సబ్ ఫీచర్

మండే సూర్యుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్ర సాహిత్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని వెండితెరను ఎర్ర తెరగా మార్చిన ఘనత ‘మాదాల రంగారావు’దే. మన తెలుగు చలనచిత్ర రంగానికి ‘రెడ్ కార్పెట్’ (ఎర్ర తివాచీ) పరచిన ‘విప్లవ నటుడు’ మాదాల రంగారావు. సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, నవలా చిత్రాలు, బయోపిక్ చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవాత్మక చిత్రాలకు నాంది పలికిన హీరోలకు ‘హీరో’ మాదాల రంగారావు. సినీ కళాకారులందరూ సంపాదనకోసం, పేరుప్రతిష్టలకోసం, సెలబ్రిటీల హోదాకోసం, జీవనోపాధికోసం చిత్ర రంగంలో కృషిచేసినవారే, చేస్తున్నవారే. మాదాలవారు మాత్రం ‘దేశంకోసం, సమాజంకోసం, జనచైతన్యంకోసం, సందేశాత్మక చిత్రాలు నిర్మించి, విప్లవ చిత్రాలకు బీజంవేశారు, నాంది పలికారు.
విప్లవ సాహిత్యానికి ఆ కలం పెట్టింది పేరు, భగభగమండే నిప్పురవ్వల అక్షరాలు. సమాజ కుళ్లును, రాజకీయ నిజ స్వరూపాలను, దేశ దిగజారుడుతనాన్ని, కుళ్లిపోతున్న మానవత్వాన్ని జరుగుతున్న అవినీతి అన్యాయ దౌర్జన్యాలను ఎండగట్టిన ఎర్రకలం.. కాలగర్భంలో కలిసిపోయిన ‘మహాకవి శ్రీశ్రీ’గారి కలం. మనిషిని మనిషి దోచుకోవడం సహించని కలం, అవినీతిని సహించని కలం, రాజకీయ ముసుగు మర్మాలను సమాజానికి చాటిచెప్పిన కలం, అవినీతిపరుల, అక్రమార్కులకు ముచ్చెమటలు పట్టించిన కలం. ఆ మహాకవి చెప్పిన సత్యాలన్నీ నేడు మనం చూస్తున్నాం. ‘ఉన్నది మనకు ఓటు-బ్రతుకుతెరువుకే లోటు,’ ‘సస్యశ్యామల దేశం- అయినా నిత్యం క్షామం’, ‘ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పుసముద్రం పాలు’, ‘ఆకాశం అందుకునే ధరలొక వైపు- అదుపులేని నిరుద్యోగమింకొకవైపు- అవినీతి బంధుప్రీతి- చీకటి బజారు- అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు’లాంటి నగ్నసత్యాలు చెప్పడం ఆ మహాకవికే- ఆ కలానికే చెల్లింది. ఆ ఎర్ర సాహిత్యాన్ని స్ఫూర్తిగా చేసుకుని వెండితెరను ఎర్ర తెరగా మార్చిన ఘనత ‘మాదాల రంగారావు’దే. మన తెలుగు చలనచిత్ర రంగానికి ‘రెడ్ కార్పెట్’ (ఎర్ర తివాచీ) పరచిన ‘విప్లవ నటుడు’ మాదాల రంగారావు. సాంఘిక చిత్రాలు, పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు, నవలా చిత్రాలు, బయోపిక్ చిత్రాలు, చారిత్రాత్మక చిత్రాలు రాజ్యమేలుతున్న కాలంలో విప్లవాత్మక చిత్రాలకు నాంది పలికిన హీరోలకు ‘హీరో’ మాదాల రంగారావు. సినీ కళాకారులందరూ సంపాదనకోసం, పేరుప్రతిష్టలకోసం, సెలబ్రిటీల హోదాకోసం, జీవనోపాధికోసం చిత్ర రంగంలో కృషిచేసినవారే, చేస్తున్నవారే. మాదాలవారు మాత్రం ‘దేశంకోసం, సమాజంకోసం, జనచైతన్యంకోసం, సందేశాత్మక చిత్రాలు నిర్మించి, విప్లవ చిత్రాలకు బీజంవేశారు, నాంది పలికారు. ప్రతి చిత్రంలో ఓ సందేశం అందించాడు ఆ విప్లవ నటుడు. అందుకే హీరోలకు హీరో అని సంబోధించాను. ఆయన ఏ చిత్రంలోను ఖరీదైన దుస్తులు, వాహనాలు, భవంతులు, హోదాలుగల విలాసవంతమైన పాత్రల్లో నటించలేదు. నటించిన పాత్రలన్నీ సామాన్యమైన పాత్రలే, జనజీవన స్రవంతిలో కలిసిపోయే పాత్రల్లో నటించాడు, కాదుకాదు జీవించాడు. సమాజానికో సందేశం, ప్రజల్లో జనచైతన్యం కలిగించే చిత్రాలు తీశారు, అలాంటి పాత్రల్లో మాత్రం నటించాడు. ప్రేమగీతాలు, యుగళ గీతాల్లాంటివి ఆయన చిత్రాల్లో కనిపించవు. అర్ధనగ్న దృశ్యాలు, బూతు హాస్యం, ద్వంద్వార్థాల సంభాషణలు, అశ్లీలతలు ఆయన చిత్రాల్లో వుండవు. అమాయకులైన సామాన్యులకోసం, వారేవిధంగా మోసపోతున్నారో, వంచించబడుతున్నారో, దోపిడీ చేయబడుతున్నారో, ప్రజలను కుల-మతాల పేరిట వెలివేసి హీనంగా చూస్తున్నారో, కూడు-గుడ్డ- నీడకోసం ఎలా అవస్థలు పడుతున్నారో లాంటి సమాజ కుళ్లును తన చిత్రాల ద్వారా బహిర్గతం చేసిన విప్లవ నటుడు మాదాల. సమాజ సమస్యల నెత్తిచూపుతూ, ప్రజలను చైతన్య దిశగా నడిపించే దిక్సూచి చిత్రాలు వారివి. ఈ ‘కింగ్‌లు-బొంగులు, స్టార్లు, స్టార్లు’ చేయలేని సమాజ మార్పు మాదాలవారు చేసి చూపించారు. అందుకే ఆయన ప్రజానటుడు- విప్లవ నటుడు- హీరోలకు హీరో. ఆ తరం తర్వాత ‘శివకృష్ణ’ విప్లవ నటునిగా వెలుగుతూ, ఇతర మామూలు పాత్రలు చేస్తూ విప్లవ బాటను వదిలివేశాడు. మాదాల పేరు నిలబెట్టే విప్లవ నటునిగా స్థిరపడలేకపోయాడు, కాని చేసిన విప్లవ పాత్రలను కడు సమర్ధనీయంగా పోషించి యువ అభిమానులను సంపాదించుకున్నాడు, ‘శహబాస్’ అనిపించుకున్నాడు. ప్రస్తుతం మన టాలీవుడ్ రంగంలో ‘మాదాల-శివకృష్ణ’ల లేని లోటు తీర్చుతూ ‘నటుడు నారాయణమూర్తి’ ఎర్రబాట పట్టి, ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయినా, పట్టువదలని విక్రమార్కునిలా ప్రజాసమస్యలను వెండితెరపై వెలిగిస్తూనే వున్నాడు. ‘ప్రభుత్వాలకు- పాలకులకు- అధికారులకు- భూస్వాములకు- వ్యాపారవేత్తలకు’ కనువిప్పు కలిగించే చిత్రాలు నిర్మిస్తూ, నటిస్తూ నిరుపేద ప్రజల అభిమానం చూరగొంటున్నాడు. ప్రతి చిత్రం సమాజ చైతన్యం- జన చైతన్యం చూపించేవే. వ్యాపారం-పెట్టుబడి- లాభం- సంపాదన-అవార్డులు- రివార్డులు ఈయన ఆశించలేదు. అవినీతికర దేశంలో, పరిపాలనలో జరిగే కుళ్లును చూపించి, ప్రజలను ఉత్తేజపరచడం, చైతన్యపరచి నిజానిజాలు ప్రబోధించడం, సమస్యలకు పరిష్కారం చూపడమే ఆయన నటించే తీసే చిత్రకథలు (సమస్యలు). కాని ప్రజలలో ఆ మార్పు వస్తుందా లేదా అన్నది మనం చెప్పలేం. మార్పురావాలన్నదే ‘మాదాల-శివకృష్ణ-నారాయణమూర్తు’ల ఆశయం, కోరిక. మాదాల రంగారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన తనయుడు మాదాల రవి ‘నేను సైతం’ అంటూ ఆయన చూపిన మార్గంలో చిత్రసీమలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. చక్కటి వ్యక్తిగా అందరిచేత ప్రశంసలు అందుకున్నారు. తండ్రి ఆశయాల సాధన కోసం కృషి చేయాలన్నదే రవి లక్ష్యం. ఆ దిశగా అడగులు వేస్తూనే వున్నారు. శుభం కలగాలని ఆశిద్దాం. ఈ నటులు తప్ప, మిగతావారంతా పారితోషికంకోసం నటిస్తున్నవారే, వారికి సందేశం- నీతి పట్టదు.
ఆ ప్రజానటుడు మాదాల ‘యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, మహాప్రస్థానం’లాంటి జనచైతన్య చిత్రాలల్లో నటించాడు. అలాంటి చిత్రాలు నిర్మించాడు (దాదాపు 20 చిత్రాలు). ఆయన అనారోగ్యంతో మరణించినట్లు బుల్లితెర వార్తల్లో వినిపించారు. ఆయన సినీ జీవిత చరిత్రగాని, ఆయన చిత్రాల గురించి కాని, ఏ సోషియల్ మీడియాగాని, దినపత్రికలవారు గాని విశే్లషించక పోవడం విచారించతగ్గ విషయమే. పలానా నటికి జ్వరం వచ్చింది, పలానా హీరోకు దగ్గు- జలుబు చేసిందను చెత్తవార్తలను 24గంటలు చెబుతారు, చూపించిన బిట్స్ చూపిస్తూ బోరుకొట్టిస్తారు. అగ్ర నట హోదాలేని వాడని, వారసత్వ ముసుగులోనుండి రాలేదని, నోట్లకట్టలపై పవళింపలేదని, మామూలు సాదా నటుడని అలా నిర్లక్ష్యం చేయడం మీడియాకు తగదు. సెలబ్రెటీ నటుడుకాదని ప్రజానటున్ని గురించి ప్రేక్షకులకు తెలుపకపోవడం జర్నలిజానికి ద్రోహం చేసినట్లే, మీడియాకు అలాంటి వివక్ష తగదు. మహాకవి నిప్పురవ్వల రచనలకు తెర రూపం ఆవిష్కరించిన విప్లవ నటుడు, ప్రజానటుడు, హీరోలకు హీరో మాదాల నిజంగా మండే సూర్యుడే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ‘లాల్ సలాం’ చేద్దాం! జోహార్లు అర్పిద్దాం!

--మురహరి ఆనందరావు