సబ్ ఫీచర్

సమ్మోహిత సంగీతంలో జీవిత విషాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ పాప్ సంగీత గాయక కిరీటి, ప్రపంచంలో పాప్ పాశ్చాత్య మ్యూజిక్ రారాజుగా, ఖండాతరాలను సమ్మోహితపరచిన మైఖేల్ జాక్సన్, భువి నుంచి నిష్క్రమించి, జూన్ 25కి 10వ సంవత్సరం ప్రవేశించింది. 50వ ఏట లాస్ ఏంజల్స్‌లో డ్రగ్స వ్యసనపరుడైన మైఖేల్, ఊపిరి ఆగిన హృద్రోగ మరణం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష సంగీత కళాభిమానులకు తీరని విషాద దుర్ఘటన అయింది. జాక్షన్ ఆకస్మిక మరణంపై దశాబ్దిలో ఎన్నో కుట్రపూరిత అనుమాన ఆరోపణలు, న్యాయ సంబంధిత వివాదాలు చెలరేగాయి. ఏది ఏమైనా ‘‘ప్రొపొఫోల్’’ అనే నిద్రమత్తు డ్రగ్‌ను ‘మిల్క్’ అని పిలుచుకొనే, ఆ విశ్వవిఖ్యాత గాయక కళాకారుని జీవితం, అర్థాంతంగా ముగిసింది.
పాశ్చాత్య సంగీత రసఘరిలో జాజ్, రాక్ వంటి ప్రక్రియల ప్రభావంతంగా, పాప్‌ను ‘మెటల్’ స్థాయి సమ్మోహితోన్నత స్థాయికి చేర్చిన మైఖేల్ నేటికీ ప్రపంచ సంగీత సామ్రాజ్యాధి నేతగా కొలువుతీరి అలరిస్తున్నాడు. ‘స్వింగ్ కింగ్’గా అర్ధ శతాబ్ది పైగా సంగీత ప్రపంచాన్ని అలరించిన ఎల్విస్ ప్రిస్లే 1977లో మరణించాడు. బిల్ బోర్ డ టాప్ 40, టాప్ 100పై చార్ట్ టాపింగ్ సాంగ్స్ రికార్డింగ్‌లో అత్యున్నత ప్రమాణాలు సాధించిన ప్రిస్లే కంటే జాక్సన్, మరణానంతరం కూడా, ఫోర్ట్స్ టాప్ సంపన్న మ్యుజియేషన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వేదికపై జాక్న్ ఒక సమ్మోహిత విస్మయం.
2009 జూన్ 25న ఆఖరి శ్వాస విడిచే సందర్భంలో, జాక్సన్ ‘దిస్ ఈజ్ ఇట్’ లండన్ ప్రదర్శనకు, కొన్ని వారాల తరువాత వెళ్ళవలసి వుంది. రిహార్సల్స్ షెడ్యూల్‌లో నిమగ్నమైవున్న ఆ రోజులలో జాక్సన్‌ను మృత్యువు కబళించింది. తదనంతరం ఆ టూర్ పేరిట విడుదల అయిన ఫిలిం, ప్రపంచాన్ని ఆకట్టుకొంది. ‘బీట్ ఇట్’, ‘వన్నా బి స్టార్టింగ్ సమ్‌థింగ్’ వంటి ట్రాక్స్, సోనా మ్యూజిక్, వెనువెంటనే 2010 నాటికే రిలీజ్ చేసి చరిత్ర సృష్టించింది. 2009-2014 మధ్య ‘ఎక్స్‌స్కేప్’ ఆల్బమ్ విడుదల అయిన తరువాత, మైఖేల్ ఎస్టేట్, 140 మిలియన్ డాలర్ల తారా పధానికి దూసుకుపోయింది. 2009 పాప్ సంగీత అభిమానులలో విషాదం గూడుకట్టుకొన్న సంవత్సరం. ప్రస్తుత ప్రపంచ ప్రసిద్ధ టాప్ పాప్‌సింగర్, జస్టిన్ బైబర్ కూడా జాక్సన్ ముందు తలవంచవలసినదే. పాప్ మ్యూజిక్‌లో ‘సోల్’ను డాన్మింగ్‌తో అనుసంధానం చేయగల అద్భుత గాయకుడు మైఖేల్ జాక్సన్ ప్రపంచంలోనే కాదు బాలీవుడ్, టాలీవుడ్ ఇతర భారతీయ యువ హీరోలకు డాన్స్ స్టెప్పింగ్స్, నడక ఆట పాటలు నేర్పిన అద్భుత కళా స్రష్టగా ఆదర్శనీయుడు. ‘డర్టీడయానా’, ‘బేడ్’, ‘బీట్ ఇట్’, ‘బిల్లీ జీన్’ వంటి హిట్స్ ఎన్నో నేటికీ జాక్సన్‌కు మరణం లేదని ధృవీకరిస్తున్నాయి.
పాశ్చాత్య సంగీత ప్రపంచంలో డ్రగ్స్ వినియోగం సర్వసాధారణం. మైఖేల్ జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు డా. కొన్రాడ్‌ముర్రేకు నెలకు 150,000 డాలర్లు ఇచ్చేటట్టు 2009 నెలలో జాక్సన్‌కు ఒప్పందం కుదిరింది. హౌస్టన్‌లో కార్డియోలొజిస్ట్ అయిన డా. ముర్రే, జాక్సన్ మరణానికి బాధ్యునిగా ఆరువారాలు లాస్ ఏంజెల్స్ కోర్టు న్యాయ విచారణ నిర్వహించి, నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. 50 మంది సాక్షులను విచారించిన 12 మంది జ్యూరీ ఎదుట డా. ముర్రే, జాక్సన్‌కు25 ఎం.జి. ప్రొపొఫోల్ డ్రగ్‌డోస్ ఇచ్చినట్టు అంగీకరించాడు. విపరీత నిర్లక్ష్య జాప్యం, అజాగ్రత్త కారణంగా మైఖేల్ హృద్రోగ మరణం సంభవించిందని ప్రొసిక్యూషన్ ఆరోపించింది. జాక్సన్ మృతదేశంలో ప్రొపొఫోల్, లొరాజిపమ్, డయాజిసమ్, మిడాజొలమ్, లిడో కైన్, ఎఫిడ్రైన్ వంటి డ్రగ్స్ వున్నట్టు వైద్య పరీక్షలు నిర్ధారించాయి.
పాప్‌స్టార్ మైఖేల్ జోసఫ్ జాక్న్‌ను ‘ఎం.జి.’గా కోట్లాది అభిమానులు గుర్తు చేసుకొంటారు. పాశ్చాత్య జీవన ఆకర్షణలవైపు పరుగులు తీస్తున్న ప్రస్తుత సాంకేతిక ప్రపంచ యువతరానికి జాక్సన్ అందించిన మేజిక్ థ్రిల్లింగ్, ఊహించలేని పారవశ్య అనుభూతి అంచులలో విహరింపజేస్తుంది. బీటెల్స్ ఒకప్పుడు ఇస్కాన్ సమ్మోహితులై, మార్గం మళ్లిన భారతీయ ఆధ్యాత్మిక అనుభవ ఔన్నత్య దృష్టాంతం వుండనే ఉంది. ఏది ఏమైనా అర్ధాయుస్సుతో యాభై ఏళ్ళు జీవించి ప్రపంచ సంగీత వేదికపై పాప్ సింగర్‌గా నేటికీ రసిక ప్రియులను ఉర్రూతలూగిస్తున్న జాక్సన్‌ను స్మరించుకవటం ఎంతైనా సముచితం.

-జయసూర్య సెల్- 9440664610