సబ్ ఫీచర్

జాగ్రత్తలు తప్పనిసరి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య యువతలో ఛాలెంజింగ్ ఎక్కువైంది. అదేపనిగా అనుకొన్నది సాధించాలని రాత్రనక పగలనక కష్టపడుతున్నారు. చిన్న వయస్సులోనే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. అటు చదువుకుంటూ ఇటు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తేస్తున్నారు. కాని వారికి సమయం చిక్కక ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ దొరికే ఏ పదార్థమైనా తినేస్తున్నారు కొందరు. మరికొందరు పిజ్జాలు, బర్‌ర్గలు స్నాక్స్ అంటే చిప్స్, కాండీ, తీపి ఉండలు, పంచదార పెట్టిన సీరల్స్, ఫ్రైడ్ ఫాస్ట్ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, రెడీమేడ్ కూల్ డ్రింక్స్, మసాలా చాట్, పకోడీలు, బజ్జీలు, మిర్చి బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ టమోటా కెచప్, వెన్నతో కూడిన కేకులు, చాక్లెట్ డింగ్ డాంగ్స్, బేకన్, సాసేజ్ ఇలా ఏదో ఒక జంక్ పుడ్ తింటున్నారు. ఇలా తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని త్వరగా అనారోగ్యం పాలవుతున్నారు.
కంటికి కనిపించే తిండి తినేసి ఆకలి తీర్చుకుంటున్నరు. వాటి మంచి చెడులను, అవి చేసే మేలు కీడులను గురించి ఆలోచించే సమయమే వారికి ఉండటంలేదు.
నేటి అత్యాధునిక కాలంలో ఇంట్లో కూడా తల్లిదండ్రి లేక భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల వంటిల్లు వాడకుండా ఏదో ఒకటి తినేయటం జరుగుతున్నది. కారణాలు అనేకం, ఫలితం మాత్రం ఒక్కటే. విరామమెరుగని కార్పొరేట్ పనివల్ల తిండి తినే సమయం ఉండటంలేదు. పిల్లలు, పెద్దలు, అన్ని వయసులవారూ ఈ జంక్ ఫుడ్స్ ప్రియులే! వాటి రూప లావణ్యలూ ఆకర్షణకు కట్టుబడి వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ఇవి చూడడానికి ఎంతో బాగుంటాయ. అంతేకాదు వాసన, రుచి అమోఘంగా ఆకర్షిస్తాయ. కాని అదే స్థాయిలో అనారోగ్యం పక్కనే వచ్చేస్తోంది.
అవసరమైన పోషక విలువలు, శరీర పోషణకు సరిపోయేంతమేరకు కేలరీలు అందించని అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను జంక్ ఫుడ్స్ అంటాం. జంక్ ఫుడ్ తినడం మన అనారోగ్యానికి మనమే దారి వేసుకున్నట్లుగా భావించక తప్పదు. ఈ జంక్ ఫుడ్ అనే మాట మొట్టమొదట 1972లో మిచెల్ జకొబ్‌సన్- డైరెక్టర్ ఆఫ్ ది సెంటర్ ఫర్ సైన్స్ ఇన్ ది పబ్లిక్ ఇంటరెస్ట్ ఉటంకించారు. జంక్‌ఫుడ్‌లో అధికంగా సాచ్యురేటెడ్ కొవ్వులు, సాల్ట్, షుగర్ ఉంటాయి. వీకెండ్స్ అంటే వారాంతపు సెలవుల్లో కుటుంబం మొత్తం వెళ్లి హోటలు తిండి తినడం అలవాటుగా మారిపోయింది. అక్కడ వాడే నూనెలు ఎన్నోమార్లు వేడిచేసినవి, వాటినే మళ్లీ మళ్లీ వేడిచేసి ఆ పదార్థాలు తయారుచేస్తారు.
ఇవి అన్నీ కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. అందుకే వీటిని వీలైనంత దూరంగా ఉంచాలి. ఎంత కష్టమైనా కాస్త మజ్జిగ అన్నం తినేయడమే అన్ని వయస్సుల వారికి మంచింది. కనీసం ఇలాంటి వాటిని తిన్న తరువాత ఇంటికి వచ్చి మజ్జిగ తాగడం, కొద్దిగా మజ్జిగ అన్నం తినడం లాంటివి చేస్తే కొంత అనారోగ్యాన్ని దూరం చేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త.