సబ్ ఫీచర్

బంధన్ తోడ్ యాప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్యవివాహాలకు ఎప్పుడో అడ్డుకట్ట వేసి, ఇవి జరగకుండా ఉండటానికి ప్రత్యేక చట్టాలను రూపొందించినా నేటికీ ఎక్కడో ఒకచోట బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటివాటికి చరమగీతం పాడటానికే ‘బంధన్ తోడ్’ యాప్ రూపొందించబడింది. బాల్యవివాహాలను అరికట్టే దిశగా యునైటెడ్ నేషన్స్ పాప్యులేషన్ ఫండ్, 270 పౌరసేవా సంస్థలు కలిసికట్టుగా బీహార్‌లో ఈ యాప్‌ను రూపొందించాయి. సామాజికపరంగా ఉన్న లోపాలను ఈ యాప్ సరిచేయనుంది. దేశంలోనే తొలిసారిగా బీహార్ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రారంభించిన ఈ యాప్ పేరే బంధన్ తోడ్. తల్లిదండ్రులు తమ పిల్లలకు యుక్తవయసు వచ్చేలోపు వివాహాన్ని తలపెట్టిన సందర్భాల్లో, అలాగే తోటి బాలికలు బాల్యవివాహాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ సమాచారాన్ని ఈ యాప్ ద్వారా పంపించవచ్చు. ఈ యాప్ ద్వారా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని కూడా పెంపొందించవచ్చు. బంధన్ తోడ్ యాప్‌ను వినియోగించుకోవాలనుకునేవారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని.. అందులో తమ పేరు, వయసు, నివసించే జిల్లాతో సహా చిరునామా, ఫోన్ నెంబర్‌ను పొందుపరచాలి. సమాచారం అందజేయాలనుకున్నవారైనా, సహాయం పొందాలనుకున్నవారైనా విపత్కర సమయంలో ఎస్‌ఓఎస్ అనే ఒక్క బటన్ నొక్కితే చాలు. వెంటనే సమాచారం జెండర్ అలయన్స్ మోనిటరింగ్ సెల్‌కు, పౌరసేవాసంస్థలకు వెళ్లిపోతుంది. అలాగే సహాయం కోరిన వారి సమాచారం వెంటనే స్థానిక అధికారులందరికీ చేరుతుంది. ఈ వివరాలను తెలుసుకున్న అధికారులు సహాయం అవసరమైనవారి దగ్గరకు చేరి సహాయాన్ని అందించడమే కాకుండా, బాల్యవివాహాన్ని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటారు. అంతేకాదు.. మొబిక్విక్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే నగదులో కొంత శాతం వినియోగదారురాలికి అందే సౌకర్యం కూడా ఉండటమే ఈ యాప్ ప్రత్యేకం. ఈ యాప్ చాలారోజుల క్రితమే అందుబాటులోకి వచ్చినా చాలామందికి ఈ యాప్ గురించిన అవగాహన లేదు. చుట్టుపక్కల ఎక్కడైనా బాల్యవివాహాల్లాంటి దురాచారాలు జరిగితే వెంటనే ఈ బంధన్ తోడ్ యాప్ ద్వారా సమాచారం అందిస్తే కొన్ని జీవితాలను నిలబెట్టినవారవుతారు. అలాగే ఇలాంటి దురాచారం మన సమాజంలో ప్రబలకుండా తుడిచిపెట్టుకుపోతుంది.
*