సబ్ ఫీచర్

మానసికోల్లాసానికి మార్గమిదే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హలో మిమ్మల్నే... జీవితం నిస్సారంగా, నిరుత్సాహంగా, అర్థరహితంగా అనిపిస్తుందా?’’
మీ చుట్టుపక్కల వాళ్లూ , మీ వయస్సు వాళ్లు సినిమాలూ, షికార్లూ అంటూ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలుతున్నట్టు, జీవిత చరమ దశలో కృష్ణారామా అనుకోకుండా ఏమిటీ విపరీత దోరణి అని కూడా అనిపిస్తోందా?
అయితే మీరు పప్పులో కాలేసేశారండోయి...
కాలం మారింది. ఈరోజుల్లో చాలామంది అరవై దాటిన భార్యాభర్తలు రెండో వసంతంలోకి వచ్చారని అనుకొంటున్నారు.
‘ఏమిటీ విచిత్రంగా అనిపిస్తోందా?’
పూర్తిగా వినండి తెలుస్తుంది.
ఈ మధ్య పిల్లలంతా విదేశాల్లోనో, లేక మనదేశంలో ఉన్నా ఆఫీసులదగ్గరనో ఏదో మరేదో కారణాలతో తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నారు కదా.
దానితో అరవై దాటిన వారంతా ఒంటరిగా ఉన్నట్టే కదా. మరి వారంతా ఏ భగవద్గీతనో పట్టుకుని ‘జీవిత చరమాంకంలోనైనా నన్ను స్మరిస్తూ నా నామ సంకీర్తన చేస్తూ గడిపితే నేను వారికి మోక్షం ఇస్తాను’ అని ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు చేయక్కర్లేదా అని మీ సందేహం కదా.
నిజమే.
వారంతా అలా చేసిన వారే. కాకపోతే మీకీ విషయం తెలుసా...
మన మనిషి మస్తిష్కం అంటే మెదడు నిరంతరం ఒకటే విషయాన్ని ఫీడ్ చేస్తే కొన్నాళ్లకి బోర్ పుట్టి ఓ రకమైన నిస్సత్తువకు గురవుతుంది. దాంతో చేస్తున్న పని పట్ల శ్రద్ధ తక్కువ అవుతుంది.
ఇది కేవలం ముసలి వారికి మాత్రమే కాదండి , ప్రతి మనిషీ ఇలా ఫీల్ అయినవారే... అందుకే రొటిన్‌గా ఒకే వర్క్ చేయకుండా అప్పుడప్పుడు పనికి విరామం ఇచ్చి మరోదానిలోకి వెళ్లండి అని చెబుతుంటారు. అపుడే మానిసిక వికాసం మరింత జరుగుతుంది. అద్భుతాలను దీనివల్లే సృష్టించేస్తారు.
అందుకే అటు ఆధ్యాత్మికమూ ఇటు వినోదమూ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తే జీవితం నిస్సారం కాదండోయ్ సారవంతమై హైబ్రీడు సాగులా మారి అనుకున్న దానికంటే ఎక్కువ మంచి ఫలితాలను అందుకోవచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.
దీనికి మనం చేయవలసిందేమి అంటారా.... ఇదిగో అదే చెబుతున్నా...
ఎక్కడైనా తిరగాలని అనిపిస్తోందా... ఒకవేళ తీర్థయాత్రలు చేసేయండి. నింపాదిగా చక్కగా ప్లాన్ వేసుకోండి... టికెట్లు ముందుగా తీసుకోండి. అపుడు హాయిగా ఎంజాయ్ చేస్తూ అటు తీర్థయాత్రలు చేసేయండి... దానితో మీలో నూతనోత్సాహం వెల్లి విరుస్తుంది. అంతేకాదు వెళ్లేముందు మిమ్ముల్ను మీరు అందంగా అలంకరించుకోండి. ఎవరో మీకీ వయస్సులో తలకు రంగెందుకు అంటారు అనుకోకండి. వేరేవారి గురించి ఆలోచించకండి.మీకు నప్పే కలర్ వేసేసుకోండి. మీ జుట్టును మీకిచ్చిమొచ్చినట్టు అలంకరించుకోండి. అట్లానే మీ ముఖాన్ని కూడా అందంగా చేసుకోండి. మీకిష్టమైన చీరలు, డ్రస్సులు ధరించండి. చక్కగా తయారు అవండి. అపుడిక చూడండి. మీలో నిరుత్సాహం మాట మాత్రంగా నైనా కనపడదు.
మేలిమి బంగారానికి కూడా కాస్తంత రాగి కలిపితేనే మంచి ఆభరాణాలు తయారు అవుతాయి. అట్లానే ముదిమి వయస్సులోను పసిడి పంటలు పండించాలంటే కేవలం కృష్ణరామ అనే కాకుండా సమాజానికి కావల్సిన పనులు కూడా చేపట్టండి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పనులు చేయండి. శృతిమించని వినోదం మీలో కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
మీకిష్టమైన పాటలు ఇంతకుముందు నేర్చుకోవడానికి వీలు కాకపోతే ఇపుడు నేర్చుకోండి. చక్కగా గురువుగారిని వెతకండి. అది వీలు కాకపోతే మంచి సంగీతం క్లాసులు నెట్‌లో ఉన్నాయి వాటిని వెతకండి. స్మార్ట్ఫోన్లు ఐపాడ్ లాప్‌టాప్ ఇలా ఎన్నో నేడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తెచ్చుకోండి బ్లాగులు టిట్వర్లు ఇలా ఏవైనా మానిసికోల్లాసాన్నిచ్చేవాటిని ఆహ్వానించండి..
మీరు ఇరవై లోకి అడుగుపెట్టేస్తారు.. ఆల్‌ద బెస్ట్

--మాధవపెద్ది ఉష