సబ్ ఫీచర్

పంచదారను తగ్గిద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేడి వేడి జిలేబీని చూస్తే ఎలాంటివారికైనా నోరు ఊరుతుంది. కొంతమందికైతే రోజుకు ఓసారి తీపి తినందే అన్నం కూడా సహించదు. అలా తీపి అంటే చాలామందికి చాలా మక్కువ. కానీ దీనివల్ల ఆరోగ్యానికి తీరని నష్టం కలుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ప్రతివ్యక్తీ రోజుకు కేవలం ఆరు స్పూన్ల పంచదారను మాత్రమే వాడాలని చెబుతోంది. ప్రస్తుతం ఏ డాక్టరు అయినా చక్కెరకు దూరంగా ఉండమనే చెబుతున్నాడు. సాధారణంగా చక్కెర, మైదా, అన్నం, ఉప్పులను కలిపి వైట్ డెవిల్స్ అంటారు. ఈ నాలుగింటిలో ముఖ్యంగా చక్కెర వల్ల చాలా అనర్థాలు తలెత్తనున్నాయి. అందువల్లే డాక్టర్లు చక్కెరను పూర్తిగా తగ్గించమని చెబుతుంటారు. లేదా మానేస్తే మరీ మంచిది! దీనే్న షుగర్ డీటాక్స్ పద్థతి అంటారు. దీన్ని ఎలా పాటించాలో, మన దినచర్యలో చక్కెర స్థాయిలను ఎలా తగ్గించాలో చూద్దాం..!
* మన దినచర్యలో పంచదార స్థాయిలను తగ్గించే పద్ధతిని ‘షుగర్ డీటాక్స్’ అంటారు. ఈ పద్ధతిలో భాగంగా ఓ నలభై రోజుల పాటు పంచదారకు దూరంగా ఉండాలి. నలభై రోజుల తర్వాత పంచదార లేకుండా జీవించడానికి శరీరం అలవాటు పడుతుందన్నమాట.
* షుగర్ డీటాక్స్ పాటించేటప్పుడు సహజ చక్కెరలకు కూడా దూరంగా ఉండాలి. అంటే చక్కెర, స్వీట్లు, క్యారెట్, బీట్‌రూట్, అంజీర్, ఖర్జూరం వంటి వాటన్నింటికీ కూడా దూరంగా ఉండాలి. అలాగే వీటితో పాటు కృత్రిమ చక్కెరలకు కూడా దూరంగా ఉండాలి.
* చాలామంది ఇలా చేయలేకపోతుంటారు. అలాంటివారు ఇరవై నిముషాల ఛాలెంజ్‌ను తీసుకోవచ్చు. లేదా రోజువారీ పంచదార స్థాయిలను నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి.
* సాధారణంగా ఆకలి అనిపించినప్పుడు శరీరం చక్కెరపదార్థాలను కోరుకుంటుంది. కానీ అలాంటి సమయంలోనే నియంత్రణలో ఉండాలి. మనసుని ఇతర విషయాల వైపుకు మళ్లేలా చూసుకోవాలి.
* ఇలా చేసినా స్వీట్ బాగా బలంగా తినాలనిపిస్తే ఏదైనా ఓ పండును తిని, మంచినీళ్లు తాగితే సరి. తీపి తిన్నాము అనే భావన కలుగుతుంది.
* ఆహారంలో పీచుపదార్థం, ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే, కడుపు నిండుగా ఉండి తీపి తినాలనే కోరిక కలుగదు.
* ఇంట్లో స్వీట్లు, చక్కెర ఎక్కువ ఆహారపదార్థాలను ఉంచకూడదు. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు తినాలనిపిస్తుంది.
* కొనేటప్పుడు కూడా చక్కెరలు తక్కువ స్థాయిలో అంటే కేవలం నాలుగు గ్రాముల కంటే తక్కువగా ఉండే ఆహారపదార్థాలను మాత్రమే కొనాలి. ఈ స్థాయికి మించి ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను అసలు కొనకూడదు.
*