సబ్ ఫీచర్

ఖర్జూరంతో ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరంలో ఉష్ణాన్ని తగ్గించి, చలువను ప్రసాదించే ఖర్జూరం మిక్కిలి ప్రశస్తమయినది. అతి తియ్యగా, రుచికరంగా ఉండే ఈ ఖర్జూరం ఆరోగ్యరీత్యా ఎంతో ఉత్తమయినది.
ఎండు ఖర్జూరపు కాయలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని వేసవిలో పిల్లల చేత త్రాగిస్తే వడదెబ్బ తగలదు.
అతిగా విరేచనములు అవుతుంటే ఖర్జూరం నీరు త్రాగిస్తే శోష రాకుండా, ప్రాణాపాయం కలుగకుండా కాపాడుతుంది. రక్తదోషాలకు విరుగుడుగా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానిపోయేట్లు చేస్తుంది. వాత రోగాలు, పైత్య ప్రకోపం, అధికంగా మద్యం సేవించినపుడు వచ్చే మదపు లక్షణాలకు ఖర్జూరం ఎంతో మేలు చేస్తుంది.
ఫిట్స్, మూర్ఛలు మొదలగు నాడీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఖర్జూరాన్ని తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది. ఖర్జూరాన్ని ప్రతిరోజు తీసుకుంటే ‘సయాటికా’ అనబడే నడుము నొప్పిని నివారిస్తుంది.
జలుబు, దగ్గు, అధికంగా దప్పిక, శరీరం మంటలు పుట్టడం మొదలగు లక్షణాలకు తక్షణ నివారణ చూపిస్తుంది ఖర్జూరం.
శరీరంలో ఉష్ణాన్ని రూపుమాపి, బలవర్థకంగా శుక్ర వర్థకంగా, నాడీ మండలాన్ని ఉత్తేజపరుస్తుంది. అయితే వేడిచేసే తత్వం ఉన్నవారికి ఖర్జూరం సరిపడదు. ఖర్జూరం శీతలత్వాన్ని పెంపొందించి మూత్రాన్ని క్రమబద్ధం చేసి పౌష్టికతను కలుగజేస్తుందని వైద్య గ్రంథాలు తెలుపుతున్నాయి.
ఖర్జూరాన్ని అన్ని వ్యాధులకు పథ్యంగా ఔషధంగా తీసుకొనవచ్చు. ద్రాక్ష, ఇప్పపువ్వు మాదిరిగా ఖర్జూరం మద్యం తయారీకి ఉపయోగపడుతుంది. విదేశీ మద్యంకన్నా, ద్రాక్ష, సారాయికన్నా, ఖర్జూరంతో తయారయ్యే మద్యం శ్రేష్ఠమయినది. తాటి, కొబ్బరి, ఖర్జూరం- ఈ మూడింటి ద్రవాన్ని కలిపి బెల్లం తయారుచేస్తారు. ఇది శక్తివంతమైన టానిక్‌గా పనిచేస్తుంది.
ఖర్జూరం మూడు భాగాలు, గసగసాలు మూడు భాగాలు, బాదంపప్పు రెండు భాగాలు, పటిక బెల్లం ఐదు భాగాలు, ఐదు యాలకులు- వీటన్నింటిని కలిపి పొడిచేసి ప్రతిరోజూ ఉదయం కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే ఎంతటి దుర్బలుడికైనా దృఢత్వాన్ని కలుగజేస్తుంది.
బక్కపలుచగా ఉన్న, కృశించిపోతున్న పిల్లలకు, వారి జీర్ణశక్తిని బట్టి తినిపించినట్లయితే తప్పక దృఢత్వాన్ని సంతరించుకుంటారు. పుష్టిగా, దృఢంగా ఎదుగుతారు. బుద్ధి వికసిస్తుంది. ఉష్ణాన్ని తగ్గిస్తుంది. రక్తలేమికి అమోఘమైనది. వాతాన్ని తగ్గించి జీర్ణశక్తిని వృద్ధిపరుస్తుంది.
ఖర్జూరం వలన హాని కలుగకుండా గసగసాలు విరుగుడుగా పనిచేస్తుంది.
*