సబ్ ఫీచర్

సొగసైన కోకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండగైనా, పబ్బమైనా, వేడుకైనా.. ఎలాంటి ముఖ్య సందర్భమైనా అమ్మాయిలు, మహిళలు సంప్ర దాయ దుస్తుల వైపే మొగ్గు చూపుతారు. అయితే సంప్ర దాయ దుస్తులంటే అందులో ఫ్యాషన్, ట్రెండ్ ఉండదని చాలామంది అభిప్రాయం. కానీ నేడు ఫ్యాషన్ డిజైనర్లు చీరల్లోనూ రకరకాల ఫ్యాషన్ ట్రెండ్‌లను చొప్పించి చీర సోయగానికి మించింది మరోటి లేదేమో అన్నట్లుగా చీరలను తీర్చిదిద్దుతున్నారు. చీరను పాతకాలం ఫ్యాషన్‌గా భావిస్తోన్న చాలామంది నేడు ఈ చీరలను కట్టుకునే మురిసిపోతున్నారు. నేడు చీర ఫ్యాషన్స్‌కి, ట్రెండ్స్‌కి తగినట్లు మారిపోవడమే ఇందుకు కారణం. ధోతీ శారీ, లెగ్గింగ్ శారీ, శారీ గౌన్‌లతో పాటు ఫ్రింజ్ కట్, మెటాలిక్ ఫ్లూటెడ్ శారీ, లాంగ్ కోట్ చుడీదార్ శారీ, మోనోక్రోమ్ శారీ, ఫ్రి ంజ్ శారీ ఇలా ఎనె్నన్నో.. ఇవన్నీ ఇప్పుడొస్తున్న లేటెస్ట్ ట్రెండ్స్.. వీటిని ప్రతీ మహిళ, అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. వేడుకలే కాదు, చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా కూడా వీటినే ధరించడానికి మక్కువ చూపుతున్నారు. సన్నగా, తీరైన దేహం ఉన్నవారికి ఫ్రింజ్ కట్ శారీస్ చాలా బాగుంటాయి. మెటాలిక్ ఫ్యూటెడ్ శారీని సన్నగా ఉన్నవారు ధరిస్తే చాలా అందంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు చీర అనేక ఫ్యాషన్ హొయలుపోయి ట్రెండీగా మార్కెట్లోకి వచ్చేసింది. ఇంకెందుకాలస్యం.. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫ్యాషన్, ట్రెండీ చీరల్లో ఒదిగిపోండి మరి!