సబ్ ఫీచర్

సవాళ్లకు ఎదురీది సత్తా చాటుతా..( సివిల్స్ టాపర్ టీనా మనోగతం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘సాదాసీదాగా ఉద్యోగం చేయడం కాదు.. సవాళ్లను ఎదుర్కొంటూ సమాజం కోసం పనిచేస్తేనే మన సత్తా ఏమిటో ప్రపంచానికి తెలుస్తుంది..’ అంటున్నారు సివిల్ సర్వీసెస్ పరీక్షలో టాపర్‌గా నిలిచిన టీనా డాబీ. లింగ వివక్షకు నిలయమైన హర్యానాలో పనిచేసేందుకు ఇష్టపడుతున్నానని, అక్కడి మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తానని ఆమె తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ‘హర్యానాలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు ఎక్కువ.. ఫలితంగా అక్కడ స్ర్తి, పురుష నిష్పత్తి రేటు చాలా ఆందోళనకరంగా ఉంది.. ఓ సవాల్‌గా భావించి లింగ వివక్షను అంతం చేసేందుకు పనిచేస్తా.. అక్కడి మహిళలు సాధికారత సాధించేలా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా..’ అని టీనా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో ఆర్థికంగా హర్యానా రాష్ట్రం బలపడుతున్నా స్ర్తి, పురుష సమానత్వం విషయంలో ఇంకా వెనుకబడే ఉందని ఆమె అంటున్నారు. బాలికల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో అక్కడ అనేక సామాజిక సమస్యలు నెలకొంటున్నాయన్నారు. ఆ రాష్ట్రంలో లింగ వివక్షను నిర్మూలించేందుకు, మహిళలు ఆర్థికంగా రాణించేందుకు ఎంతో చేయాల్సి ఉందని, అందుకే హర్యానాలో పనిచేయాలన్నదే తన ఆకాంక్ష అంటున్నారు.
మహిళలకు భద్రత పెనుసమస్య..
పలురంగాల్లో మన దేశం ముందుకు సాగిపోతున్నప్పటికీ మహిళలకు భద్రత ఇప్పటికీ ఓ సమస్యగా ఉందని టీనా ఆవేదన చెందుతున్నారు. లింగ వివక్ష కారణంగా కొన్ని చోట్ల బాలికల సంఖ్య తగ్గుతోందని, సమాజపరంగా మార్పులు తెచ్చేందుకు సివిల్ సర్వీసెస్‌లో ఉద్యోగం ఎంతగానో దోహదపడుతుందని ఆమె అంటున్నారు.
దేశ రాజధాని దిల్లీకి చెందిన 21 ఏళ్ల టీనా డాబీ మొదటి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించి జాతీయ స్థాయిలో సంచలన యువతిగా నిలిచారు. సివిల్స్ ఫలితాలు తెలిశాక ఆమె భావోద్వేగానికి లోనై- ‘మంచి ర్యాంకు వస్తుందని ఊహించా.. అయితే దేశంలోనే టాపర్‌గా నిలుస్తానని అనుకోలేదు.. ఫలితాలను మళ్లీ మళ్లీ చూసుకున్నాక గానీ నమ్మకం కుదురలేదు..’ అన్నారు. దిల్లీలోని ప్రఖ్యాత లేడీ శ్రీరామ్ కళాశాలలో రాజకీయ శాస్త్రంలో డిగ్రీ చేసి పిన్న వయసులోనే సివిల్స్ టాపర్‌గా నిలిచిన ఘనత తనకు దక్కిందంటే అందుకు తన మాతృమూర్తే కారణమని టీనా వినమ్రంగా చెబుతున్నారు.
తన తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లే అయినప్పటికీ సైన్స్‌కు బదులు ఆర్ట్సులో ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. ‘11వ తరగతి వరకూ సైన్స్ గ్రూపులోనే చదివా.. మా అమ్మే నాకు రోల్ మోడల్.. ఆమె చెప్పినట్టే పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ చేశా.. ఏకాగ్రత, క్రమశిక్షణ, కఠోర శ్రమతో చదివి సివిల్స్‌లో ఇంతటి ఘనత సాధించానంటే అది అమ్మ వల్లే.. ఆమె వల్లే ఈరోజు టాపర్‌గా నిలిచా.. ఆమె మార్గదర్శి కాకుంటే ఏదీ సాధించేదాన్ని కాను..’ అని టీనా వివరించారు.
ఇతరులకు
పాఠాలు చెప్పేది..
‘చదువులో ఆమె ప్రజ్ఞ అపారం.. స్పందించే గుణం ఎక్కువే.. అందుకే అందరి దృష్టి ఆమెపైనే ఉండేది.. తరగతి గదిలో ఆమె తరచూ వెనక బెంచీల్లో కూర్చుని పాఠ్యాంశాల విషయంలో సహచర విద్యార్థులకు సహాయపడేది.. చదువులో వెనకబడ్డ వారికి స్వయంగా పాఠాలు చెప్పేది..
ఈ అలవాటుతో ఆమెకు సబ్జెక్టుపై మరింత పట్టు పెరిగేది.. కళాశాలకు వచ్చే వందలాది మంది విద్యార్థుల్లో ఇలాంటి లక్షణాలున్న వారు అరుదుగా ఉంటారు..’ అని లేడీ శ్రీరామ్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు ప్రొఫెసర్ కృష్ణమీనన్ టీనా గురించి చెప్పారు. డిగ్రీలో టాపర్‌గా నిలిచిన ఆమె సివిల్స్‌లోనూ టాపర్‌గా నిలవడంతో తమ కళాశాల పేరు ఇపుడు మార్మోగుతోందని ఆయన అంటున్నారు.
chitram...
అమ్మతో ఆనందంగా..