సబ్ ఫీచర్

తెలుసుకొనవే యువతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఆధునిక టెక్నాలజీ పెరిగింది.అరచేతిలోనే వైకుంఠం అన్నట్టు ప్రపంచంలోని నలుమూలల్లో జరిగే వింతలు విశేషాలు తెలుసుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడ అరుదైన విషయం ఉన్నా తెలుసుకోవచ్చు. వస్తువున్నా క్షణాల్లో దాన్ని మన ముంగిట పెట్టుకోవచ్చు. ఇవన్నీ పెరిగిన సాంకేతిక విజ్ఞానం వల్లే జరుగుతున్నాయి.
కాని ప్రతిదానిలోను మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి చాలా నెమ్మదిగా వ్యాప్తి చెందుతుంది. చెడుకు తొందరెక్కువ. అట్లానే ఈ సాంకేతిక విజ్ఞానాన్ని చాలామంది దుర్వినియోగం చేస్తున్నారు.
ఎటిమ్ కార్డులు వచ్చాయి. డబ్బు జేబుల్లో పెట్టుకుని తిరిగి లేక పర్సుల్లో పెట్టుకొని తిరుగుతూ పోగొట్టుకోనక్కర్లేదు. హాయిగా బ్యాంకు ఖాతాలో జమ చేసుకొంటే చాలు. మన దగ్గర ఉన్న డెబిట్ , క్రెడిట్ కార్డు ఉంటే చాలు ఇలా స్వైప్ చేస్తే అలా డబ్బులు వచ్చేస్తాయి. కాని అందులోకూడా దొంగలు సైబర్ నేరగాళ్లు ప్రవేశించారు. దొంగతనాలు మొదలైయ్యాయి. నయానో భయానో లేక అప్రమత్తతో లేనివాళ్ల దగ్గర నుంచో లేక కార్డు పోగొట్టుకొన్న వారి దగ్గర నుంచో బ్యాంకుల ద్వారానో ఏదో ఒక విధానాన్ని చేపట్టి దాని ద్వారా ఖాతాల నుంచి సొమ్ము తీసేసుకొంటున్నారు. ఇది పెద్ద నేరమే. కాని ఇలా పోగొట్టుకొన్న సొమ్ము పోలీసుల సాయంతో తిరిగి ఒక్కోసారి పొందవచ్చు. లేకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు. కాని ఈ అక్రమ దారులు సొమ్మును దోచేసుకుంటున్నట్టే మనుషులను కూడా దోస్తున్నారు. అంటే మార్ఫింగ్ చిత్రాలతో ఎవరి శరీర భాగానికో మరెవరి ముఖాన్నో జత చేసేసి ఫలాన వారిది అని పంపిస్తున్నారు. ఇలా మార్ఫింగ్ చేస్తూ పడతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కొందరు ఇలా మార్ఫింగ్ ఫోటులు పంపి పెళ్లిళ్లను ఆపుచేస్తున్నారు. మరికొంతమంది మార్ఫింగ్ చిత్రాలను చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. వీరి బాధపడేవారు ముందుగా మానసికంగా కృంగిపోతున్నారు. ఆ తరువాత సమాజంలో చులకన అయిపోతున్నామని బాధపడుతున్నారు. నిదానంగా ఆ ఫోటులు మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి శిక్షించినా ముందుగా మాత్రం బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు. అందులోను మహిళలు మరింతగా బాధకు లోనవుతున్నారు.
కనుక మహిళలకు ఇప్పుడు ప్రభుత్వం చాలా భరోసా కల్పిస్తున్నారు. వాటిని ప్రతి మహిళా తెలుసుకొని ఉంటే ఈ మోసగాళ్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రతి ప్రదేశంలోను షీటీమ్స్ ఉన్నాయి. ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెడుతున్నారనోలేక పెట్ట వచ్చు అన్న అనుమానం కలిగినా ఈ షీ టీమ్స్ సహాయాన్ని తీసుకోవచ్చు. ఆ అగంతకుల బారినుంచి తప్పించుకోవచ్చు.
కొన్ని చోట్ల తండ్రి, అన్న, మామ, మరిది లాంటి వాళ్లు కూడా అమానుషాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి నుంచి కూడా తప్పించుకోవడానికి షీటీమ్స్ ఎప్పుడూ మహిళలకు సహాకారాన్ని అందిస్తాయి. అట్లానే ఆఫీసుల్లో పనిచేసే మహిళలకు, ప్రేమోన్మాదుల వల్ల బాధితులు ఎవరైనా సరే మార్ఫింగ్ చిత్రాలతో భయపెడుతుంటే ఒ్ద్యంషకఇళూషూజౄళఒబషకఇ.ఆఒఔ్యజషళ.్య్ప.జశ ఈ ఈమెయిల్‌కు వివరాలను ఫంపిస్తే వారు మార్ఫింగ్ చిత్రాలకు ఎవరు పాల్పడుతున్నారో వెంటనే అనేక సాధనాల ద్వారా తెలుసుకుంటారు. అంతేకాదు వారి వల్ల బాధితులకు ఎటువంటి కష్టం లేకుండా చూస్తారు. నేరం చేసేవారిని శిక్షించి మరలా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా చూస్తారు. కనుక మహిళలంతా ప్రభుత్వం కల్పించే సహకారాల గురించి తెలుసుకోవాలి. నేరగాళ్ల నుంచి నిరంతరం అప్రమత్తులై ఉండాలి. అపరిచితుల పట్ల కఠినంగానే ఉండాలి. ఊరికే వస్తుంది గదా అని ఏదీ తీసుకోకూడదు. ఇవ్వకూడదు. వైఫ్‌లు, నెట్‌లు వాడకం రాకపోతే దాని గురించి తెలిసిన వారి నుంచిలేక ఇంట్లో వారి నుంచి తెలుసుకోవాలి. కాని ఇతరులకు స్వంత ఫోన్లు ఇవ్వడం, కార్డుల పిన్ నెంబర్ చెప్పడం లాంటివి ఎప్పుడూ చేయకూడదు. కొత్తవారిని తొందరగా నమ్మి స్వంత విషయాలు ఎప్పుడూ చెప్పకూడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే మహిళలు ఎక్కడైనా ధైర్యంగా ఉండవచ్చు.
*