సబ్ ఫీచర్

గీతాంజలి సీక్వెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలి ప్రధాన పాత్రలో, ద్విపాత్రాభినయం చేసి కొన్నాళ్ల క్రితం విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం గీతాంజలి. అప్పట్లో హర్రర్ కామెడీ చిత్రాలు అంతగా నడవనప్పటికీ ప్రేక్షకులను బాగా మెప్పించి థియేటర్లకు రప్పించిన చిత్రం గీతాంజలి. కోన వెంకట్, ఎంవివి సంయుక్తంగా నిర్మించిన ఆ సినిమాకి రాజ్‌కిరణ్ దర్శకత్వం వహించారు. కాగా శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించారు. ఇకపోతే ఇన్నాళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశారు నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్. తాను, మరియు ఎంవివి వారే మళ్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక కథ, కథనాలు కూడా మొదటి భాగం కంటే ఇంకా ఆసక్తికరంగా ఉంటాయనేది ఫిలింనగర్ టాక్. ఈ చిత్రంలో కూడా అంజలినీనే హీరోయిన్‌గా ఎంచుకుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఆమె రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోజిచ్చిన స్టిల్‌ని సోషల్ మీడియాలో విడుదల చేశారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడిగా మాత్రం ఎన్నారై వేదుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఎంచుకున్నారు. వాస్తవానికి అప్పటివలే ప్రస్తుతం ఈ హర్రర్ కామెడీలకు కాలం చాలావరకు చెల్లిపోయిందనే చెప్పుకోవాలి. అదీకాక గీతాంజలి తర్వాత కొన్ని ఆ తరహా హర్రర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా కథ, కథనాలు మూస పద్ధతిలో ఉండటంవల్ల అవి పెద్ద సక్సెస్ కాలేదు. మరి ఇటువంటి సమయంలో కోన మళ్లీ అదేవిధమైన సాహసానికి రెడీ కావడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే ఆయనకు స్క్రిప్ట్‌మీద మంచి నమ్మకం వుండటంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు అంటున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని, షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలవుతుందని కోన వెంకట్ చెప్పారు.