స్వాధ్యాయ సందోహం

స్వాధ్యాయ సందోహం--18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
న దుష్టుతి ర్ద్రవిణోదేషు శస్యతే
దుర్మార్గాలలో నడిచేవాడు మోక్ష ధనదాతలలో ప్రశంసింపబడడు. అసలు ఇచ్చేందుకు అతడి వద్ద నిజంగా అట్టి మోక్షధనముంటే కదా?
ఈ వచనం ద్వారా వేదం ఇతరులనుండి దేనినయినా పొందడాన్ని ప్రశంసించక ఇతరులకుచేసే దానగుణానే్న ప్రశంసించింది. ఎందుకంటె దానగుణం మనిషి ఘనతను- ఔదార్యాన్ని ప్రకటించే సుగుణం కాబట్టి. ఋగ్వేదమిదే రీతిగా మరో మంత్రంలో-
న దుష్టుతీ మర్త్యో విందతే వసు
‘మనిషి దుష్టోపాయాలతో మోక్షధనానే్న కాదు సామాన్యధనాన్ని కూడా ఆర్జింపలేడు’ అని మరో మంత్రంలోకూడా ఈ మోక్ష ధన ప్రాముఖ్యానే్న నొక్కి వక్కాణించింది.
ఇలా మోక్షధనాన్ని ఆర్జించలేనివారిలో పరహింసా వీలం కలవాడు కూడా ఉన్నాడని పై మంత్రం
న స్త్ధ్రేంతం రయి ర్నశత్- అనే రెండవ చరణంలో నిర్థారించింది. ఎంతటి శాస్తవ్రేత్త అయినా అతడు తన దుష్టస్వభావాన్ని విడిచిట్టనంతవరకు శాంతిధనాన్ని, ఆత్మసంపత్తిని పొందజాలడు.
యమధర్మరాజు నచికేతునికి ఈ విషయానే్న ఇలా వివరించాడు.. దురాచారాలను వీడనివాడు, చపల స్వభావం కలవాడు, ఇతరులకు ఆపదలను కలిగించువాడు, నిశ్చలబుద్ధి లేనివాడు, మనశ్శాంతి లేనివాడు, బుద్ధిబలంచేతగాని, విజ్ఞానం చేతగాని ఆత్మజ్ఞానాన్ని పొందజాలడు.
ఆత్మజ్ఞాన సంపన్నత లేనివానికి శాంతి లభించదు. ప్రమాదకారులగు అనాచారులకు ఆత్మజ్ఞనమే లభించనపుడు దానివలన వారు లక్షించే (కోరే) శాంతి మంత్రం ఎలా లభించగలదు?
కాబట్టి భగవదర్పణబుద్ధితో మోక్షఫలాన్ని ప్రసాదింపగల శక్తిశాలియైన మహాపురుషుడే యోగ్యులకు ప్రదానం చేయగలడు. అశాశ్వతమైన ఈ లోకంలో సుఖంగా జీవించేందుకు ఇంత చన్నచోటే లేనివాడికిమోక్షధనం కలిగి శాశ్వతమైన పరలోకంలో శాంతిగా జీవించేందుకు చోటుంటుందని చెప్పగలమా? కాబట్టి పరలోకంలో శాశ్వతంగా ఉండేందుకు, అవసరమైన మోక్షధనాన్ని ఆర్జించేందుకు ఎంతో మనోబల మావశ్యకం.
ఆధ్యాత్మిక జ్ఞానానుభవం
శ్రుణ్వే వృష్టేరివ స్వనః పవమానస్య శుష్మిణః
చరంతి విద్యుతో దివి
భావం: జీవులను పలు బాధలచే దుఃఖపరచే కుసంస్కారాలను నశింపజేసి శాంతిని కలిగించే శక్తివంతుడైన పరమాత్ముని జ్ఞానప్రబోధ సందేశాలు ధారాపాతంగా కురిసే వర్షధారల శబ్దాలవలె వినబడుతున్నాయి. వర్ష సమయంలో మెరిసే మెరుపుల వలె జ్ఞానప్రకాశ కాంతులు నా బుద్ధియందు మిరుమిట్లు గొలిపేలా వెలుగుతున్నాయి.
వివరణ: ఆధ్యాత్మిక తత్త్వానే్వషణలో సాధన పరిపక్వమైనపుడు సాధకుడికి కలిగే అనుభవ మీ మంత్రంలో సూచనప్రాయంగా వర్ణించబడింది. సామవేదం సంపూర్ణంగా వివిధ ఆధ్యాత్మిక అనుభూతుల సమ్మేళనం. అనేక భగవదుపాసనలకు చెందిన సమస్త భూమికలు ఈ వేదంలో దర్శనమిస్తాయి. అట్టివానిలో సాధకునికి సాధనానంతరం కలిగే సఫలమైన దివ్యానుభవమెట్టిందో ఈ మంత్రంలో ప్రస్తావించబడింది.
భగవంతుడు అజ్ఞానులైన సాధారణ జనులకు, జ్ఞానులైన మహాపురుషులకు వారి వారికి యోగ్యంగా జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు. కానీ చాలామంది దానిని పెడచెవిని పెడుతూ ఉంటారు. కొందరు మాత్రం వినే ప్రయత్నం చేస్తారు.