సబ్ ఫీచర్

ఆత్మ - విచారము -- పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ అను శబ్దము వినగానే మనకు యోగశాస్త్రం ప్రకారం 8 రూపాలు గుర్తుకొస్తాయి. అవి జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ, నిర్మలాత్మ, సిద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ.
గుణ భేదాదాత్మమూర్తి రష్ట్ధాపరికీర్తితః
జీవాత్మా చాంతరాత్మాచ పరమాత్మాచ నిర్మలః
శుద్ధాత్మా జ్ఞానరూపాత్మ మహాత్మా సప్తమస్మృతః
అష్టమస్తేషు భూతాత్మా మిత్యష్టాత్మనః ప్రకీర్తితః
నిర్గుణ బ్రహ్మమునకు ఆత్మయని, బ్రహ్మమని పర్యాయ పదములు ఎట్లు కలిగినవనినచో-
ఋతమాత్మా పరం బ్రహ్మ స్యమిత్యదికా
కల్పితావ్య వ్యవహారార్థం యస్య సంజ్ఞా మహాత్మనః
పైన చెప్పిన ఎనిమిది విధములైన ఆత్మ స్వరూపములలో నుత్తమమైన ‘మహాత్మ’కు సాధకజన సౌలభ్యము కొరకు, ఋతము, ఆత్మ, బ్రహ్మము, సత్యము, అను పర్యాయ పదములను బ్రహ్మవేత్తలు కల్పించి చెప్పిరి. నిజమునకు శివశక్త్యాత్మకమగు ‘కామకల’ ఆత్మ స్వరూపమైయున్నది. ఆత్మకాములగు స్వరూపవేత్తలు రుూ కలనే ఆత్మానుసంధానమందు కోరుచున్నారు. ఆత్మ జిజ్ఞాసులైన ఋషులు, యోగులు, ఆత్మయననేది? ఎట్టిది? ఎచటనున్నదని ప్రశ్నించి యనే్వషణ చేయగా ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ ప్రజ్ఞానమే బ్రహ్మయని, ఆత్మను ప్రజ్ఞాన రూపముగా నుపాసించవలెనని తెలిసికొనిరి. ఆ ప్రజ్ఞానమెట్టిదనగా రుూ శ్రుతివాక్యము చూడండి- ‘‘ఏనవారూపం పశ్యంతి ఏనవా శబ్దం శ్రుణోతి ఇత్యాది ప్రజ్ఞాన లక్షణ ముక్తం’’ అనగా జ్ఞానేంద్రియముల ద్వారా శబ్ద, రస, రూప గంధాదులనేది గ్రహించుచున్నదో అదియే ప్రజ్ఞానమని నిర్ణయించిరి. ‘కామః’ అను ప్రజ్ఞాన పర్యాయము వలన ‘కామకల’ యనగా ఆత్మస్వరూపమైన ప్రజ్ఞాన కలయని, సంవిద్రూపమగు ఆత్మయని తెలియుచున్నది.
‘ఆత్మ’ శబ్దాన్ని విశే్లషిస్తే ఆత్+మ, ‘ఆత్’ అనగా వృద్ధి, ‘మ’ అనగా లేనిదని అర్థము. అంటే పరిమాణము చెందనిది, మార్పులేనిది, నశించదని అర్థము. కావున ఆత్మ నిత్య చైతన్యం కలది. ప్రతి జీవియందు సాక్షీభూతముగా నున్న ఆత్మ అవినాశి. ఇదియే భవిష్య సృష్డియందు బ్రహ్మాండ, పిండాండ, శ్రీచక్ర, చిద్వాద్యాదులకు కారణ వస్తువుగా నున్నదని, కావున నిట్టి కారణమే కార్యరూపమున పరిణమించి, కార్య కారణములకు భేదమని తెలియుచ్నుది. ఇట్టి విషయము నెరిగిన బ్రహ్మవేత్తలు, కామేశ్వరీ సాయుజ్యమును (బ్రహ్మమును) పొందుచున్నారు. ఇట్టి విషయ నిర్థారణకు శ్రుతియే ప్రమాణము. ఈ క్రింది శ్రుతి వాక్యములను చూడండి.
శ్లో బ్రహ్మవిద్భృహ్మవ భవతి బ్రహ్మవిదాప్నోతి పరం
సత్యం, జ్ఞాన మనంతం బ్రహ్మయో వేద నిహితం గుహాయాం
పరమేవ్యోమన్ సో శ్నుతే సర్వాన్కామాన్ సహా
పై శ్రుతి వాక్యములచే బ్రహ్మవేత్త బ్రహ్మమేయగుచున్నాడని తెలియచున్నది గదా. సర్వజీవులయందు అహమహమని (నేను- నేనని) వ్యవహరించుచున్న ఆత్మ వస్తువును అనిత్యమైన ఉపాధి జీవాదులుగా భావింపక నిత్యము అవినాశి ప్రత్యగాత్మ స్వరూపమైన సాక్షిగా భావించువారు జీవన్ముక్తులగుచున్నారు. ఉపాధి శిథిలమైనప్పుడు ప్రతిబింబము, బింబమందు లయమైనట్లు బ్రహ్మవేత్త బ్రహ్మమందే లీనమగుచున్నాడు. అనగా జనన మరణములు యిక పొందనివాడగుచున్నాడు. అవిద్య నుండి విముక్తుడగుచున్నాడని అర్థము. సత్యస్వరూపమైన బ్రహ్మ వస్తువునకు బంధ మోక్షములు లేవని కదా శ్రుతివాక్యము.

ప్రతులకు
7-8-51,్ఫ్లట్ నెం. 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2
హైదరాబాద్- 500079

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590