సబ్ ఫీచర్

చురుకుదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే తరగతి గది ఆరోగ్యం కూడా అలాగే వుంటుంది. శరీరం చురుగ్గా ఉంటేనే మెదడు కూడా చురుగ్గా పనిచేస్తుంది. మెదడు బాగా పనిచేస్తేనే కొత్త భావాలు పుట్టుకొస్తాయి. అప్పుడే తరగతి గది కళకళలాడుతుంది. ఉపాధ్యాయులు వయసులో పెద్దవారే కావొచ్చును, సంసార బాధలు కూడా ఉండవచ్చును. కానీ తరగతి గదిలోకి వారు అడుగుపెట్టగానే ఎక్కడి నుంచో చురుకుదనం వస్తుంది. ఎక్కడి నుంచో అనుకోకండి. పిల్లల ముఖాలను చూడగానే ఉపాధ్యాయుడిలో చురుకుదనం పుట్టుకొస్తుంది. అదే మాదిరిగా తరగతి గది స్వరూపం పిల్లల్లో చురుకుదనం కల్పిస్తుంది. అందుకే బహుశా కొంతమంది ప్రధానోపాధ్యాయులు ఒక గంట ముందే వస్తారు. అన్ని క్లాసుల్లో కూడా పిల్లల్లో చురుకుదనం కలిగించటానికి కార్యరంగాన్ని తయారుచేసుకుంటారు. అందుకు తరగతి గది స్వచ్ఛంగా ఉందో లేదో పరిశీలిస్తారు. స్కూలు వాతావరణం చురుకుదనాన్ని ప్రేరేపించాలి. ఈ చురుకుదనమే తరగతి గదికి శక్తిని ప్రసాదిస్తుంది. పాఠం చదువుతుంటే అందులో విలీనమయ్యే శక్తిని ఇస్తుంది. షేక్స్‌పియర్ పాఠాన్ని బోధిస్తున్నపుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో నాట్యం చేసినట్లు ఉంటుంది. ఆ టీచర్ వేసే ప్రతి అడుగు గజ్జెల మోతగా విద్యార్థుల మెదళ్లను కదిలించేస్తుంది. తరగతి గది ఆరోగ్యం విద్యార్థులు, ఉపాధ్యాయుల చురుకుదనంపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల ముఖాలు చూసి పాఠం మొదలు పెట్టగానే ఉపాధ్యాయుడు మరో లోకంలోకి వెళ్లిపోతాడు. అప్పుడే తరగతి గది మరో ప్రపంచంలోకి అడుగుపెడుతుంది.
విలక్షణ ఆలోచనల పుట్టుక
అక్షరాలు నేర్పినవాడిని ఆదిగురువు అన్నాం. కానీ ఈనాడు అక్షరం కన్నా ఆలోచన ప్రధానమైంది. ఆలోచనను రగిలించినవాడే అంతిమంగా వుండే గురువు. జీవితంలో మూడు సంవత్సరాల వయసు నుంచి ఆలోచన పిల్లల్లో ఆరంభమవుతుంది. తరగతి గదిలో ప్రవేశించే సమయానికి ఎన్నో ఆలోచనలతో పిల్లలు వస్తారు. వాటిని తమతోనే తీసుకుని క్లాసురూమ్ లోపలికి వస్తారు. తరగతి గది క్లిష్టమైన ఆలోచనలను ఏరుకుని, అనుకున్నది ఎట్లా సాధించాలో నేర్పుతుంది. సాధన కొద్దీ దాని పరిమళం ఆస్వాదించవచ్చు. ఈనాడు క్రిటికల్ థింకింగ్ ఎలా చేయాలి? సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా విశే్లషించాలి? ఇవన్నీ మనకు తెలియకుండా మెదడులో జరిగే ప్రక్రియ. తరగతి గది కనపడని దేవుడని విద్యార్థి మెచ్చుకుంటాడు. సమస్యను పూరించేటప్పుడు సాధకుడు ఆ ఆనందం అనుభవిస్తాడు. అది బహిర్గతమైన తర్వాత ప్రపంచం మెచ్చుకుంటుంది. విలక్షణమైన ఆలోచనను ఎలా ఏరుకోవాలి? వాటిని ఎలా విశే్లషించాలి? దాంతో ముగింపు ఎలా చేయాలి? వీటిని సాధకుడు తెలుసుకుంటాడు. తరగతి గది విలక్షణమైన భావాలను వేరు చేస్తుంది. హంస బురదలోనుంచి తనకు కావాల్సిన ఆహారాన్ని విడగొట్టి కడుపు నింపుకుంటుంది. తరగతి గది హంస కంటే విభిన్న లక్షణాలు కలది.
మధ్యాహ్న భోజనం
హైదరాబాద్ నుంచి 30 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్‌కు వెళ్లారు. అది వారిని బాగా ఆకట్టుకున్నది, వాళ్లను కదిలించింది ఏమిటంటే? పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం. ప్రతి స్కూల్లో అది సక్రమంగా జరిపేందుకు ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించారు. వండిన వాటిని వడ్డించటానికి ముందు అందుకు బాధ్యుడైన ఇన్‌ఛార్జి విధిగా తినాలి. పిల్లలకు పెట్టే ప్లేట్ల శుభ్రత విషయంలో జాగ్రత్త వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆ బాధ్యులు రికార్డు చేస్తారు. పిల్లలు భోజనం చేస్తున్నపుడు ఒక టీచర్ సూపర్‌వైజ్ చేస్తారు. పిల్లలు భోజనాన్ని ఇష్టంగా తింటున్నారా? బలవంతంగా తింటున్నారా? అన్న విషయాన్ని ఆ టీచర్ గమనిస్తాడు. పిల్లలు భోంచేసేటపుడు సంగీతం, పాటలు వింటారు. పుష్ఠికరమైన ఆహారం బాగా తింటేనే కానీ మధ్యాహ్న భోజనం విషయంలో తేడా ఉండదు. పిల్లలందరూ ఒకే రకమైన ఆహారం తీసుకుంటే అందరూ సమంగా ఎదుగుతారని ఫిన్లాండ్ దేశంలో వున్న వారి భావన. మధ్యాహ్న భోజనం ఎంత శ్రద్ధగా ఇవ్వగలిగితే పిల్లలు స్కూలును తమ ఇల్లుగా భావిస్తారు. బడిపై పిల్లల శ్రద్ధకు ప్రధానమైన కారణం మధ్యాహ్న భోజనం. ఆహారం పెట్టడం ప్రధానం కాదు, దాన్ని ఎంత ఆప్యాయతతో అందిస్తున్నారన్నది ముఖ్యం. అదే పిల్లల్లో సమత్వానికి పునాది వేస్తుంది.

-చుక్కా రామయ్య