సబ్ ఫీచర్

‘సంఘ్’పై ఇంత విద్వేషం దేనికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆ రెస్సెస్,్భజపాలు సుప్రీం కోర్టు ద్వారా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దుచేస్తున్నాయి’ అంటూ కొన్ని ఎస్సీ,ఎస్టీ సంఘాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బిఎస్పీ వంటి పార్టీలు, కొన్ని ముస్లిం సంస్థలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీ, బిహార్‌ల్లో పెద్దఎత్తున దుష్ప్రచారం చేశాయి. ఈ ప్రభావానికి గురైన గ్రామీణ ఎస్సీ, ఎస్టీ యువకులు ఏప్రిల్ 2న భారత్ బంద్‌ను నిర్వహించారు. అనేకచోట్ల బంద్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటుచేసుకుని దాడులు, ప్రతి దాడులు జరిగాయి. 10 మంది ఎస్సీ యువకులు, ఒక ఇతర కులాల యువకుడు కాల్పులలో మరణించాడు. బంద్ సందర్భంగా ఒక పోలీసు అధికారి గుండెపోటుతో మరణించారు. 250 మందికి పైగా గాయపడ్డారు. 50 స్థలాలలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, దుకాణాలపై దాడుల ఫలితంగా భారీగా ఆస్తినష్టం జరిగింది. బంద్ సందర్భంగా జరిగిన దుర్ఘటనల వల్ల హిందువుల్లోని ఎస్సీ, ఎస్టీలు, మిగతా కులాల మధ్య అపోహలు పెరిగాయి. ఈ దుష్ప్రచారం రాజకీయ దురుద్దేశంతో, వ్యూహాత్మకంగా భాజపా పాలిత రాష్ట్రాలలోనే జరిగింది.
అసలు కథ ఏమిటి?
మార్చి 20న ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ‘ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం’పై తీర్పునిస్తూ ‘ముందు కేసును నమోదు (ఎఫ్.ఐ.ఆర్.) చేయాలి. ఆ కేసులో నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి అయినట్లయితే వారం రోజుల లోపు పోలీసు అధికారిచే ఎంక్వైరీ చేయించిన తరువాత మాత్రమే ఆ వ్యక్తిని అరెస్టుచేయాలి’ అని చెప్పింది. ఈ తీర్పువల్ల తమ శ్రేయస్సు కోసం నిర్దేశించిన చట్టం బలహీనపడుతుందని ఎస్.సి., ఎస్.టి. సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వంలో ఎస్.సి. వర్గానికి చెందిన ముగ్గురు కేంద్ర మంత్రులు సైతం తమ ఆందోళనలను బహిరంగంగా వ్యక్తంచేశారు. సుప్రీం తీర్పుపై పునర్విచారణకు కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్.సి., ఎస్.టి. సంఘాలు 2 ఏప్రిల్‌న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ సంఘాల ఆందోళనలను మిగిలిన సమాజం సహృదయంతో అర్థం చేసుకోవాలి. తమ ఆందోళనను వ్యక్తం చేయటంలో భాగంగా ప్రదర్శనలకు దిగటం ప్రజాస్వామ్యంలో అందరికీ ఉన్న హక్కు. అయితే ఎస్.సి., ఎస్.టి.ల హక్కులను కాపాడాలన్న లక్ష్యం కంటే రాజకీయ లక్ష్యంతో మోదీ ప్రభుత్వంపై, ఆర్.ఎస్.ఎస్.పై దాడి చేయటమే లక్ష్యంగా అవాస్తవాలను ప్రచారం చేస్తూ పెద్దఎత్తున రెచ్చగొట్టేట్లు కొన్ని ఎస్.సి., ఎస్.టి. సంఘాలు, ఇతర సంస్థలు చేసిన దుష్ప్రచారం సామాజిక సామరస్యానికి విఘాతం కలిగించింది. ఇది అత్యంత దురదృష్టకరం.
ఆ చట్టం ఎందుకు?
స్వాతంత్య్రం లభించి 70 ఏళ్ళు గడుస్తున్నా గ్రామీణ భారతంలో వివిధ రూపాలలో కుల వివక్ష, అంటరానితనం దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా భారత రాజ్యాంగపు సమానతా స్ఫూర్తిని అమలుచేయడానికి 1989లో ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం రూపొందింది. అస్పృశ్యత పాటించినా, కులం పేరుతో దూషించినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు. సమాజంలో కొద్దిమంది మాత్ర మే సహృదయంతో ఆలోచిస్తారు, వ్యవహరిస్తారు. సమరసతా స్ఫూర్తితో ఆలోచిస్తారు, వ్యవహరిస్తారు. అందుచేతనే ఈ పదునైన చట్టం రూపొందింది. అయితే విచిత్రం! పాలకుల రెండు నాల్కల ధోరణికి ఒక ఉదాహరణ ఏంటంటే, 1989లో పార్లమెంటులో ఇది చట్టంగా రూపుదిద్దుకున్నా, దీని అమలుకు, నియమావళి రూపొందడానికి మరో ఆరేళ్ళు పట్టింది.
చట్టం వల్ల ప్రయోజనం?
ఈ చట్టం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అంటరానితనం ఎంతవరకు తగ్గిందన్నది ప్రశ్నార్థకమే. ఈ చట్టం వల్ల ఇతర కులాల హిందువులలో అస్పృశ్యత ఆచరణ పట్ల, ఎస్.సి., ఎస్.టి. వర్గాల పట్ల కుల దూషణ విషయంలో ఒక భయం ఏర్పడింది. అస్పృశ్యతకు గురైనవారు పోలీసుస్టేషనుకు వెళితే రాజకీయ అండకానీ, ఆర్థిక బలంకానీ లేకపోతే కేసులే నమోదు కావు. కేసులు నమోదు అయినా దోషులకు శిక్షలుపడవు. గ్రామంలో మిగిలిన ప్రజానీకంతో కలిసి జీవించాలి కనుక ఆవేశం తగ్గిన తరువాత ఎస్.సి. బాధితులు కేసును ఉపసంహరించుకోవలసి వస్తోంది. వివిధ రాష్ట్రాలలో నమోదైన కేసులకు, శిక్షపడిన కేసులకు మధ్య అంతరం ఎంతో ఎక్కువ ఉంది. దీనికి అనేక కారణాలున్నాయి. ఫలితంగా ఎస్.సి., ఎస్.టి.లను దూషించటానికి భయపడే వాతావరణం ఏర్పడింది కాని, గ్రామీణ ప్రాంతాలలో అస్పృశ్యత ఆశించినమేరకు తగ్గలేదనడం అంగీకరించాల్సిన వాస్తవం. ప్రత్యేకంగా ఉత్తరాది రాష్ట్రాలలో వివాహం అనంతరం ఇతర కులాల వలే ఎస్.సి. వధూవరులు గ్రామం మధ్య నుండి ఊరేగింపుగా వెళ్ళడం అసాధ్యమైన పరిస్థితి ఇంకా కొనసాగుతోంది.
సుప్రీం కోర్టు తీర్పు
కొన్ని సందర్భాలలో ఎస్.సి., ఎస్.టి. చట్టం దుర్వినియోగం అవుతున్నదని తాను ఇచ్చిన తీర్పులో సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. అంతమాత్రాన ఈ చట్టాన్ని రద్దుచేయాలని కోరడం సబబు కాదు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ‘ఎస్.సి., ఎస్.టి.చట్టాన్ని బలహీనపరచటం మా లక్ష్యం కాదు, అమాయకులైనవారు అరెస్టుకాకుండా చూడడమే మా లక్ష్యం’ అని స్పష్టం చేసింది. ‘వివిధ ఎస్.సి., ఎస్.టి. సంఘాల నేతలు తీర్పు పాఠాన్ని పూర్తిగా చదవకుండానే ఆందోళనకు గురవుతున్నారని’ పునర్విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.
చట్టానికి బలం ఇచ్చిన సర్కారు..
* 1999-2004 మధ్య కాలంలో ప్రధాని వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలు పొడిగిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది.
* వాజపేయి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగపు ప్రమోషన్లలో రిజర్వేషన్లపై రాజ్యాంగ సవరణ చేసింది.
* ఎస్.సి., ఎస్.టి. చట్టంలో కొన్ని మార్పులు చేయాలని వివిధ ఎస్.సి., ఎస్.టి. సంఘాల నుండి డిమాండ్లు వచ్చిన సందర్భంలో మన్‌మోహన్‌సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలను సూచించింది. ఇవి చట్టబద్ధం కాలేదు. 2014లో మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను అమలుచేస్తూ చట్టసవరణ చేసింది.
తీర్పులు- రాజకీయాలు
సుప్రీం కోర్టు తీర్పుకు, ఆర్.ఎస్.ఎస్.కు సంబంధం ఏమిటి? 1995 తర్వాత ఎస్.సి., ఎస్.టి. అత్యాచార నిరోధక చట్టంపై వివిధ ఉన్నత న్యాయస్థానాలు అనుకూలంగా, ప్రతికూలంగా అనేక తీర్పులు నిచ్చాయి. వాజపేయి ప్రభుత్వం ‘ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతిలో రిజర్వేషన్ల’పై చేసిన రాజ్యాంగ సవరణ అనంతరం వివిధ ఉన్నత న్యాయస్థానాలు అనేక తీర్పులనిచ్చాయి. ఆ సమయంలో కేంద్రంలో 10 సంవత్సరాల పాటు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. సుప్రీం కోర్టు తాజా తీర్పుకు మోదీ ప్రభుత్వమే కారణం అనే ఆరోపణ చేస్తున్నప్పుడు, పై తీర్పుల విషయంలోనూ యూపీఏ ప్రభుత్వాన్ని ఎస్.సి. ఎస్.టి. సంఘాలు తప్పుపట్టాలి కదా? వివిధ చట్టాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉన్నాయా? లేదా? అని వ్యాఖ్యానించవలసింది సుప్రీం కోర్టు. రాజ్యాంగపరంగా ఏర్పాటైన వ్యవస్థ అది.
సుప్రీం కోర్టు, ఇతర న్యాయస్థానాలు ఆర్.ఎస్.ఎస్. కనుసన్నలలో నడుస్తున్నాయని ఆరోపించటం అర్థం లేని అసత్యపు వాదన. కొన్ని కోర్టుల తీర్పులతో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు ఏకీభవించక పోవచ్చు. అలాంటివారు ఉన్నత న్యాయస్థానాలకు అప్పీలుకు వెళ్ళవచ్చు. ప్రజాభిప్రాయాలను కూడగట్టవచ్చు. దీనికి భిన్నంగా ఎస్.సి., ఎస్.టి. హక్కులను, రిజర్వేషన్‌లను ఆర్.ఎస్.ఎస్. కబళిస్తోందంటూ దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం.
ఆర్.ఎస్.ఎస్. విధానం
ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్లపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ కింది విధానాన్ని స్పష్టంగా పేర్కొన్నది.
* ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్లు ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఏర్పడినవి కావు. షెడ్యూల్డుకులాల ప్రజలు శతాబ్దాలుగా అంటరాని తనానికి గురైనందున, షెడ్యూల్డు తెగల ప్రజలు మారుమూల అటవీ ప్రాంతాలలో శతాబ్దాలుగా అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నందున ఎస్సీ, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం రిజర్వేషన్లు ఏర్పాటయ్యాయి.
* 70 ఏళ్ళ స్వాతంత్య్రానంతరం ఆశించిన మేరకు షెడ్యూల్డు కులాల, తెగల ప్రజల అభివృద్ధి జరగలేదు. ఈ పరిస్థితి ఏర్పడ్డానికి గల కారణాలను, లోపాలను గుర్తించడానికి జాతీయస్థాయిలో రిజర్వేషన్ల అమలుపై సమీక్ష జరగాలి. సమీక్ష అంటే రిజర్వేషన్ల రద్దు కాదు. మరింత మెరుగ్గా అమలుపరచడానికి కావలసిన చర్యలు తీసుకోవడం మాత్రమే.
* రాజకీయ ప్రయోజనాలతో వివిధ కులాల నుండి రిజర్వేషన్ల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో రిజర్వేషన్ల సక్రమ అమలుపై రాజకీయాలకు అతీతంగా, రాజ్యాంగ సమతాస్ఫూర్తి పట్ల విశ్వాసం కలిగిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడాలి.
* కుల వివక్ష, అంటరానితనం నిర్మూలన అయ్యేవరకు ఎస్.సి., ఎస్.టి.లకు రిజర్వేషన్లు కొనసాగాలి. ‘సమాజంలో అంటరానితనం, కుల వివక్ష లేవు కనుక మాకు రిజర్వేషన్లు అవసరం లేదు’- అని ఎస్.సి., ఎస్.టి. వర్గాలు ప్రకటించేంతవరకు ఆ సౌకర్యాలు కొనసాగాలి.
... ఇంత స్పష్టంగా ఆర్.ఎస్.ఎస్. తన విధానాన్ని ప్రకటిస్తున్నా, ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్లకు ఆ సంస్థ వ్యతిరేకం అంటూ దుష్ప్రచారం చేయటం అంటే ‘సత్యమేవ జయ తే’ అనే రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లుపొడవటం కాదా?

-డా. శంశతిలక్ 90008 49789