సబ్ ఫీచర్

మండువేసవిలో మల్లెల గుబాళింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలం వచ్చిందంటే చాలు మగువల మనసంతా మల్లెల పరిమళాలే. ఉష్ణతాపం వేళ చికాకులెన్నున్నా మల్లెల గుబాళింపును ఆస్వాదిస్తే చాలు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇంట్లో కిటికీ పక్కనో, బాల్కనీలోనో కాస్త ఎండ తగిలే స్థలం ఉంటే మల్లెమొక్కలను పెంచుతూ ఇంటిని సుగంధాలతో నింపేయవచ్చు. పెరట్లో విచ్చుకున్న మల్లెల సుగంధాలు ఇంట్లోనూ పరిమళించాలంటే కుండీల్లో ఈ మొక్కలను పెంచుకోవచ్చు. తీగమల్లెల్ని కూడా డబామీదకో, మెట్లమీదకో పాకేలా పెంచుకోవచ్చు. మల్లె అనగానే విరిసీ విరియని గుండ్రని మొగ్గలే మనకు గుర్తొస్తాయి. మత్తెక్కించే మల్లెల్లో జాస్మినమ్ సంబక్, మల్ట్ఫ్లీరమ్, అంగుష్టి ఫోలియం, మైసూరు మల్లె, అరేబియన్ నైట్స్ వంటి బోలెడు జాతులున్నాయి. ఇంట్లో పెంచడానికి అనువైన రకాన్ని ఎన్నుకుని మల్లె మొక్కల్ని కుండీల్లో లేదా ఖాళీ స్థలంలో నాటాలి. మల్లెపూలు పెట్టుకుని మురిసిపోవాలని ఆశించని మగువలు ఉండరనే చెప్పాలి. పరిమళాన్ని విరజిమ్మే ఈ పూలు పెట్టుకుంటే ఆడవారి అందం మరింత పెరుగుతుందని అందరికీ తెలుసు. ఇవి మనసులను సమ్మోహనపరిచి ఏవో లోకాలకు తీసుకువెళతాయి.
మానసిక వికాసానికి కూడా ఇవి దోహదపడతాయి. తలనొప్పితో బాధపడేవారు మల్లెపూలు పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. కురులు మెరుస్తూ, ఒత్తుగా ఉండాలంటే మల్లెలతో చేసిన నూనెను వాడుతుంటే ప్రయోజనం ఉంటుంది. అయిదు మందార పువ్వులు, పది మల్లెమొగ్గలు కలిపి రుబ్బుకోవాలి. అరకప్పు కొబ్బరినూనె కాచి, ఈ మిశ్రమాన్ని కలిపి మళ్లీ కాచాలి. చల్లారిన తరువాత సీసాలోగానీ, డబ్బాలోగానీ పోయాలి. వారంలో మూడు, నాలుగుసార్లు ఈ నూనెను తలభాగం నుంచి పాదాలవరకూ రాసుకుని బాత్ పౌడరుతో రుద్దుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది.
మల్లెపూలతో బాత్ పౌడర్‌ను కూడా తయారుచేసుకోవ్చు. ఎండిన మల్లెలు, మెంతులు, కుంకుడుకాయలను సమపాళ్లలో 100 గ్రాముల చొప్పున, పావు కిలో శెనగపిండిలో కలిపితే బాత్ పౌడర్ తయారవుతుంది. మల్లెపూల తైలాన్ని రాసుకుని, ఈ బాత్ పౌడర్‌తో తలనూ, శరీరాన్ని రుద్దుకుంటే జుట్టు రాలడం తగ్గి పరిశుభ్రంగా ఉంటుంది. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. వేసవిలో చెమటవల్ల, మొటిమలవల్ల కొందరి ముఖం కాంతి విహీనం అవుతుంది. జాజిపూల మొగ్గలు, మల్లె మొగ్గలు పది చొప్పున, రెండు చెంచాల పాలు కలిపి రుబ్బితే పేస్టులా అవుతుంది. ఈ పేస్టును ముఖానికి రాసుకుంటే మొటిమలు సమసిపోతాయి. ముఖం సరికొత్త కాంతులీనుతుంది. మల్లెల తైలం వల్ల శరీరం చల్లబడుతుంది.

- మనస్విని