సబ్ ఫీచర్

ప్రణామం .. ప్రణామం... నాగా భరణం!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిజీవికి ప్రాణ భయం ఎక్కువే. అందులో మనుష్యులకు పాములను చూస్తే భయం అధికమే. పాము కనబడితే పరుగులు తీస్తారు. ఒక్కోక్కరు అయితే నోట్లో మాట రాకుండా అవాక్కుఅవుతారు. కాని ఈ నాగుపాముకు పూజ చేసేవారు కూడా ఉన్నారనుకోండి. పాములను దండలుగా మెడలో ధరించేవారినీ కూడా మనం అక్కడక్కడ చూస్తుంటాము. కాని పాము అంటే చాలామందే భయపడుతుంటారు.
కాని కాలం మారుతోంది. పాము అంటే భయం లేకుండా వ్యవహరించడానికి పాము ఆకారపు ఆభరణాలను ఇప్పుడు విరివిరిగా వాడుతున్నారు. కేవలం భయం పోగొట్టుకోవడానికి కాక గ్రహశాంతుల కోసం కూడా వీటిని ధరించేవారున్నారు. ఇంకా ఇపుడు టీనేజర్స్ అంతా ఈ పాము ఆకారపు ఆభరణాలను ఫ్యాషన్ కోసం ధరిస్తున్నారు.
సాక్షాత్తు పరమశివుడే పాముని కంఠాభరణంగా భుజకీర్తులుగా, మెడలో హారాలుగా ధరించాడు కదా. మరి మేము శివుని భక్తులమే అనుకొంటూ ఈ నాగాభరణాలపై మోజు పడేవారు ఎక్కువ అవుతున్నారు. నాగాభరణాలు ఉంగరాలు, గాజులు, హారాలు, చెవిపోగులు, పెండెట్లు, బ్రేస్లెట్లు, వాచీలు, నెక్లెసులు, బొట్టుబిళ్లలు, ఒకటేమిటి ఆఖరికి బెల్టులూ నాగభరణాలనే ధరించడానికి ముందుకు వస్తున్నారు. నాగుపాము రూపంలో బంగారు గాజులకీ పౌరాణిక కాలంలోను క్రేజు ఉండేదట. ఈ రోజుల్లో బంగారం, వెండినే కాదు ప్లాటినంతో కూడా నాగాభరణాలను తయారు చేసేస్తున్నారు. ప్రముఖ జ్యువలరీ సంస్థలతో కలసి డిజైనర్ను స్నేక్ జ్యుయలరీ తయారీలో తలమునకలై యూత్ మనసును దోచేస్తున్నారు. ఉంగరాలను మరీ ముచ్చట పడీ తొడుక్కుంటున్నారు యూత్. గిఫ్ట్‌గా కూడా వీటిని ఇవ్వచూస్తున్నారు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి