సబ్ ఫీచర్

అశాస్ర్తీయ సర్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థాంసన్ రాయిటర్స్ ఫౌండేషన్ సంస్థ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలో మగవారు మహిళల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఒక సర్వేను విడుదల చేయడం, వెనువెంటనే రాహుల్‌గాంధీతో సహా పలువురు విపక్ష నాయకులు మహిళల రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని ప్రధానిపై విమర్శల వర్షం కురిపించడం చూస్తుంటే, రాజకీయ లబ్ధి విషయంలో దేశం పరువు ప్రతిష్ఠలను సైతం దిగజార్చడానికి వెనుకాడబోరని అర్థమవుతోంది.
మహిళలపై హింసలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలను మించిపోయిందనీ, ప్రతీ పది నిముషాలకు ఒక హింసాత్మక ఘటన లేదా దాడి జరుగుతోందన్న సదరు సర్వే వాస్తవాలను మరుగుపరచి భారతదేశం పరువును దిగజార్చేందుకు చేసిన ఒక వృథా ప్రయత్నం అని చెప్పక తప్పదు.
అసలు ఈ సర్వే ఇతర సర్వేల వలె శాస్ర్తీయ ప్రాతిపదికపై డేటాను సేకరించి, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా క్రోడీకరించి జరిపిన విశే్లషణ కాదు. సర్వే కోసం వివిధ దేశాల్లోని ఐదు వందలా యాభై మంది నిపుణుల అభిప్రాయాన్ని అడిగింది. ఏ ప్రాతిపదికపై, ఎన్ని దేశాల నుండి ఈ నిపుణులను ఎంపిక చేశారన్న విషయాన్ని ఆ సంస్థ ఇంతవరకు ప్రకటించలేదు. పైగా ఆ కంపెనీ అంతర్గత వ్యవహారమనీ, అత్యంత గోప్యనీయమని సాకులు చెప్పి తప్పించుకుంది.
సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఎంతటి దారుణమైన పరిస్థితులున్నాయో, పసిపిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా ఎలాంటి అత్యాచారాలు జరుగుతాయో రోజూ వార్తా పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. ఆ దేశాల సరసన, మహిళలను దేవతలుగా, శక్తి స్వరూపిణులుగా ఆరాధిస్తూ, గౌరవిస్తూ, అత్యున్నత సంస్కృతి, సంప్రదాయాలకు పట్టుగొమ్మ అయిన ఈ పుణ్య భారతావనిని నిలబెట్టడమంటే వంద కోట్ల భారతీయులను అవమానించేందుకు కొన్ని శత్రు దేశాలు చేసిన కుట్ర కాకపోతే మరేమిటి?
సదరు సర్వేలో పనె్నండో స్థానంలో ఉన్న అమెరికాలో ఏటా లక్షకుపైగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు స్వయంగా ఆ దేశం అధ్యక్షుడే ఇటీవల అంగీకరించాడు. జనాభా ప్రాతిపదికపై 2014 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన అధ్యయనంలో అమెరికాలో లక్షకు యాభై మంది మహిళలు అత్యాచారానికి గురవుతుండగా, బ్రిటన్‌లో ఆ సంఖ్య ముప్ఫై ఐదుగా ఉంది. కుటుంబ విలువలు, పరస్పర ప్రేమానుబంధాలు, నైతిక విలువలు, ఆధ్యాత్మిక శక్తి పరిఢవిల్లుతున్న భారతదేశంలో ఈ సంఖ్య 6.5గా ఉంటే.. సిరియా, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియాల్లో అయితే వందకు పైమాటే.. శాస్ర్తీయ ప్రాతిపదికపై జరిపిన ఆ సర్వేలను గమనిస్తే ప్రపంచ దేశాల కంటే మహిళలపై అత్యాచారాల విషయంలో భారతదేశం పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది.
దేశాలకు ర్యాంకులు ఇవ్వడంలో శాస్ర్తీయ విధానం పాటించకుండా ఇష్టానుసారంగా ఒక సర్వే నివేదికను చేయడం, అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన థాంసన్ రాయిటర్స్ సంస్థకు ఎంత మాత్రమూ తగదు. కేవలం ఒక ప్రత్యేక అజెండాతో అంతర్జాతీయంగా అప్రతిష్ట పాలు చేసేందుకు ఒక కూటమి చేస్తున్న ప్రయత్నాలను సమైక్యంగా తిప్పి కొట్టకుండా ఓక్స్ అశాస్ర్తీయ సర్వే ఫలితాలను పట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం విపక్షాలకు అసలే తగదు. ఇది మన గోతిని మనమే తవ్వుకున్నట్లుగా ఉంది.

-- ఎం.కనకదుర్గ