సబ్ ఫీచర్

అవని పరిరక్షణ అందరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమిని వదలి మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్కడ బతగ్గలం? భూమి అంటే మనం నిలబడి ఉన్న ఘనరూపమే కాదు. సముద్రాలు, నదులు, అడవులు, సమస్త జంతుజాలం కూడా. మరి.. మన మనుగడకు ఆధారమైన భూమిని ఏం చేస్తున్నాం? అన్ని రకాలుగా విధ్వంసం చేస్తున్నాం. పశుపక్ష్యాదులు, జలచరాలు, వృక్షాల మనుగడకు ఆధారమైన భూమిని జీవయోగ్యం కానిదిగా చేస్తున్నాం. మనం కోరుకొంటున్న ప్రపంచాన్ని రూపొందించుకోవటంలో ధరిత్రి, పర్యావరణానికి సంబంధం ఉందా? అనే విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు. మనల్ని మోసేది ఈ ధరిత్రి. మనం ఏ పని చేసినా ఈ భూమి మీదనే. మన జీవన కార్యకలాపాలన్నింటికీ ధరిత్రియే ఆధారం. ఆధారము, ధర్మము అనే రెండు శబ్దములూ ‘్ధృ’ ధాతువు నుండే వచ్చాయి. ధర్మం - ధరిత్రి ఈ రెండిటి మధ్య అన్యోన్యాశ్రీత సంబంధం ఉంది. అతి ప్రాచీన కాలం నుండి మనం ఈ సంబంధాన్ని గౌరవిస్తూ వస్తున్నాం. ఈ ఉద్దేశంతోనే ధరిత్రిని ‘్భమాత’గా వర్ణించాం మనం.
ఈ విశ్వంలో ప్రతి జీవజంతువుకూ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ ప్రయోజనాన్ని గుర్తించి, యావద్విశ్వం యొక్క రచనలో దాని స్థానమేమిటో గ్రహించి, దానిని కాపాడినట్లయితే అప్పుడు సర్వత్రా ప్రయోజనం ఉంటుంది. దీనినే మనం ‘్ధర్మం’ అంటున్నాం. ప్రకృతి - సమాజముల మధ్య ఉండే సంతులనం, వాటి మధ్య ఉండే సంబంధాలను గుర్తించాలి. వాటి నియమాలను గ్రహించాలి. వాటికి అనుగుణంగా మనం వివిధ కార్యకలాపాల రచన సాగించాలి. మన అభివృద్ధి మార్గాన్ని ఏర్పరచుకోవాలి. అప్పుడు ప్రకృతి విరుద్ధం కాని అభివృద్ధి పథం ఏర్పడుతుంది.
ప్రాచీన కాలం నుండి మన దేశంలో ఈ అవగాహన ఉన్నందున ప్రకృతితో జతకలసి మనం నడుస్తూ వచ్చాం. ప్రకృతి పట్ల పూజ్యభావాన్ని పెంపొందించుకున్నాం. ప్రకృతిని, భూమిని తల్లిగా గౌరవించాం. గంగ, గోదావరి, కృష్ణ మొదలగు నదులను మాతలుగా సంభవించాం. తులసి మొక్కను తల్లిగా గౌరవించాం. వటవృక్షాన్ని (మర్రిచెట్టు), అశ్వత్థ వృక్షాన్ని (రావిచెట్టు) పూజించాం. మన మనసుల్లో ప్రకృతి పట్ల పూజ్యభావన ఏర్పరచుకొన్నాం. వేదాలు ప్రపంచంలోనే ప్రాచీన గ్రంథాలు. వీటిలో ధరిత్రిని గురించి ఏమని చెప్పారు? అధర్వ వేదంలోని రెండు మంత్రాలను చూద్దాం.
యస్యా పూర్వే పూర్వజనా విచక్రిరే యస్యాం దేవా అనురానభ్యవర్తయన్
గవామశ్వానాం వయసశ్చవిష్ఠా భగం వర్చ పృథివీ నో దదాతు
-అధర్వ వేదం ద్వాదశ కాండం 1(5)
‘ఎక్కడైతే మన పూర్వజనులు అద్భుతమైన కృత్యాలను సాధించారో, ఎక్కడైతే దేవతలు అసురులను నిర్మూలనం గావించారో అక్కడ ఆవులతో, అశ్వాలతో, ఇతర పశుసంపత్తితో కూడిన మన పృథివి మనకు ఐశ్వర్యమును, తేజస్సును ప్రసాదించు గాక!’ అని అర్థం.
ఇంద్రోయాం చక్ర ఆత్మనేన మిత్రాం శచీపతిః
సానో భూమిర్విసృజతాం మాతా పుత్రాయ మే వయః
- అధర్వ వేదం ద్వాదశ కాండం 1(10)
అనగా ‘శచీపతియైన ఇంద్రునిచే శత్రురహితం గావించబడిన భూమాత తన పుత్రుడైన నాకు దుగ్ధము వండి పోషకద్రవ్యములను ప్రదానము చేయుగాక!’ అని అర్థం.
మనకు కావలసిన పోషణ ధరిత్రి నుండి లభిస్తుంది. వివిధ వృక్షాలు, మొక్కలు, పశుపక్ష్యాదులు ఇవన్నీ మనకు అన్ని విధాలా పోషణను అందిస్తున్నాయి. మనం ఈ ప్రాణి జాలాన్ని, వస్తు జాలాన్ని కూడా రక్షించుకోవాలి.
సంకట స్థితిలో ధరిత్రి...
భూమి నుండి ఆహారధాన్యాలు లభిస్తాయి. వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేయాలన్న తపనతో యంత్రాలను, రసాయన ఎరువులను ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాం. రసాయనిక ఎరువులను ఉపయోగించడం అంటే భూమికి ‘డ్రగ్స్’ ఇవ్వడం లాంటిది. డ్రగ్స్ తీసుకున్న మనిషి చాలా ఉత్సాహంగా కనిపిస్తాడు. ఈ ఉత్సాహం, అదనపు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతి మనిషి శరీరంలో కొంత శక్తి నిలువ ఉంటుంది. డ్రగ్స్ తీసుకున్నప్పుడు శరీరంలో ఉన్న నిలువ శక్తి బయటికి వస్తుంది. దానితో ఆ మనిషికి ఉత్సాసం కలుగుతుంది. డ్రగ్స్ ప్రభావం తగ్గాక మనిషిని మందకొడితనం ఆవహిస్తుంది. కారణం శరీరంలో నిలువశక్తి తగ్గిపోవడమే. తిరిగి ఉత్సాహం పొందడానికి మనిషి మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటాడు. పదేపదే డ్రగ్స్ తీసుకోవడంవల్ల మనిషి శరీరంలోని శక్తి అంతా తరిగిపోతుంది. అతని ఆయువు తగ్గిపోతుంది. భూమి విషయంలోనూ ఇంతే. రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడినా, యంత్రాలతో భూమిని మరింత లోతుగా పెళ్ళగించినా కొద్ది కాలానికి దానిలోని ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. అధిక ఫలసాయం కోసం రసాయనిక ఎరువులను ఇలా నిరంతరం వాడితే- భూమి నిస్సారమవుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల ప్రభావంతో పంటల్లో పోషక విలువలు ఉండటం లేదు. పైగా వాటిలో రసాయనిక పదార్థాలు చేరుతున్నాయి. వీటిని తినడం వల్ల మన శరీరాలు కొత్తకొత్త వ్యాధులకు గురవుతున్నాయి.
సంప్రదాయ పద్ధతులే మేలు..
వ్యవసాయంలో మన సంప్రదాయక పద్ధతుల వల్ల కలిగే లాభాలు మనం చూస్తూనే ఉన్నాం. విదర్భలో ‘పుసద్’ అనే వూళ్ళో పాండరీ పాండే అనే వ్యక్తి 40 ఏళ్లుగా వివిధ రకాల ప్రయోగాలు చేసి కిలోగ్రాము ఆవు పేడతో 40 కిలోల కంపోస్టు ఎరువు తయారుచేయవచ్చని ఋజువు చేశాడు. దీనివల్ల రసాయనిక ఎరువుల కంటే మూడవ వంతు ఖర్చు తగ్గుతుంది. ఒకసారి పొలంలో ఈ ఎరువును వేస్తే మూడు సంవత్సరాల వరకు మళ్ళీ ఎరువువేసే అవసరం రాదు. ఇది సహజమైన ఎరువు కనుక భూమిలో ఉత్పాదక శక్తి ఏ మాత్రం తగ్గిపోదు.
దీన్‌దయాళ్ శోధన సంస్థ ఆధ్వర్యంలో గోండా జిల్లాలో విభిన్న ప్రయోగాలను నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో జపాన్ నుంచి కొందరు సందర్శకుల ఆ ప్రయోగాలను చూడడానికి వచ్చారు. భారతీయ వ్యవసాయ విధానాన్ని అధ్యయనం చేసిన వారు, ఇక్కడి పొలాలలో కాస్తతంతయినా ఉత్పాదక శక్తి తగ్గకపోవటం చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ భూమిని దున్నడానికి ఉపయోగించే నాగళ్ళ కర్రులు 9 అంగుళాల లోతుగా మాత్రమే భూమిని దున్నుతూ ఉండటం గమనించారు. భూమిని 9 అంగుళాల లోతుగా మాత్రమే దున్నడం వల్ల ఆ సమయంలో వానపాములు అంతకంటే లోతైన మట్టిలో సురక్షితంగా ఉంటాయి. వాటి కారణంగా భూమి గుల్లబారే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. పాశ్చాత్య దేశాలలో ట్రాక్టర్లను ఉపయోగించి దునే్నటప్పుడు నాలుగు అడుగుల లోతువరకు మట్టిని తిరగబోయడం జరుగుతుంది. అలా చేయడంవల్ల వానపాములన్నీ పైకి వచ్చి, బయటి వేడి వాతావరణం వల్ల చచ్చిపోతాయి. దీనివల్ల క్రమంగా ఆ పొలంలో ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. వానపాములు చనిపోయిన కారణంగా పైరుల వేర్లకు ఎరువు అందించటం కోసం ఎక్కువ రసాయనిక ఎరువు వాడవలసి వస్తుంది. ఫలితంగా ఆ పొలంలో ఉత్పాదక శక్తి మరింత క్షీణించిపోతుంది.
అడవులను విపరీతంగా నరికేస్తున్నాం. ఏ దేశమైనా సంతులితమైన రీతిలో అభివృద్ధి చెందాలంటే 33శాతం అడవులు ఉంటాలి. మనం పాశ్చాత్యుల పోకడలను అనుసరించడం వల్ల మన దేశంలోని అటవీ ప్రాంతం 10 శాతం కంటే తగ్గిపోయింది. ఇది మరింతగా తగ్గితే మానవ మనుగడ ప్రశ్నార్థకవౌతుంది.
వనరుల వినిమయం - పూరణ..
ప్రకృతిలోని కొన్ని వనరులు వినిమయమైనప్పటికీ, వాటి పూరణ కష్టమేమీ కాదు. ఉదాహరణకు మనం చెట్ల నుండి పండ్లను కోసుకుంటాం. దానివల్ల చెట్లకు నష్టమేమీ జరగదు. అలా చేయడంవల్ల చెట్లకు మేలే జరుగుతుంది. అధిక పంట రాబడి కోసం రసాయనిక ఎరువులను వాడితే భూమికి తీవ్రనష్టాన్ని కలిగిస్తున్నట్టే భావించాలి. కొన్ని సంవత్సరాలలోనే భూమి తన సహజమైన సారాన్ని కోల్పోతుంది. రసాయనిక ఎరువులు వాడటంవల్ల అమెరికాలో లక్షల ఎకరాల భూమి బీడుపడిపోయింది. ఆధునికత పేరుతో ఈ విధ్వంసం ఇంకెంతకాలం సాగాలి? అనవసరమైన ఆడంబరాల కోసం ప్రకృతి వనరులను శోషింపజేయడం ఎంతమాత్రం వివేకం కాదు. వనరుల వినిమయం కోసమే భగవంతుడు మనల్ని పుట్టించలేదు. యంత్రాలు పనిచేయాలంటే తగినంత ఇంధనం కావాలి. కానీ ఇంధనాన్ని వినిమయం చేయడానికే యంత్రాలు పనిచేయకూడదు కదా. తక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయడం ద్వారా అధిక రాబడి వచ్చే విధంగా మనం ఆలోచించాలి.
మానవ జీవన వికాసాన్ని, లక్ష్యాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వనరుల పరిమిత వినిమయంతో ఆర్థిక లక్ష్యాలను సాధించేలా మనం ఆలోచనలు చేయాలి. అటువంటి వ్యవస్థయే నిజమైన నాగరిక వ్యవస్థ. ఇటువంటి వ్యవస్థలోనే మానవుని సమగ్ర వికాసం గురించి చింతన ఉంటుంది. ప్రకృతి వనరుల శోషణ గాకుండా, వాటి పోషణ, సంరక్షణకు ఈ వ్యవస్థ పెద్దపీట వేస్తుంది. గోవు పొదుగు నుండి పాలు పిండడం కాకుండా పితకడం మన పద్ధతి కావాలి.

-డాక్టర్ దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690