సబ్ ఫీచర్

పాదాల పగుళ్ళ నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఫలితంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శరీర భారాన్ని మోసే పాదాలు వర్షాకాలం, చలికాలాల్లో బాగా ఇబ్బందులకు గురవుతాయి. ఈ సమస్య కేవలం ఆడవాళ్ళలోనే కాదు మగవాళ్ళలో కూడా కనిపిస్తుంది. మొదట్లో ఇది పెద్ద సమస్యగా అనిపించకపోయినా తరువాత తరువాత ఇది పెనుసమస్యగా మారే అవకాశముంది. అందుకే ముందస్తుగానే కొన్ని జాగ త్తలు తీసుకోవడం వల్ల పగుళ్ళను నివారించుకుంటే మంచిది. ఇంట్లోని వస్తువుల ద్వారానే పగుళ్ళను చక్కగా తగ్గించుకోవచ్చు. అవేంటో ఒకసారి చూద్దాం.

బియ్యం పిండి
బియ్యం పిండిలో కాస్తంత తేనె, యాపిల్ సిడార్ వెనిగర్‌ను చేర్చి పేస్ట్‌లా తయారుచేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటిలో పాదాలను నాననిచ్చిన అనంతరం ఈ పేస్ట్‌తో పాదాలను బాగా రుద్ది శుభ ంగా కడగాలి. తరువాత పాదాలను తడి లేకుండా తుడుచుకుని ఆలివ్ ఆయిల్‌ను పట్టించాలి. కాసేపటి తరువాత సాక్స్ వేసుకుని పడుకోవాలి. ఇలా క మం తప్పకుండా కొన్ని రోజుల పాటు చేస్తే పగుళ్ళు కనిపించమన్నా కనిపించవు.
వంటనూనె
వంటల్లో ఉపయోగించే ఏ నూనెతోనైనా పగుళ్ళకు చెక్ పెట్టేయవచ్చు. ముందుగా పాదాలను గోరువెచ్చటి నీటిలో పదిహేను నిముషాలు నానబెట్టాలి. తరువాత ఫ్యూమిక్‌స్టోన్‌తో రుద్ది మఋతచర్మాన్ని, మురికినంతా పోగొట్టాలి. తర్వాత మంచి నీళ్ళతో కాళ్ళను శుభ ంగా కడిగి, తడి లేకుండా తుడిచి ఇంట్లో ఉపయోగించే ఏదో ఒక వంటనూనెను పట్టించాలి. తరువాత సాక్స్ వేసేసుకోవాలి. ఇలా క మం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితాలు వస్తాయి.
రోజ్‌వాటర్, గ్లిజరిన్
రోజ్‌వాటర్‌లో ఎ, డి, ఇ, సి, బి3 విటమిన్‌లు చర్మానికి పోషణని అందిస్తాయి. గ్లిజరిన్ చర్మాన్ని మఋదువుగా తయారుచేస్తుంది. రోజ్‌వాటర్, గ్లిజరిన్‌ను సమాననిష్పత్తిలో తీసుకుని బాగా కలిపి నిద పోయేముందు పాదాలకు పూయాలి. ఉదయానే్న గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే పాదాల పగుళ్ళు తగ్గుతాయి.
ప్యారాఫిన్ వ్యాక్స్
పారాఫిన్ వ్యాక్స్‌కు ఆవనూనె లేదా కొబ్బరినూనెను కలపాలి. ఈ మిశ మాన్ని వేడిచేసి వ్యాక్స్ పూర్తిగా కరిగిన తరువాత స్టవ్‌పై నుండి దించి చల్లార్చాలి. దీన్ని పడుకోవడానికి ముందు పాదాలకు పట్టించి ఉదయానే్న కడిగేసుకోవాలి. దీంతో పాదాలు పగుళ్ళు లేకుండా మఋదువుగా మారతాయి.
వేపాకు
వేపాకు యాంటీబయాటిక్. దీనిలో పాదాల పగుళ్ళ నుంచి రక్షణ కలిగించే యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే గుప్పెడు వేపాకుకు స్పూన్ పసుపును కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ మాన్ని పాదాలకు పట్టించి అరగంట తరువాత నెమ్మదిగా రుద్దుతూ పాదాలను శుభ ంగా కడిగేసి, తడి లేకుండా తుడవాలి. తరువాత నూనెతో మర్దనా చేయాలి. ఇలా తరచూ చేస్తే పగుళ్ళు మాయమై పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.
*