సబ్ ఫీచర్

యథేచ్ఛగా మానవ అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత అయిదేళ్ల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పెచ్చుమీరుతున్న ‘మానవ అక్రమ రవాణా’ సమస్యపై ఐక్యరాజ్యసమితి తీవ్రంగా స్పందించడం సహేతుకంగా వుంది. వివిధ దేశాలకు సంబంధించిన తాజా గణాంకాల ప్రకారం విశ్వవ్యాప్తంగా ఏటా అపహరణకు గురవుతున్న సుమారుగా పనె్నండు లక్షల మందిలో 40 శాతం చిన్న పిల్లలే కావడం విషాదకరం. బాలలను అక్రమంగా వివిధ దేశాలకు తరలించి వెట్టిచాకిరీ, యాచక వృత్తి, దొంగతనాలు, కట్టు బానిసత్వం, స్మగ్లింగ్ తదితర దారుణమైన పనులలో వినియోగిస్తున్నారు. ఇక బాలికలు, యుక్త వయస్కులైన అమ్మాయిల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. వివిధ దేశాలలో వ్యభిచారం, వెట్టిచాకిరీకి వీరిని ఉపయోగించుకుంటున్నారన్న గణాంకాలు హృదయాలను ద్రవింపజేస్తాయి. మానవ అక్రమ రవాణా అంశానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే భారత్ 12వ స్థానంలో వుండడం ఆందోళనకర పరిణామం. రోజుకు సుమారు 180 మంది బాలికలు అదృశ్యవౌతున్న మన దేశం- వ్యభిచార వృత్తిలో మొదటి స్థానంలో వుండడం దిగజారిపోతున్న నైతిక విలువలు, మహిళల పట్ల అమర్యాద, క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితులను తేటతెల్లం చేస్తున్నాయి. భారీ ఎత్తున బాలలు, మహిళల అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ నిఘా వ్యవస్థ అలసత్వం ప్రదర్శించడం దారుణం.
అక్రమ రవాణాకు సంబంధించిన కేసులలో 60 శాతం వరకూ ‘జాడ తెలియనివి’గా మూసివేయడం, అక్రమార్కులకు ఎలాంటి శిక్షలు పడకపోవడం, ఏటా పెరుగుతున్న ఇలాంటి కేసుల మూ లాలను నిఘావర్గాలు పరిశోధించక పోవడంతో నేరస్థులకు మ రింత ఊతం ఇస్తోంది.
మన దేశంలో పశ్చి మ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తోపాటు తె లుగు రాష్ట్రాలలో కూ డా మానవ వ్యా పా రం అధిక స్థాయి లో నడుస్తోంది. హైదరాబాద్ నుండి ‘షేక్’ లు దొంగ పెళ్ళిళ్ళు చేసుకోగా అరబ్బు దే శాలకు అక్రమంగా నకిలీ ధ్రువపత్రాలతో తరలింపబడుతున్న బాలికల సంఖ్య ఏటా పెరుగుతుండడం పట్ల ప్రభుత్వాలు దృష్టిసారించాలి. అదే విధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామనో, సినిమాలలో అవకాశాలు ఇస్తామనో అందమైన అబద్ధాలతో లోబరచుకొని బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, మయన్మార్ వంటి దేశా ల నుండి లక్షల సం ఖ్యలో ఆడపిల్లలు మన దేశంలోనికి అక్రమంగా తరలింపబడుతున్నా రు. కొన్ని దేశా లు బాధితులైన తమ పౌ రులకు పునరావాస చ ర్యలు చేపడుతున్నా, మానభిమానాలను చం పుకొని దుర్భరమైన పడుపువృత్తిలో చిక్కుకొని దిక్కుతోచక విలవిల్లాడుతున్న లక్షలాది ఆడపిల్లల ఆక్రందనలు ప్రభుత్వాలకు వినిపించక పోవడం బాధాకరం. నకిలీ ధ్రువపత్రాల ద్వారా అక్రమంగా లక్షలాది దేశం వెలుపలకు, దేశంలోనికి ఎలా ప్రవేశించగలుగుతున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు, పోలీసులు, స్థానిక సంస్థలు, విదేశీ వ్యవసారాలశాఖ ఏం చేస్తోందని ఇటీవల సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు వౌనమే సమాధానం అయ్యింది. అసలు లక్షల సంఖ్యలో బాలబాలికలు అదృశ్యవౌతున్నా, ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయో? ఎంతమంది తిరిగి తమ కుటుంబీకులకు అప్పగించబడ్డారో? మిగతా కేసులలో ఎందుకు పురోభివృద్ధి కనబరచలేక పోతున్నారో? వంటి ప్రశ్నలకు జవాబులు లేవు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరికి ప్రమేయం వుందో, నకిలీ ధ్రువపత్రాలు జారీచేయడంలో ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయో అన్న దానిపై సిబిఐ చేత నిష్పాక్షికంగా దర్యాప్తు చేయిస్తే మొత్తం డొంక అంతా కదులుతుంది. దుర్భలమైన చట్టాలు, నిఘా వైఫల్యం, సామాజిక అలసత్వం, పటిష్టమైన విచారణా విధానం లోపించడం మానవుల అక్రమరవాణాకు పాల్పడుతున్నవారి పట్ల వరమై కూర్చుంది. ఈ అక్రమరవాణా తీవ్రతను గుర్తించి, పార్లమెంటు స్థారుూ సంఘం 2015వ సంవత్సరంలో ఇచ్చిన సిఫార్సుల మేరకు రూపొందించిన ప్రత్యేక చట్టం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే వుంది. పటిష్టమైన చట్టాన్ని రూపొందించడంతోపాటు, దానిని చిత్తశుద్ధితో అమలుచేయడంలోనూ ప్రభుత్వం కృషిచేయాలి, రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్న ఈ సమస్యను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, పౌర సమాజం, ప్రసార మాధ్యమాలు కలిసికట్టుగా పోరాడాలి.

-సి.ప్రతాప్ 91368 27102