సబ్ ఫీచర్

గిఫ్ట్స్ మీకూ మాకూ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతకుముందుకాలంలో పెళ్లిళ్లు సీజన్ వచ్చిందంటే చాలు ఏమి గిప్ట్ ఇవ్వాలో అని ఆలోచించేవారు. చిన్న పిల్లలైతే గిఫ్ట్ తీసుకొనే వారిని ఆటపట్టించే గిఫ్ట్స్ ఇచ్చి అందరినీ నవ్వించేవారు. కాని ఇపుడు ట్రెండు మారింది. పెళ్లిచేసుకొనేవారికి, మొక్కలిస్తున్నారు. మీరు వంశానివృద్ధి చేస్తూ మొక్కలను కూడా వృద్ధి చేయండి అని సందేశమిస్తూ న్నారు.
తక్కువ ధరలో ఎక్కువ ఆనందాన్నిచ్చేవి ఏమిటా అని ఆలోచించేవారికి ఇది ఒక మంచి అవకాశం. అంతేకాదు దానితో పాటు పర్యావరణ రక్షణ కూడా జరుగుతుంది. ఎట్లానే పెళ్లి గిఫ్ట్స్ అంటే జాగ్రత్తగా పెట్టుకుంటారు కనుక మొక్కలిస్తే వాటిని జాగ్రత్తగా పెంచుతారని చాలామంది వాటిని ఇవ్వడానికేఇష్టపడుతున్నారు.
కొందరు కలకాలం దాంపత్య జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించమని సీతారాములను ఇస్తున్నారు. ప్రేమకు మారుపేరుగా ఉండమంటూ రాధాకృష్ణులను ఇస్తున్నారు. మరికొందరు తాజ్‌మహల్ లాంటి ప్రేమ చిహ్నాలను కూడా ఇస్తున్నారు.
ఫారిన్ వెళ్ళే జంటలకైతే ఇవ్వవలసిన కానుకల గురించి ఆలోచన ల్లేకుండా వారికి డబ్బలనే గిఫ్ట్‌గా ఇస్తున్నారు.
విదేశాల్లో అయతే ఏదో ఒక షాపుకు వెళ్లి అక్కడ దొరికే వస్తువులను
వధూవరులు ఎవరికి కావాల్సింది వారు కొనుక్కుంటే ఆ డబ్బును బంధువులను ఇచ్చే ఏర్పాటు చేస్తున్నారు. ఇట్లాంటివి ఇక్కడ ఇంకా రాలేదు. అందుకే వారికి ఉపయోగపడే వస్తువులను ఇవ్వడంతో పాటుగా అవి అపురూపంగా ఉంటే కలకాలమూ వారు గుర్తించుకుంటారని ఆలోచిస్తున్నారు.
ఇక పెళ్లిచేసుకొనేవారు కూడా రిటన్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం బాగా ఎక్కువైంది. వారు కూడా ఈ పెళ్లికి వచ్చాం ఈ గిఫ్ట్ చాలా బాగుంది అనుకొనేట్టుగా ఆలోచించి మరీ గిఫ్ట్స్ ఇస్తున్నారు.
రిటన్ గిఫ్ట్స్‌గా పండ్లమొక్కలను ఇవ్వడం మంచిదనే అభిప్రాయంతో వాటిని ఎక్కువగాఇస్తున్నారు.
*