సబ్ ఫీచర్

ముళ్లున్నా ముందుకే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనే్నసి చూడు - ననే్నసి చూడు’ సామెతలో అన్నట్లు కూరల్లో ఎన్ని వేసి ఎంత మంచిగా వండినప్పటికీ అందులో ఉప్పు లేకుంటే ఆ కూరను అసలు తినలేము. అంతటి ప్రాధాన్యత ఉప్పుకు ఉంది. అదేవిధంగా స్ర్తికి ఎన్నివేల రూపాయల చీర కట్టినప్పటికీ, లక్షల రూపాయల నగలు పెట్టినప్పటికీ, స్ర్తి సిగలో పూలు లేకుంటే అంత అందం రాదు.ఒక్క పూల అలంకరణతోనే స్ర్తి తత్వాన్ని నిండుగా సంతరించుకుంటుంది. అందుకే స్ర్తీలకు ప్రత్యేక అలంకరణలు ఏవీ లేకపోయనా ప్రకృతిచ్చిన పూలు, పసుపు కుంకుమలే ఆభరణాలుగా వెలుగొందుతాయ.
వివాహాది శుభకార్యాల్లో మండపాల అలంకరణకు కూడా ఇంతకుముందు రోజుల్లో మాదిరిగా కాకుండా ప్లాస్టిక్ పూలు పెట్టకుండా, మల్లెపూలు, చామంతులు, గులాబీలు, సన్నజాజులను ఎక్కువగా వాడుతున్నారు. పూలతో మండపాలు, స్టేజీలు అలంకరించడంవలన అందరినీ ఆకర్షిస్తున్నాయ. అలరిస్తున్నాయ. పూలకు మత భేదం లేదు. కులం కంపు లేదు. గడ్డిపూవు సైతం ఎన్నో అందాలను విరజిమ్ముతోంది. సన్మానాలు సత్కారాలు చేసేటటువంటి సందర్భాల్లో కూడా శాలువాలు కప్పి పూలమాలలు వేసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతుంటారు. గృహప్రవేశాల సమయంలో కూడా ఇంటిని బట్టి పూలదండలతో చాలా అద్భుతంగా అలంకరిస్తారు.
పూవులను అసలు స్ర్తిలతో పోలుస్తారు. సుతిమెత్తనివి, పరిమళభరితమైనవి, అతి సుకుమారమైనవి పూలు. స్ర్తిలు కూడా సుకుమారులు. ఏ సమస్య వచ్చినా దాన్ని తన సమస్యగా మార్చుకుంటారు. పూవు తన చుట్టు ఉన్న ముళ్లను దాటుకొని ఎలా పూస్తుందో అదేవిధంగా స్ర్తి సమస్యలను ఎదుర్కొని పరిష్కార మార్గాలు తెలుసుకొని తనదైన పంధాలో నిలబెడుతుంది. అందుకే స్ర్తీని పూలతో పోల్చడం సమంజసం అంటారు.
పూలెన్ని ఉన్నా ఏ పువ్వుకు ఆ పువ్వు ప్రత్యేకత ఉంటుంది. అట్లానే మనుష్యులందరూ ఒకే జాతిగా మెలుగుతూనే మంచితనం లో ఒకరిని మించి మరొకరు ఉంటే సమాజం పురోభివృద్ధి చెందుతుంది.
మనుష్యుల్లో మంచితనాన్ని పెంచితే మానవలోకమే స్వర్గాన్ని తలపిస్తుంది.

-శ్రీనివాస్ పర్వతాల