సబ్ ఫీచర్

జాతిని జాగృతం చేసిన మహనీయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాలకు విద్యారణ్య భాష్యాన్ని ప్రసాదించి, దేశభక్తిని ప్రజ్వరింపజేసి, అనైక్యతను పారద్రోలి, నిర్వీర్యులైన దేశ నాయకులందరినీ కలిపి ఒక రాజకీయ శక్తిగా నడిపించిన రాజనీతి దురంధరుడు, పరిపూర్ణ వేదవిజ్ఞాన సిద్ధుడు, మాధవ మంత్రి అయిన శ్రీ విద్యారణ్యస్వామి. శ్రీ విద్యారణ్యస్వామి తన గురుదేవుని ఆశీస్సుల ప్రకారం, హరిహర బుక్కరాయ సోదరులకు తోడ్పడి హిందూ సామ్రాజ్యస్థాపన చేయకపోయినట్లయితే 300 సంవత్సరాల తర్వాత అనగా తల్లికోట యుద్ధానంతరం తెలుగుదేశం అంతా ఇటు కృష్ణానది నుండి అటు తుంగభద్రానది వరకు అంతా అల్లకల్లోలమై అరాచకమై ఉం డేది. ఈ ప్రాంతంమంతా ఈ రోజు ఇంత సుఖంగా ఉన్నదంటే దానికి కారణం శ్రీవిద్యారణ్యస్వామి. విజయనగర సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించడం వల్లనే, సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు వంటి వారు సమర్థవంతంగా పరిపాలించారు. ‘‘దేశభాషలందు తెలుగు లెస్స’’ అని అనిపించుకున్నాం. ఈ ఘనత అంతా శ్రీ విద్యారణ్యస్వామివారిదే. అందుకే ఆయన అనవరత స్మరణీయుడు. ఒక మంత్రిగా, పరిపాలకుడిగా, సద్గురువుగా, ధర్మబోధకుడిగా, వేదపండితుడిగా, అద్వైత విజ్ఞాన సిద్ధుడుగా, దేశానికి అన్నీ తానే అయి నడిపించి, ధర్మాన్ని నిలబెట్టి సర్వులకు, తోడై నిలిచి, మహోజ్వలంగా పరిపాలన చేయించిన హిందూ సామ్రాజ్య స్థాపకుడు-శ్రీ విద్యారణ్యులు.
భారతీయత అంటే ఒక మతం మాత్రమే కాదని, సంగీత, యోగ, జ్యోతిషశాస్త్రాలు, వేదాంతం, కావ్యం, శిల్పం, ఉపనిషత్సారం, వేదార్థం, శ్రీవిద్యారహస్యమైన మంత్ర శాస్త్రం వంటి వాటిని ప్రస్ఫుటీకరిస్తూ, అందరిలో ఉన్నది ఒకే చైతన్యం అని బోధిస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానం కల్యాణాన్ని వీక్షించాలని చెప్పేదని వివరించారు. తాను చెప్పిన దానిని తన జీవితంలో ఆచరించి, చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథాలను మనకందించిన కారణ జన్ముడు శ్రీవిద్యారణ్యస్వామి. అన్నింటికంటె ముఖ్యమైనది-శ్రీ విద్యారణ్య భాష్యం. వేదాలకు అర్థాన్ని తెలియజేసే భాష్యం అది. అది వేదవిద్యలో ఒక ఉన్నత విద్య. అడుగడుగునా విజయనగర రాజులకు అన్ని విషయాలలో ఆచార్యునిగా ఉంటూ, వ్యూహరచయితగా, యుద్ధనీతిని ఉపదేశించే శ్రీకృష్ణపరమాత్మగా, ధర్మాన్ని సామాన్య ప్రజలచే కూడా అనుసరింపచేస్తూ, ఆది శంకరునిచే స్థాపించబడిన శ్రీ శృంగేరీ పీఠాన్ని అధిరోహించి, ముప్పది రెండేళ్లకు పైగా ధర్మపరిపాలన చేసి, అన్నింటికీ అన్నీ చేస్తూ, అందులో తాను ఏదీ కాకుండా దేనికీ అంటక యోగమూర్తియై, పరమహంస పరివ్రాజకాచార్యుడై, పూర్ణాయిష్కుడై నూట ఇరవయి సంవత్సరాలు జీవించి, సమాజసేవలో ఆధ్మాత్మికతను ఆస్వాదించిన పరిపూర్ణ స్వరూపం-శ్రీ విద్యారణ్యస్వామి.
నేటి కర్నూలు జిల్లాలో బడగనాడు అగ్రహారంలో మాయణాచార్యుడు, శ్రీదేవి దంపతులకు దుర్ముఖనామ సంవత్సర వైశాఖ శుద్ధ సప్తమి, పుష్యమీ నక్షత్రంలో బుధవారం ధనుర్లగ్నంలో (1296, ఏప్రిల్ 11 రాత్రి 10.56) జన్మించిన కారణ జన్ముడు-మాధవార్యుడు. ఆయన ఆశ్రమనామమే శ్రీవిద్యారణ్యస్వామి. తండ్రివద్ద గురువుల వద్ద వేద విద్యను అభ్యసించారు. తర్క, వ్యాకరణ, మీమాంసా శాస్త్రాలలో నిష్ణాతుడై, యోగాభ్యాసం చేసి శ్రీమాత అనుగ్రహాన్ని పొందాడు. మితాహారం, గాలి భక్షణ, ఇలా మూడు సంవత్సరాల అకుంఠిత దీక్షతో తపస్సు చేశాడు. కుండలినీ శక్తిమంతుడైనాడు. భ్రూముకిటిలో వెలుగు ద్యోదకమైంది. ‘తల్లీఅఖండ రాజ్య సంపదను ప్రసాదించు. ధర్మాన్ని నిలబెట్టి రక్షించే అపరిమిత సిరిసంపదలను, ధన ధాన్యాదులు కరుణించి, వర్షించు, దిక్కులేని దీన జనుల ఆక్రలందనలను బాపి రక్షించగలదానవు తల్లీ’’ అని సంకల్పాన్ని వెలిబుచ్చాడు. ‘‘ఈ జన్మలో కాదు, వచ్చే జన్మరో నెరవేరగలదు’’ అని వినిపించింది. వెంటనే మాధవార్యుడు, సన్యాసాశ్రమం తీసికొంటున్నాను, ఇది నాకు మరోజన్మ, కనుక నాకు ధర్మాన్ని రక్షించి, విదేశీయుల బారినుండి దీనజులను ఆదుకొని హిందూ సామ్రాజ్య స్థాపనకు శక్తినిచ్చి అనుగ్రహించమని, సమాధి నిష్ఠలో అర్థించాడు. సన్యాసికి సామ్రాజ్యపాలనాధికారం ఉండదు కనుక, హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులచే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన త్యాధనుడు, భావితరం వారికి వెలుగు చూపిన మహనీయుడు విద్యారణ్యస్వామి.
దేశాటనలో భాగంగా, ఒకరోజు విరాటపురం దాటి సమీపంలో ఉన్న అశ్వత్థవృక్షం నీడలో కూర్కొని వేదపారాయణం చేస్తున్నాడు విద్యారణ్యులు. వేదవేదాంగ పారంగతుడైన పండితుడొకడు చెట్టుపైనుండి దిగివచ్చి, విద్యారణ్యులకు నమస్కరించి తన పరిస్థితిని వివరించాడు. తనపేరు ‘‘సింగరి భట్టు’’ అని యజ్ఞయాగాదులు చేసిన వాడినని అయినా దుస్థితిలో ఉన్నానని చెప్పి, విద్యారణ్యస్వామి ద్వారా తనకు పట్టిన దుస్థితి తొలగుతుందన్న విషయం తెలుసునని చెప్పాడు. ప్రతిరోజూ వ్యాసుడు ఛండాలుని రూపంలో, నాలుగు కుక్కలను వెంటబెట్టుకుని మణికర్ణికాఘాట్‌లో స్నానానికి వస్తాడని, ఆయన్ని పట్టు వదలకుండా పాదములపై పడి వారి ఆశీస్సులు పొంది తిరిగి వెడుతూ తనకు గలిగిన దుస్థితి నుంచి విముక్తుని గావించమని సింగినిభట్టు, విద్యారణ్యుడిని ప్రార్థించాడు.
కాశీ చేరిన విద్యారణ్యుడు, విశే్వశ్వర దర్శనం, అన్నపూర్ణ విశాలాక్షి, దుండి వినాయకుణ్ణి, కాలభైరవుణ్ణి దర్శించి మణికర్ణికా ఘట్టంలో స్నానం చేయడానికి వెళ్లాడు. అక్కడ వ్యాసుడు ఛండాలుడి రూపంలో నాలుగు కుక్కలతో వచ్చాడు. ‘‘నీవు సింగరిభట్టు తెలుపగా, మా నిజస్వరూపం కనుగొని ఇలా వచ్చావు’’ అన్నాడు. విద్యారణ్యుడు గడగడ వణకుతూ ‘అవును’ అన్నాడు. వ్యాసుడు విద్యారణ్యులవారిని ఆశీర్వదించి, ‘‘అన్నదానంతో సింగరిభట్టు దుస్థితి తొలగిపోతుందని’’ సెలవిస్తూ రానున్న కాలంలో కర్నాటక దేశంలో రాజ్యస్థాపన చేయగలవని, అది 300 సంవత్సరాలు లక్ష్మీకళను, సంపదను కలిగివుంటుందని, సంగీత సాహిత్య శిల్పకళలు పరాకాష్ఠత చెంది శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పి, ఆశీర్వదించి కొన్ని మంత్ర రహస్యాలను విద్యారణ్యులకు అనుగ్రహించి వేదవ్యాసులు అదృశ్యమైనారు. పరమానంద భరితుడైన విద్యారణ్యులు, ప్రయాగ, త్రివేణీ సంగమాల్లో పుణ్యస్నానాలు ఆచరించి, సింగరిభట్టు చేత అన్నదానం చేయించి, అతని దుస్థితి పోగొట్టి అయోధ్య మీదుగా దేశ సంచారం చేసి తుంగభద్రానదీ ప్రాంతానికి చేరుకున్నారు. శ్రీమాత అనుగ్రహంతో ‘విజయనగరం’ రూపొందించారు.
జీవన్ముక్తి, వివేకము, పురుషార్థసుధానిధి, అనుభూతి ప్రకాశం, సంగీతసారం, శంకర దిగ్విజయం, కాలనిర్ణయం, నృసంహోత్తర తాపనీయ ఉపనిషత్తు మొదలైనవి. చాలా ముఖ్యమైనది, విశేష ప్రాచుర్యం పొందినది, సంపూర్ణ ఆధ్యాత్మిక గ్రంథం-‘వేదాంత పంచదశి’. ఇది మూడు భగాలు. వివేక పంచం, దీప పంచకం, బ్రహ్మానందపంచకం. ఒక్కొక్కదానిలో అయిదు వినాగాలు, వెరసి పదిహేను భాగాలు పంచదశి. కాలం విలువను, జీవిత విలువను గుర్తించి, అంతర్లీనంగా ఉన్న దైవీ తత్వాన్ని దేదీప్యమానంగా వెలిగించుకోవడానకి అవసరమైన విజ్ఞతను తన గ్రంథాల ద్వారా అందించి, జాతిని జాగృతం చేసిన అనవరత స్మరణీయుడు శ్రీవిద్యారణ్యుడు.

-పసుమర్తి కామేశ్వరశర్మ ఫోన్: 0866-2538088