సబ్ ఫీచర్

ఇంట్లోనే మానిక్యూర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటివద్దే సులభమైన పద్ధతులను పాటిస్తూ సౌందర్యాన్ని పరిరక్షించుకోవచ్చు. అలాంటి వాటిలో మానిక్యూర్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరికీ తమ చేతిని, గోళ్ళని శుభ్రంగా ఉంచుకోవాలని ఉంటుంది. అయితే మనలో చాలామంది ఫేస్‌ప్యాక్స్‌ని వాడి ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుచుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడూ ముఖానికి ఇచ్చినంత కేర్ చేతులకు ఇవ్వరు. కానీ చేతులతోనే మనం అన్ని పనులూ చేస్తుంటాం. మరి చేతులపై అంత నిర్లక్ష్యం ఎందుకు? అందుకే ఇంటివద్దే సరైన పద్ధతిలో మానిక్యూర్ చేసుకుని చేతులకు సరైన ఆదరణని, ప్రేమని అందిద్దాం.
* ముందు నైల్ క్లిప్పర్స్‌తో గోళ్ళను ట్రిమ్ చేసుకోవాలి. సరైన షేప్‌లో వాటిని ట్రిమ్ చేసుకోవాలి. పొడవైన గోళ్ళకు సంరక్షణ ఎక్కువ అవసరం. అంతేకాకుండా గోళ్ళు ఎంత పొడవుంటే అంత త్వరగా అపరిశుభ్రంగా తయారవుతాయి. అందుకే గోళ్ళను మీడియంగా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది.
* తరువాత క్యూటికల్ ఆయిల్ లేదా ఏదైనా ఆయిల్‌తో నెయిల్ బెడ్‌ను మాయిశ్చరైజ్ చేయాలి. దీనివల్ల చిరాకు పుట్టించే క్యూటికల్స్‌ని మృదువుగా మార్చుకోవచ్చు.
* క్యూటికల్స్‌ని మాయిశ్చరైజ్ చేశాక చేతుల్ని నీటిలో నానబెట్టాలి. ఒక బౌల్‌లో గోరువెచ్చటి నీటిని తీసుకుని అందులో లావెండర్ ఆయిల్‌ని కానీ లేదా ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్‌ను కానీ కలుపుకోవాలి. తరువాత ఇందులో పది లేదా పదిహేను నిముషాలపాటు చేతుల్ని ఉంచాలి. అప్పుడు క్యూటికల్స్ చాలా మృదువుగా మారతాయి.
* ఇప్పుడు ఏదైనా బ్రష్, క్యూటికల్ స్టిక్‌ను తీసుకోవాలి. వీటిని ఉపయోగించి మృతకణాలను తొలగించాలి. అలాగే క్యూటికల్ స్టిక్‌తో క్యూటికల్స్‌ని వెనక్కి తోయచ్చు. అయితే క్యూటికల్ స్టిక్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చర్మానికి గుచ్చుకుని గాయమయ్యే ప్రమాదం ఉంది. అలాగే బ్రష్‌ను మెత్తటి కుచ్చు ఉన్నది ఎంచుకోవడం మంచిది. చేతులపై ఉన్న చర్మం డెలికేట్ కాబట్టి ఈ జాగ్రత్తలను పాటించాలి.
* మృతకణాలు తొలగిపోయిన తరువాత చేతులకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. గోళ్ళ కోసం నెయిల్ క్రీమును వాడాలి.
* తరువాత గోర్లను నచ్చిన షేప్‌లోకి తెచ్చుకోవాలి. అప్పుడు నెయిల్ కోట్‌ను అప్లై చేయాలి. ఇది గోర్ల రంగుల నుండి గోళ్ళను రక్షిస్తుంది. తరువాత నచ్చిన గోర్లరంగును వేసుకుంటే సరి.. అంతే.. ఇంట్లోనే.. ఇంట్లోని వస్తువులతోనే అందమైన చేతులను సొంతం చేసుకోవచ్చు.
*