సబ్ ఫీచర్

ఫ్యాషన్ విహంగాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంపులో గోవిందం లా ఉండాలని ఎవరైనా అనుకొంటారా? అందులోను స్ర్తిలు అసలే అనుకోరు. తమకంటూ ప్రత్యేక శైలి చూపాలని వారు మరీ కోరుకుంటారు. అదిగో అట్లాంటి ప్రత్యేక శైలికోసం చూసేవారికి
కొత్త కొత్త ఫ్యాషన్...
అనార్కలీ డ్రెసెస్...
ఫ్యాషన్ పాతదైనా కొత్తగా సరికొత్తగా మార్చుకుని ధరించేదే నేటి యువత ట్రెండ్
ఈ మధ్య అమ్మాయిల మనసుదోచే అనార్కలి మొదటి స్థానాన్ని ఆక్రమిస్తోంది.
మొగలుల కాలం నుంచి వాడుకలో ఉన్న పొడవాటి గౌన్ లాంటి కుర్తికే అనార్కలీ అనే పేరు.
కాని ఇప్పటి అనార్కలీ వేరు ...
అనార్కలీ చుడీదార్లో ఉన్న కుర్తినీ, లెహంగ చోళీలో ఉన్న లెహంగాన్ని మిక్స్ చేసి కొత్త కాంబినేషన్‌ని సృష్టించారు.
రెండింటిలోను ఉన్న దుప్పట్టాని మాత్రం ఈ కొత్త కాంబినేషన్‌లో ఉంచేసారు. ఈ సరికొత్త ఫ్యాషన్ దుస్తులు బరువైన సంప్రదాయ ఎంబ్రాయిడరీతోను, అలాగే తేలిగ్గా ఉండే నెట్ ఫ్యాబ్రిక్ తోను ఎక్కువగా మెరుస్తూ అమ్మాయిలనీ మురిపిస్తున్నాయి. బాలీవుడ్ భామల ర్యాంప్ వాక్‌లో ఒకప్పుడు తళుక్కుమనే ఈ లెహంగాలు ఇపుడు అన్ని షోరూమ్స్‌లో కళకళలాడుతున్నాయి.
చూసేందుకు విన్నూత్నంగా వైవిధంగా ఉండే ఈ డ్రెస్సులు రెండు రకాల సంప్రదాయ దుస్తులకు వారధిగా సందడి చేస్తున్నాయి.
ఇప్పుడు ఎసెమ్మిట్రికల్ అనార్కలీ కుర్తీతో కూడా లెహంగాలు కనువిందు చేస్తూ సినీ తారలనుంచి కాలేజీ అమ్మాయిల వరకు మనసును దోచుకుంటోంది.
స్పీవ్ లెస్‌లు, మెగా స్లీవులూ, పుల్‌స్లీవులూ, ఇలా ఎన్నో వైరైటీల్లో లభించే అనార్కలీ లెహంగాలు కాజువల్ వేర్‌గా కూడా అలరిస్తున్నాయి.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి