంతి. కలిమి, లేమి, బాధ , సౌఖ్యం, మానం, అవమానం, పదవి పదవీ భష్టత్వ్రం ఆరోగ్యం, అనారోగ్యం , జననం, మరణం ఇలా జీవితంలో కలిగే జరిగే అన్ని స్థితులనూ సమంగా స్వీకరించడమే యోగతత్త్వం.
సమత్వం యోగ ఉచ్యతే. యోగత్వం అంటే సమత్వం.
అందుకే జీవితంలో యుద్ధం తర్వాతనే శాంతి లభిస్తుంది. ఆత్మలోని శాంతి, ఆత్మలోని అభయము దాని పేరు మోక్షం.
కర్మణ్యే వాధి కారస్తే మా ఫలేషు కదాచన. కర్మలు అంట యుక్తమైన బాధ్యతలు చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాన్ని నిర్ణయించేది ఇచ్చేది ప్రకృతి. కనుక ఫలితాన్ని గురించి ఆలోచించకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు.
అర్జునుడు - మణిపూరకం
వ్యాపారం చేసేవారు నాణ్యమైన వస్తువును విక్రయించడం, తాజాగా వున్న వస్తువులు అమ్మడం, వినియోగదారుల విశ్వాసాన్ని పొందడం ఎంతో అవసరం. ఆ విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తే వ్యాపారానికి తిరుగుండదు. వ్యాపారంలో నష్టం వస్తుందని చాలామంది చెపుతుంటారు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంవల్లనే ఆ సమస్యలు వస్తాయి. వ్యాపారంలోని మూలం (ప్రిన్సిపల్) తగ్గించకుండా, లాభాలలో కొంతశాతం పెట్టుబడికి కలుపుతూ, కొంతశాతంతో మాత్రమే ఆస్తులు, ఇతరాలు కొనడం చేసినపుడు వ్యాపారానికి డబ్బు కొరత ఉండదు. లాభాన్నంతా మరి పెట్టుబడిలో కూడా కొంత డైవర్ట్ చేసి ఆస్తులు కొనడం, వివిధ వస్తు సామగ్రి కొని అప్పు చేయడం, శుభకార్యాలకు శక్తినిమించి ఖర్చుపెట్టడం- ఇలాంటివన్నీ ఆర్థిక క్రమశిక్షణలో లోపాలు.
వ్యాపారం ఒక గొప్ప కళ- అదొక ఫైన్ ఆర్ట్. నొప్పింపక, తానొవ్వక జీవించడం! వివిధ కుటుంబ విషయాలలో, ఆర్థిక విషయాలలో అప్పులు చేయడంవల్ల జీవితంలో శాంతిని కోల్పోతున్నారు మనుషులు. ఎప్పుడైతే మనుషులు శాంతిని కోల్పోతారో అపుడు దుఃఖం వెంటాడుతుంది. చేసే పని పట్ల ధ్యాసను పెట్టకపోవడం, నష్టపోవడం జరుగుతూ వుంటుంది.
ఏ పని చేస్తూ ఉంటే ఆ పనిపట్ల ధ్యాస- అదే ధ్యానం!
అందుకై పెట్టాలి శ్వాసమీద ధ్యాస- అదే ధ్యానం!
ఈ విషయాలన్నీ ఉద్యోగమైనా, వ్యవసాయమైనా వ్యాపారమైనా అన్నీ సంసారానికి సంబంధించినవే! భౌతిక ప్రపంచాన్ని వదిలి, నిర్లక్ష్యం చేసే విధంగా జీవించడం కుదరదు. ‘యోగం - భోగం’ రెండూ ఉంటేనే ‘సంసారంలో నిర్వాణం’ సాధ్యమవుతుంది. మనిషి కుటుంబ జీవి.
వంశపారంపర్య వృత్తి: ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా’ అన్నాడొక మహనీయుడు. వృత్తిని మట్టికులం వచ్చింది కానీ కులాన్ని బట్టి వృత్తి రాలేదు. ఎవరు ఏ పని చేసినా ఆ పనిలోని పనితనం (వర్క్‌మెన్‌షిప్) ముఖ్యం. అందరూ అన్ని పనులూ చేయలేరు. ఎవరు ఏ పని చేయగలరో ఆ పని చేయాలి. ఒక నేత కార్మికుడు గుడ్డను నేస్తూ ఉంటే చూసేవారికి ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే కుండలు చేసే చోట ఆ మట్టితో కుండలు చేయడం కూడా అబ్బురంగానే ఉంటుంది. ఒక కార్పెంటర్ చకచకా ఒక బొమ్మను చెక్కుతూ ఉంటేనో, ఒక కప్‌బోర్డ్‌ను సెట్ చేస్తూ ఉంటేనో వారంతా చకచకా చేసే పనులు ఆటోమాటిక్‌గా జరుగుతూ ఉంటాయి. కొందరు వంశపారంపర్యంగానూ, మరికొందరు నిపుణుల వద్ద నేర్చుకొనిగాని వృత్తి విద్యల్లో నిష్ణాతులవుతూ వుంటారు.
వృత్తి విద్యల్లో ఎక్కువగా వంశపారంపర్యంగా చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ధ్యాసపెట్టి పనిచేస్తే మనిషి సాధించలేనిది ఏదీ ఉండదు. దొరక్కపోతే కుటుంబ విద్య కడుపునింపుతుంది. అందుకే ‘కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా’ అని అన్నారు.
( ఇంకా ఉంది )

-మారం శివప్రసాద్ 9618306173, 8309912908