సబ్ ఫీచర్

సమీర సృష్టి.. ‘క్రోకరీ బ్యాంక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణాన్ని పరిరక్షించాలన్న తపనతో అందరి కంటే భిన్నంగా ఆలోచించిన ఆమె ఓ నూతన ఆవిష్కరణకు నాంది పలికింది. పాలిథిన్ కవర్లు, ప్లాస్టిక్ కప్పులు,ప్లేట్లు, వాటర్ బాటిళ్లు, గ్లాసులను మితిమీరి వాడుతున్నందున పర్యావరణం కలుషితమవుతోందని ఆమె చేస్తున్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. భోజనాల సమయంలో ప్లాస్టిక్ వస్తువులకు బదులు స్టీల్ సామాన్లను వాడాలని చెప్పడమే కాదు, వాటిని ఉచితంగా అందజేసేందుకు ఆమె ‘క్రోకరీ బ్యాంక్’ను ప్రారంభించింది. హర్యానాలోని గుర్‌గావ్‌కు చెందిన సమీర సతీజా కేంద్ర ప్రభుత్వ ఆడిట్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తూనే సామాజిక కార్యక్రమాల్లో తన వంతు కృషి చేస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్న సమీర పేరు ఇపుడు గుర్‌గావ్‌లో చాలామందికి తెలుసు.
ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని తగ్గించాలంటూ ఆమె చేస్తున్న ప్రచారం మంచి ఫలితాలను ఇస్తోంది. ఇళ్లలో, ఫంక్షన్ హాల్స్‌లో విందు భోజనాలు ఏర్పాటు చేసేవారికి స్టీల్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర సామాగ్రిని సమీర అందజేస్తోంది. విందు భోజనాల అనంతరం ఆమె తిరిగి వాటిని ‘క్రోకరీ బ్యాంక్’లో ఉంచుతారు. ఎలాంటి అద్దె చెల్లించనవసరం లేకుండా స్టీల్ సామాగ్రిని ఉచితంగా వాడుకునేందుకు ఇస్తుండడంతో స్థానికుల్లో ‘క్రోకరీ బ్యాంక్’పై ఆసక్తి పెరిగింది. గుర్‌గావ్‌లో సిక్కు మతస్థులు వేసవిలో ఉచితంగా గ్లాసుల్లో మంచినీరు అందించడం చూశాక- ‘క్రోకరీ బ్యాంక్’ను ఏర్పాటు చేయాలన్న ఆమె ఆలోచన సమీరలో అంకురించింది. మొదట సొంత డబ్బును పదివేల రూపాయలను వెచ్చించి స్టీల్ గ్లాసులు, ప్లేట్లు, చెంచాలు, కప్పులు కొనుగోలు చేసి ‘క్రోకరీ బ్యాంక్’ను ఆమె ప్రారంభించింది. మంచినీటిని ఉచితంగా అందజేసే కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి పనిచేస్తూ తన ‘క్రోకరీ బ్యాంక్’ గురించి కూడా నలుగురికీ ఆమె వివరించేది. వినూత్నమైన ఆమె ప్రయత్నానికి సన్నిహితులు, స్థానికులు అండగా నిలిచారు. ‘క్రోకరీ బ్యాంక్’ వివరాలను తెలిపేందుకు ‘ఫేస్‌బుక్’లో ఓ పేజీని సమీర నిర్వహిస్తోంది. ఇళ్లలో, ఫంక్షన్ హాల్స్‌లో ఆహార పదార్థాలను వృథా చేయరాదని కూడా ఆమె ప్రచారం చేస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలు, పారేసిన ఆహార పదార్థాల వల్ల పర్యావరణానికి చేటు జరుగుతోందని, ఈ విషయాలపై ముఖ్యంగా గృహిణులు చైతన్యవంతం కావాలని ఆమె విజ్ఞప్తిచేస్తోంది. ‘క్రోకరీ బ్యాంక్’ నుంచి సామాగ్రిని తీసుకువెళ్లేవారు- చిరునామాకు సంబంధించి ఆధారాలు చూపితే చాలు. వెంటనే వారికి అవసరమైన స్టీల్ సామాగ్రిని చేరవేస్తుంటారు. స్టీల్ సామాన్లను తీసుకువెళ్లేవారు తిరిగి వాటిని భద్రంగా అప్పగిస్తేచాలు.. అద్దె డబ్బులు చెల్లించనవసరం లేదు. నగరాల్లో ఇటువంటి ‘క్రోకరీ బ్యాంక్’లను విరివిగా ప్రారంభిస్తే ప్లాస్టిక్ వినియోగం చాలావరకూ తగ్గుతుందని సమీర చెబుతున్నారు.
*