సబ్ ఫీచర్

కుటుంబ వృద్ధితోనే సమాజ వృద్ధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక యంత్రంలోని ముఖ్యభాగాలన్నీ అవి చేయవలసిన పనులను సక్రమంగా చేస్తేనే ఆ యంత్రం ఉత్పత్తి చేయవలసిన వస్తువులు అందంగా సమర్థవంతంగా ఉంటాయి. కుటుంబం కూడా ఒక విలువైన యంత్రమే. భార్య, భర్త, కొడుకులు, కూతుళ్లు అందులోని ముఖ్యభాగాలు. ఎవరి విధులను వారు సక్రమంగా నిర్వహిస్తే ఆయంత్రం బాగా పనిచేసి సుఖ సంతోషాలనేవి పుష్కలంగా ఉత్పత్తి అవుతాయి. ఆ సూక్ష్మాన్ని గ్రహించిన పెద్దలు, మహర్షులు, కొడుకులు కూతుళ్ల పట్ల తల్లిదండ్రుల బాధ్యతలను తల్లిదంఢ్రుల పట్ల పిల్లల బాధ్యతలను స్పష్టంగా పేర్కొన్నారు.
కొడుకులకు ప్రాధాన్యమిచ్చి కూతుళ్లను నిర్లక్షం చేయమని ఏ మహానీయుడు ఎప్పుడూ చెప్పలేదు. కాకపోతే కొందరి వక్రబుద్ధి వల్ల జరగరాని అన్యాయాలు ఈ సంఘంలో చోటు చేసికొన్నాయి. కొన్ని వందల ఏండ్లు అలాగే కొనసాగాయి. స్ర్తిలు విపరీత వివక్షకు గురయ్యారు. సంఘం ఒంటికాలిపై కుండినడక నడిచింది.
ముందు కొడుకులు, కూతుళ్లపట్ల తల్లిదండ్రుల బాధ్యత లేమిటో చూద్దాం. వారికి అన్నవస్త్రాలను సమకూర్చి పెంచి పోషించాలి. నాణ్యమైన విద్యాబుద్ధులను అందించాలి. వారికి అనారోగ్యమైతే ఔషధాలను, వైద్య చికిత్సను అందించాలి. దగ్గరుండి తగిన సేవలు చేస్తూ ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కల్గించాలి. వారి భయాందోళనలు పారద్రోలాలి. వారికి యుక్తవయస్సు రాగానే తగిన సంబంధాన్ని వెదికి వివాహం చేయాలి. కొడుకులు ఏదో ఒక వృత్తితోనో, వ్యాపారంతోనో స్థిరపడేవరకు అండగా ఉండాలి. వారి వివాహం విషయంలోకట్న కానుకల కొరకు ఆశించక చదువు సంస్కారం సౌందర్యం గల అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేయాలి. తాము సంపాదించిన ఆస్తిలో పిల్లలల్లో వ్యత్యాసాలు చూపకుండావారికి సమానంగా పంచి ఇవ్వాలి.
జీవితంలో విందులువినోదాలే కాక మరుజన్మకోసం కాస్త కూడబెట్టుకోవాలి. ఇది కేవలం డబ్బు దాస్తే మరుజన్మకు రాదు. కాని మంచిచెడుల వల్లకలిగే సంస్కారాల వాసనలే మరుజన్మకు వస్తాయి. వాటిని చేయాలి. పుణ్యకార్యాలు చేస్తేనే మరుజన్మ బాగుంటుంది. ఈ పుణ్యకార్యాలనేవి చేయడంలోకూడా కాస్త విచక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న బాధ్యతలను విస్మరించి దానాది కార్యాలు చేసినా కూడా అవి మంచి ఫలితం ఇవ్వవు. బంధువుల పట్ల, పేదల పట్ల సానుభూతిని తెలపాలి. ఎదుటివారి నుంచి తీసుకోవడం కన్నా ఇతరులకు ఇవ్వడంలోని ఆనందాన్ని చవి చూడాలి. పిల్లలకు ఇవ్వడాన్ని నేర్పించాలి. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, సంపదను ఇతరులకు కూడా పంచి ఆనందాన్ని ఇబ్బడి ముబ్బడి చేసుకోవాలి.
ఇదంతా తల్లిదండ్రులు చూసేస్తారు. కనుక పిల్లలకు బాధ్యత ఉండదు అనుకొంటే పొరపాటే. పిల్లలు కూడా తమ వంతు బాధ్యత వారు నెరవేర్చాల్సి ఉంటుంది. సమాజంలో ఉండే ప్రతివారికి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత నిర్వహణలో కర్తవ్యాన్ని మరవకూడదు. అపుడే కుటుంబం బాగుంటుంది. కుటుంబం వల్ల సమాజం బాగుంటుంది. ఎవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తిస్తే కుటుంబం ఎలా పురోభివృద్ధిని సాధిస్తుందో సమాజం కూడా పురోగతిని పొందుతుందే. అపుడే ఆదర్శ సమాజం ఆదర్శకుటుంబాలు ఉంటాయి. మనుషులు ఆదర్శవంతులు అవుతారు. ఇంతి చదువు ఇంటికి వెలుగు అన్నారు. అంటే ఒక్క మహిళ తన వంతు బాధ్యతను తాను నిర్వర్తిస్తే చాలు ఆ ఇంట్లో ప్రతివారూ తమ తమ బాధ్యతలను నిర్వర్తిస్తారు. అట్లానే నేడు మహిళలు ఉన్నతోద్యోగాలు చేస్తున్నారు. ఆ ఉద్యోగాలను చేస్తూన్న మహిళ కర్తవ్యనిష్ఠ చూసి ఇతరులుకూడా కర్తవ్యాన్ని విస్మరించరు.

- రాచమడుగు శ్రీనివాసులు