సబ్ ఫీచర్

అనిశ్చిత సిద్ధాంతం -- పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకే ప్రహ్లాదుడు ‘యాతీతగోచరా, వాచాం, మనసాం చా విశేషణా జ్ఞాని జ్ఞాన పరిచ్ఛేద్యా తాం ఈశ్వరీ పరాం’ అన్నాడు. మనస్సు, వాక్కులకతీతమై ఊహకందనిదై ఇట్టిదని చెప్పడానికి అలివికానిదని శక్తిని గూర్చి పేర్కొన్నాడు. అందుకే ఆదిశక్తిని ‘సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహకారిణియైన పంచకృత్య పరాయణాయైనమః’ అని నమస్కరించారు.
బహుశా యిందుకేనేమో ‘ఆర్థర్ ఎడింగ్టన్’ అనే సుప్రసిద్ధ విజ్ఞాన శాస్తవ్రేత్త, హైసన్‌బర్గ్ అనిశ్చిత సిద్ధాంతం తరువాత యిలా అన్నాడు. ‘‘విజ్ఞానశాస్త్రం తన పరిధిని దాటి వేదాంత మత శాస్త్రాల పరిధిలోకి ప్రవేశించింది’’ అని.
నవీన బౌతిక శాస్త్ర అంఖండాలను (పార్టికల్స్) లోతుగా పరిశీలించి పరిశోధించి అనేక నోబల్ బహఉమతులు పొందుతూనే వుంది. ఈ ఆధునిక శాస్తమ్రంతా కూడా కార్యకారణ సంబంధాన్నననుసరించి వృద్ధి చెందుతోంది. కాలక్రమంలో ‘మైక్రోఫిజిక్స్’ (అణుభౌతిక శాస్త్రం) వృద్ధి చెందుతున్న కొద్దీ, రుూ కార్యకారణ (కాజ్ అండ్ ఎఫెక్ట్) సిద్ధాంతం తిరోగమనం చెందుతోంది. దీని స్థానంలో గణాంక సంభావ్యత (స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ) మొదలైంది. అంటే ఒక అణు ఖండాన్ని ముందుకు విసిరినపుడు అది పూర్తిగా ముందుకే వెడుతుందని చెప్పలేం, కొంతలో కొంత భాగం వ్యతిరేక దిశలో కూడా వెళ్ళవచ్చు.
కార్యకారణ సిద్ధాంతానికి వ్యతిరేకమైన రుూ విషయాన్ని ప్రఖ్యాత శాస్తజ్ఞ్రుడైన ఐన్‌స్టీన్ ఏ మాత్రం అంగీకరించలేదు. కానీ ఆయన తరువాత జరిగిన అనేక ప్రయోగాలలు గణాంక సంభావ్యత సిద్ధాంతాన్ని బలపరిచాయి. నోబుల్ బహుమతి పొందిన ప్యారిస్ నగర వాస్తవ్యుడు లూరుూస్ దబ్రోలి అనే సుప్రసిద్ధ వైజ్ఞానికుడు, అణువులోని భాగాలన్నీ ఘనపదార్థాల నలకలుగాను, తరంగాలుగాను కూడా వ్యవహరిస్తాయి అని చెప్పి దానికి ‘జీనిన్ళిజఉడ’ అని పేరు ప ఎట్టాడు. దీని తరువాత షడ్రింగర్ అనే పరిశోధకుడు అణువులోవని భాగాల ఘన పదార్థ స్వభావానికి, తరంగ స్వభావానికి మధ్య సూత్రాన్ని కనిపెట్టాడు.
అందుకుగాను ఆయనకు నోబుల్ బహుమతి ఇచ్చారు. మరొక భౌతిక శాస్తవ్రేత్త మాక్స్ బోన్ అనే ఆయన అణు ఖంకడాలు లేక భాగాలను ప్రాబబిలిటీ తరంగాలు అంటే అసత్య తరంగాలని నిరూపించాడు. అందుకుగాను ఆయనకు కూడా నోబుల్ బహుమతి ఇచ్చారు. ఈ సిద్ధాంతం గురించి ప్రసంగాలు చేసిన రిచర్డ్ ఫిన్‌మాన్ అనే ఆయన ఎలక్ట్రాన్స్ యినుప గోళాలు కావు, అవి ఒక సరళలఖలో ప్రయాణించగవు, సూక్ష్మజీవులుగా వాటి యిష్టానుసారం వక్రగతులలో ప్రయాణిస్తాయన్నాడు. ఈయనకు కూడా నోబుల్ బహుమతి ఇచ్చారు.
పరంపరగా నోబుల్ బహుమతులు పొందిన రుూ సిద్ధాంతాలను (్భతిక శాస్త్రంలో) చూస్తుంటే మన భారతీయ తత్త్వ శాస్త్రాలు, ఉపనిషత్తులు, యోగశాస్త్రాలు చెప్పిన మూల సిద్ధాంతాలకు ఏవిధంగా సమన్వయవౌతుందో చూస్తే సత్యమొక్కటే కాని దారులు వేరని ఆశ్చర్యం కలుగక మానదు. ఈ సందర్భంలో ‘శ్రీదత్త దర్శనం’ అనే గ్రంధంలో ఒక సన్నివేశం గుర్తుకొస్తుంది. హైహయ వంశపు రాజైన కార్తవీర్యార్జునుడు, ద్వైత భ్రాంతి కలిగి సందేహంతో శ్రీ దత్తాత్రేయస్వామివారి వద్దకు వస్తాడు. దత్తాత్రేయస్వామి కార్తవీర్యార్జునుడికి యోగోపదేశం చేసి శక్తిపాతంగావించారు. తరువాత కార్తవీర్యార్జునుడు తీవ్ర సాధన చేశాడు. సాధన తర్వాత కార్తవీర్యార్జునుడు గురువైన దత్త భగవానునికి దగ్గరకు వచ్చి తనకు కలిగిన అనుభవాన్నిలా వివరించాడు.
శ్లో దేశ కాలే పదార్థేవా, చిదాత్మైకవిభాతిమే
చిదానందోమహాత్మేశ, పదార్థో అన్యోన్య విద్యతే
అంతటా చిదానందమే కనిపిస్తోంది. ప్రతి వస్తువులోనూ చిదానందమే కనిపిస్తోంది.

..........................ఇంకావుంది

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590