సబ్ ఫీచర్

చర్మం - సౌందర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయస్సు పెరిగేకొద్దీ, వాతావరణ కాలుష్యం వల్ల.. ఇంకా ఎన్నో రకాల కారణాల వల్ల అప్పుడప్పుడూ ముఖంలో కళ తగ్గుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే అప్పడప్పుడూ ఇంట్లో తయారుచేసుకునే ఫేస్ ప్యాక్‌లను వాడాలి. అప్పుడే చర్మం బిగుతుగా మారి అందంగా కాంతులీనుతూ ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో రెండు చెంచాల తేనె, ఒకటిన్నర చెంచా నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లని నీటితో కడిగేస్తే ముఖం మెరుస్తూ కాంతులీనుతూ ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో మూడు చెంచాల కీరదోసరసం కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దనా చేయాలి. ఇది పూర్తిగా ఆరాక ముఖం కడగాలి. ఈ మిశ్రమాన్ని రాసుకున్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు. లేకపోతే చర్మం ముడుతలు పడిపోవచ్చు.
* రెండు విటమిన్ మాత్రలను కట్‌చేసి అందులోని నూనెను ఒక కప్పులో వేయాలి. అందులో రెండు చెంచాల పెరుగు, నిమ్మరసం కలిపి ముఖం, మెడకు రాయాలి. పది నిముషాల తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
* గుడ్డులోని తెల్లసొనలో కొద్దిగా బియ్యం పిండిని వేసి బాగా గిలకొట్టాలి. శుభ్ర ం చేసిన ముఖానికి ఈ మిశ్రమాన్ని పట్టించి ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖం కాంతులీనుతుంది.
* ఆలివ్ నూనె, జొజోబా నూనెను ముఖానికి పూసి బాగా మర్దనా చేసి కాసేపు వదిలేయాలి. తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల చర్మం బిగుతుగా, అందంగా, మెరుస్తూ ఉంటుంది.