సబ్ ఫీచర్

ధైర్యం -- ప్రార్ధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.’
-మూడువేల సంవత్సరాల క్రితం బైబిల్‌లో వ్రాసిన మాటలు ‘మనము భయపడము’ అన్న మాటలో ఇప్పుడు మనము ఉన్నాము. రాబోయే తరాల వారూ ఉంటారు. యేసుక్రీస్తును నమ్మినప్పుడు మనకు ధైర్యం వస్తుంది. భయం పిరికితనం పారిపోతాయి. ‘్భమి మార్పునొందినను’ అని బైబిల్‌లో చెప్పిన మాటకు అర్థం నాకు ‘డిసెంబర్ 26, 2004’ వరకు తెలియలేదు. కానీ, సునామీ వచ్చినప్పుడు తెలిసింది. భూమి మార్పు చెందుతోందని, పర్వతములు కదులునని, మునుగునని. అయినను సృష్టికర్తయైన ప్రభువును నమ్ముకుంటే, ఇటువంటి సృష్టి వైపరీత్యాలు ఎన్ని జరిగినా మనకు కాపుదల ఉందనీ, భయపడక ధైర్యంగా ఉండవచ్చునని - బైబిల్ తెలియజేస్తోంది.
అనాదిగా మానవుణ్ణి భయం వెంటాడుతూనే ఉంది. అయితే తప్పుల భయం, లేకపోతే అప్పుల భయం, మరణ భయం, శత్రుభయం.. ఎప్పుడు ఏవౌతుందో? ఏ ప్రమాదం జరుగుతుందో? ఏ నష్టం వాటిల్లుతుందో? ఏ మోసం జరుగుతుందోనన్న భయం. ఇవికాక పిల్లల చదువుల భయం... రాకపోకల భయం, ఉద్యోగ భయం.. పెళ్లి భయం.. కట్నకానుకలు ఎంతగా ఉంటాయో? తీరా పెళ్లయ్యాక ఎంతకాలం నిలబడుతుందోనన్న భయం. సృష్టి వైపరీత్యాల వల్ల భయం.. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం సామాన్యులమైన మనకే ఉంటే, శాస్తవ్రేత్తలు మరింత భయపడుతున్నారు. ఆర్థిక భయం.. ఆరోగ్య భయం.. చివరకు వృద్ధాప్య భయం - అయితే ‘గర్భమున పుట్టినది మొదలు తలవెంట్రుకలు నెరయు వరకు ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే’ అని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు.
‘గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడినవారలారా తల్లి ఒడిలో కూర్చుండునది మొదలుకొని నేను చంక పెట్టుకొనినవారలారా ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. తలవెంట్రుకలు నెరయు వరకు ఎత్తుకొనువాడను నేనే. నిన్ను ఎత్తికొనుచు రక్షించువాడను నేనే’ - యెషయ 46:3-4
పిల్లలు పట్టించుకుంటారో లేదో అనే భయం ఈ కాలంలో ఎక్కువగా ఉంది. ఎక్కడ చూసినా ‘ఓల్డేజ్ హోమ్స్’ వృద్ధులతో నిండి ఉంటున్నాయి. ప్రభువు ఇచ్చిన వాక్యాన్నిబట్టి వృద్ధాప్య విషయంలోనే కాదు అన్ని కాలాల్లో ధైర్యంగా ఉండవచ్చు. ప్రభువును ఆశ్రయిస్తే మనకు కోటగా ఆశ్రయంగా ఉండి, ‘వేటకాని ఉరిలో నుండి తప్పించి, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించి, తన రెక్కలతో నిన్ను కప్పి కాపాడును. రాత్రివేళ కలుగు భయమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను వేయిమంది పడిననూ, నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నిన్ను కాపాడువాడు కునుకడు. నిద్రపోడు. నీ పాదము త్రొటిల్లనియ్యడు. పగలు ఎండ దెబ్బయైనను తగులదు. రాత్రి వెనె్నల దెబ్బయైనను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ రాకపోకల యందు నిన్ను కాపాడును. జీవాధిపతి మృత్యుంజయుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి’ అని ఇచ్చిన అభయాన్ని బట్టి దేవునికి వందనాలు. కావున సర్వశక్తిమంతుడైన ప్రభువుకు భయపడి లోకంలో ధైర్యంగా జీవిద్దాం.
భయాందోళనలో ఉండి ధైర్యం చెడినవారికి ఈ శుభవార్త అందిద్దాం.
అభయ మభయ మభయ మెప్పుడు.. ఆనంద మానంద మానందమేగా..
*