సబ్ ఫీచర్

‘కూటమి’ని నడిపే ఆ నేత ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏడాది ఆరంభంలో లోక్‌సభకు ఎలాగూ ఎన్నికలు తప్పవు. కాని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఎన్నికలు ఒకేసారా? విడివిడిగానా? అనేదానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. ప్రధాని మోదీ తప్పుకోవాల్సిందే అంటూ ఇటీవల కర్ణాటకలో ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం సందర్భంగా ఐక్యతను చూపిన నాయకగణం డిమాండ్ చేస్తోంది. ఆ వేడుకకు సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, సీతారాం ఏచూరి వగైరా హేమాహేమీలంతా హాజరయ్యారు. ఒక్క బిజెపిని వీరంతా ఎదుర్కోవటానికి సిద్ధమయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ.. సామాన్య వోటరుకు మాత్రం ఒక్క సందేహం మాత్రం తీరటంలా...
ఈ నాయకులంతా వేర్వేరు రాష్ట్రాలలో అక్కడి నాయకులతో కలిపి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలి. అలాగే చేస్తారు, సంతోషం.. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా కలిసి పోరాడతామంటూ, స్థానికంగా ఏమని ప్రచారం చేయాలి? ఉదాహరణకు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఉంది గదా, మరి టిడిపి తరఫున తెలంగాణాలో అభ్యర్థులుండాలిగదా! కాబట్టి నిన్న కెసిఆర్, చంద్రబాబు బిజెపిని విమర్శించి, మరుసటిరోజే తమ తమ ఎంఎల్‌ఎ అభ్యర్థుల ప్రచారంలో ఒకరినొకరు విమర్శించుకుంటారా?
చంద్రబాబుకు హిందీ రాదు గదా, కాబట్టి ఉత్తర భారతంలో వారి ప్రచారం మేధావి వర్గానికే పరిమితం కావాల్సి వుంటుందేమో! ఇలాంటి ఇబ్బందులు, ప్రక్క ప్రక్క రాష్ట్రాలలో ఉండే స్థానిక ప్రాంతీయ పార్టీలకు తప్పదనుకుంటా. దానిని అధిగమించటం ఎలా?
అసలు సమస్య..
విపక్ష పార్టీల దృష్టిలో భావి భారత ప్రధాని ఎవరు? అది తెలిస్తే- ఆ అభ్యర్థి కనీసం 3, 4 రాష్ట్రాలలోనైనా పర్యటించి తీరాలి గదా. ఇంతవరకూ అలా బహిరంగంగా ప్రకటించింది ఒక్క రాహుల్‌జీయే. కర్ణాటక ఎన్నికల సమయంలో ఆయన తన మనసులోని మాటను చెప్పేశారు. కాగా, విపక్షాల చెలిమి ఎన్నాళ్లన్నది అనుమానమే. కర్ణాటక ప్రభుత్వంలోనూ అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి సుమా! కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరవాతే ఒక అనుమానం విశేష ప్రచారం పొందింది. ఆయన పూర్తిగా 5 ఏళ్ళు సిఎంగా కొనసాగుతారా? లేదా? అన్నదే ఇప్పుడు సందిగ్ధంగా మారింది.
కాంగ్రెస్, జెడిఎస్ చెరో 30 నెలలు సీఎం పదవిని పంచుకోనున్నాయని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి 5 ఏళ్ళ సిఎంగా ఉంటారా? అన్న ప్రశ్నకు డిప్యూటీ సిఎం, కాంగ్రెస్ నేత పరమేశ్వర్ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారు. వారివద్ద ఏ ప్రభుత్వ విభాగాలు ఉంటాయి, మీ వద్ద ఏమేమి ఉంటాయో తేలలేదు. ఐదేళ్ల కాలం వారే ఉంటారా? లేక మేం కూడానా? అనే విధి విధానాలపై ఇంకా చర్చించుకోలేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
జెడిఎస్‌కు పూర్తికాలం సిఎం పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదా? అని ప్రశ్నించగా, ‘చర్చల తర్వాతే దీనిపై ఒక నిర్ణయానికి వస్తాం. వాస్తవానికి డిప్యూటీ సిఎం అయినా, ముఖ్యమంత్రి పదవి అయినా చేపట్టే సత్తా వున్న నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారు. అదే మా పార్టీ బలం. కాని అధిష్ఠానం సూచన మేరకే నడుచుకుంటాం. అత్యుత్తమ పాలన అందించటమే మా లక్ష్యం’ అని బదులిచ్చారు. కాంగ్రెసు, జెడిఎస్ చెరో 30 నెలలు అధికారాన్ని పంచుకుంటాయన్న వార్తలను కుమారస్వామి ఖండించారు. అలాంటి చర్యలేమీ జరగలేదు అని అన్నారు.
77 సంవత్సరాల వయసున్న శరద్‌పవార్ సైతం రంగంలోకి దిగారు. ‘ఎట్లా 1977లో అత్యాయిక పరిస్థితి తరువాత యాంటీ కాంగ్రెస్ ధోరణి దేశంలో వ్యక్తమయిందో, అలా ఇపుడు యాంటీ బిజెపి సెంటిమెంట్ వ్యక్తమయింది. యాంటీ బిజెపి పార్టీలు, ప్రజాస్వామ్యంలో నమ్మకమున్న పార్టీలు, ఒక కామన్ ప్రోగ్రాంలో ఏకం కావాలి. ఆ ప్రయత్నంలో నేను భాగం కావటానికి చాలా సంతోషపడతాను..’ అని ఆయన అన్నారు.
తక్షణ కర్తవ్యం..
ఎన్నికల ముందయినా విపక్ష పార్టీలు తాము ఐక్యంగా ఉన్నట్లు చెబుతూ, ప్రధాని అభ్యర్థి గురించి స్పష్టత ఇస్తే బాగుంటుంది. ఇక ఈ సంకీర్ణంలో ప్రధాన పాత్ర పోషించటానికి తహతహలాడుతున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాలన గురించి రెండు వివరాలు.. యువ బిజెపి కార్యకర్తల ఆత్మహత్యలు హత్యలే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మే 29న పురూలియా జిల్లాలోని బలిరాంపూర్‌కు చెందిన 18 సంవత్సరాల యువకుడు త్రిలోచన మహతోను కొందరు అపహరించారు. 30వ తేదీన ఒక చెట్టుకు వ్రేలాడతీయబడి, అతని శవం దర్శనం ఇచ్చింది! ఇది బిజెపిలో పనిచేసినందుకు ప్రతిఫలమంటూ పోస్టర్లు ఆ మృతదేహానికి అతికించబడ్డాయి.
రెండవ హత్య 30 సంవత్సరాల దులాల్‌కుమార్‌ది. జూన్ 1వ తేదీ రాత్రి అపహరించబడ్డాడు. జూన్ 2వ తేదీన అతని మృతదేహం ఎలక్ట్రిక్ టవర్ నుంచి వ్రేలాడదీయబడి దర్శనమిచ్చింది. దులాల్‌కు వరుస సోదరుడైన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ, దులాల్ కోసం 1వ తేదీ రాత్రి నుంచీ ఎదురుచూస్తున్నామనీ, మొబైల్‌కు ఫోన్ చేస్తే, రింగ్ అయి కాల్ డిస్‌కనెక్ట్ చేయబడిందని చెప్పాడు. దులాల్‌కు భార్యాపిల్లలున్నారు. ఎన్నికల సమయంలో దౌర్జన్యాలు చూశాం కానీ, తరువాత వారిని అపపహరించి, ఉరితీయటమనేది బెంగాల్ కొత్తగా ప్రారంభమైన హింసా సంస్కృతి అని చెప్పవచ్చు. గత 5 సంవత్సరాలలో గ్రామ పంచాయితీలలో బిజెపి ఓటు శాతం 1 నుంచి 18కు పెరిగితే, సిపియం ఓటు శాతం 32 నుంచి 5కు, కాంగ్రెస్ శాతం 11 నుంచి 3కు తగ్గిందట. బిజెపికి చెందిన సుమారు 100 మంది పంచాయితీ ఎన్నికలలో గెలిచారు. అందులో స్ర్తిలు కూడా ఉన్నారు. మే 31న ఢిల్లీలోని బిజెపి నాయకుడు ముకుల్‌రాయ్ నివాసంలో వీరు రక్షణ పొందుతున్నారు. బిజెపి జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గీయ మాట్లాడుతూ, ఈ వివరాలు సాక్ష్యాలతో సహా జాతీయ మానవ హక్కుల సంఘానికి సమర్పించామన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 67 హత్యలు జరిగాయన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిచిన పార్టీ కార్యకర్తలు, ఆత్మహత్యలకు పాల్పడటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు. జరగదు కూడా. మమతా బెనర్జీ ఇపుడు ప్రతిపక్ష పార్టీల కూటమి కోసం తెగ తహతహలాడుతున్నారు.
మమతా బెనర్జీ ఇంకో బాంబు వదిలారు. బిజెపి మాదిరి తృణమూల్ కాంగ్రెస్ తీవ్రవాద సంస్థ కాదట! ‘బిజెపి ఓ మతతత్వ పార్టీ. ఢిల్లీ గద్దెమీద ఉన్నామన్న అహంభావంతో, ఎన్‌కౌంటర్లు చేస్తామని, బాంబులు వేస్తామని ఆ పార్టీ నేతలు బెదిరింపులకు తెగబడుతున్నారు. మా నేతలను టచ్ చేసి చూస్తే, వారి స్థాయి ఏమిటనేది నిరూపిస్తాం’ అని ఆమె హెచ్చరించారు.
ఎన్నికలకు ముందే విపక్షాలు కలవటమనేది సాధ్యమయ్యేది కాదు అని పవార్ ప్రకటన. అంతేకాదు, గుజరాత్ ఎన్నికల తరువాత రాహుల్‌జీని అతిగా పొగడిన పవార్- ‘నేనేం చెప్పలేదు, ఏ వ్యక్తి గురించి ఏమీ చెప్పలేను. అంతిమంగా, వారెంతవరకు ఆమోదింపబడతారు అనేది ముఖ్యం’ అంటూ ముగించారు. దీనిని ఏమందాం? విపక్షాల మహాకూటమి కలే అని కూడా పవార్ అన్నారు. కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జి రణదీప్ సర్దేవాలా ఎన్నికల పొత్తులు, ఒక్కో రాష్ట్రంలో ఒకో పార్టీతో ఉండొచ్చని, అన్ని పార్టీలతో కలిపి ఒకే తరహా పొత్తు ఉండకపోవచ్చునని స్పష్టం చేశారు. మన ఏపీ మంత్రి నారా లోకేశ్, ముందస్తు అక్కరలేదన్నారు. అంటే 5 సంవత్సరాలు పూర్తయిన తరువాతే అన్నమాట, పొత్తుల సంగతి ఎత్తనే లేదు. జెడియు ప్రధాన కార్యదర్శి సంజయ్ సింగ్, బీహార్‌లో తాము అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. చంద్రబాబు జనవరి తరువాతే ఎన్నికలు వస్తాయన్నారు. బిహార్‌లో నితీశ్‌కుమార్‌తో మళ్లీ పొత్తుండదని ఆర్‌జెడి నాయకుడు తేజస్వి యాదవ్ తేల్చాడు. బిజెడి అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాత్రం జమిలి ఎన్నికలకే మా వోటు అన్నారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల ప్రజాస్వామిక దేశం భారతదేశం. మనం విదేశీ పాలన నుంచి విముక్తి పొంది 7 దశాబ్దాలు దాటింది. మనం పొందింది ఖండిత భారతమే. రాజ్యాంగాన్ని 42వ సవరణ తీసుకుని, నాటినుంచి సావరిన్ సోషలిస్టు సెక్యులర్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ పౌరులమయ్యాం. అంటే కనీసం 4 దశాబ్దాల పైనుంచి ఆ రిపబ్లిక్ పౌరులమయ్యాం.
ఇంకా మనకు ‘ఎన్నికల తరువాత మేం కోరే ప్రధాని ఈ నాయకుడే’ అని చెప్పగల ధైర్యం రాలేదా? అయితే ఈ కూటములెందుకు, ఈ నాయకులెందుకు? ప్రపంచం ముందు మన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయకండి. ఈ విషయం తేల్చకుండా, కలగూరగంపగా పార్లమెంటును మార్చి.. చింపిన విస్తరిగా భారతాన్ని మార్చవద్దు. ఒకరిని వద్దనటం కాదు, మాకు కావలసింది ఈ నాయకుడు అని స్పష్టంగా చెప్పి, ప్రపంచం ప్రశంసలు పొందుదాం.

--చాణక్య