సబ్ ఫీచర్

ఆరోగ్యానికి ఆకుకూరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకుకూరల్లో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా వుంటాయి. అందుకే వాటిని రక్షక ఆహారంగా పరిగణిస్తారు. వాటిలో ఇనుము, కాల్షియం, విటమిన్ ఎ, ముఖ్యంగా రైబోఫ్లొనివ్ యాసిడ్‌లు పుష్కలంగా వుంటాయి. బలమైన ఎముకలు, ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లకోసం ఆకుకూరలు తినాలి.
ఆకుకూరల్లో విటమిన్ ఎ ఎక్కువగా వుంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లల కళ్ల ఆరోగ్యం కోసం విటమిన్ ఎ తప్పనిసరి. శరీరంలో తగిన మోతాదులో విటమిన్ ఎ లేనట్లయితే కనుగుడ్లు తేమను కోల్పోయి, తెల్లగా కనబడతాయి. పొడిగా ముడతలు పడి వుంటాయి. ఒక్కోసారి కంటిలోని కార్నియా దెబ్బతిని శాశ్వతంగా అంధత్వం లభిస్తుంది. విటమిన్ ఎ కేవలం జంతు సంబంధ ఉత్పత్తులైన వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, గుడ్డులోని పసుపు కాలేయం వంటి వాటిలోనే వున్నప్పటికీ, ప్రకృతి మనకు దానిని బీటా కెరోటిన్ రూపంలో ఆకు కూరల ద్వారా అందించి రక్షణ లభిస్తుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. అంతేకాదు పిల్లల్లో శారీరక పెరుగుదలను అధికం చేసి, రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మన శరీరంలో ఇనుము లోపిస్తే రక్తహీనతకు గురవుతాం. అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతుంది. ముఖ్యంగా స్ర్తిలలో పిల్లలలో రక్తహీనత ఎక్కువగా వుంటుంది. రక్తహీనతవల్ల శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. నెలలు నిండకముందే ప్రసవం జరగడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఇతర శారీరక రుగ్మతలు కలుగుతాయి. కళ్లు తిరగడం, చర్మం పాలిపోవడం, గోళ్లు, ముఖం, నాలుక, పెదవులు పాలిపోవడం సాధారణంగా రక్తహీనతలకు చిహ్నాలు. ఆకుకూరల్లో ఇనుము లభిస్తుంది. ఆహారంలో తీసుకునే పీచు పదార్థాలకు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలున్నాయి. ఆకుకూరల్లో వుండే పీచు పదార్థాలు మలవిసర్జనను సులభం చేసి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. గుండె జబ్బులవంటి ఆహార సంబంధ వ్యాధులనుండి ఇవి మనలను కాపాడతాయి. ఇన్ని ఉపయోగలున్న ఆకుకూరలు మనకు చాలా చవకగా లభిస్తాయి.
అంతేకాదు, పెరట తోటల్లో పూల కుండీల్లో పెంచుకోవచ్చు. రోజు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా వుండేలా చూసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతికూర, మునగ ఆకులు, ముల్లంగి ఆకులు వంటి ఆకుకూరలు దేశమంతటా భుజిస్తారు. ఆకుకూరలు సన్నగా తరిగి, పిండితో కలిసి చపాతీలు, పరాఠాలు చేయవచ్చు. ఆకుకూరలు పప్పుతో ఉడికించి తింటే ఆహారంలో మాంసకృతులు పరిమాణం పెరుగుతుంది. ఆకుకూరలతో ఇంకా పులుసుకూర, వేపుడు వంటి పదార్థాలనేకాక, పకోడీలు, బజ్జీలలాంటి స్నాక్స్ వంటివి కూడా చేయవచ్చు. క్యారెట్, ముల్లంగి, టర్మిప్, బీట్‌రూట్, కాలీఫ్లవర్ తదితర కూరగాయలు, ఆకులు, ఆకుకూరల చట్నీలు కూడా చేయవచ్చు. కాని ఇవి వండేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత తక్కువ నీటిలో వీటిని తక్కువగా వుడికించాలి. ఎక్కువగా ఉడికించడంవల్ల వాటిలోని పోషక విలువలు తగ్గుతాయి. *