సబ్ ఫీచర్

భక్తుల మోక్షపథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన శిరిడీ సాయినాధుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవించి తరించిన ఎందరో స్ర్తిమూర్తులున్నారు. వారంతా సాయి పాద పద్మాలపై అచంచలమైన భక్తితో స్వామిని నిరంతరమూ సేవిస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ తరించిన స్ర్తిల గురించి ఒక్కసారి మనం స్మరించుకుందాము.
మొట్టమొదట బయాజీబాయి ఆమెని గురించి తెల్సుకుందాం. ఆమె అప్పాకోతే పాటిల్ భార్య. సాయిబాబా వారిని మొదట సేవించుకున్న వారిలో ముఖ్యులు మహల్సాపతి, అప్పాజోగ్లే, కాశీరాం షింపి, అప్పాకోతేపాటిల్ వున్నారు. బయాజీబాయి అప్పాకోతే పాటిల్ భార్య. సాయిబాబావారు ఆమెను ఎంతో ఆప్యాయంగా ‘సోదరి’అంటూ పిలిచేవారు. అప్పాకోతేపాటిల్ బయాజీబాయిలకు ఒక కుమారుడు వున్నాడు. అతని పేరు తాత్సాపాటిల్. తాత్సాపాటిల్ బాబావారిని మామా అని పిలిచేవాడు. బయాజీబాయి అత్యంత భక్తిపూర్వకంగా సాయిని సేవించుకుంటూ వుండేది. ప్రతిరోజూ ఒక గంపలో కొన్ని రొట్టెలూ, కూరలను పెట్టుకుని సాయిని వెతుక్కుంటూ వెళ్ళి తినిపించి వచ్చేది. సాయి మసీదు వదిలి ఆ ప్రక్కన అడవిలో ఎక్కడెక్కడో తిరుగుతూ వుండేవారు. అయినాసరే తాను వెతుక్కుంటూ వెళ్ళేది. భోజనం తినిపించి వచ్చేది. సాయి ధ్యానంలో కూర్చుని వుంటే, ఆయన ముందు విస్తరవేసి రొట్టె, కూరలు వడ్డించి, ఆయన తినేవరకూ వేచి వుండి, ఆయన ఆరగిస్తూ వుంటే చూస్తూ ఆనందించేది. అలా చూస్తూ తన్మయత్వం చెందుతూ ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించేది. సాయి మసీదులోవుంటే అక్కడే భోజనం వండి తెచ్చి సమర్పించుకునేది. ఎన్నిసార్లు బాబా వచ్చినా ఆమె లేదనుకుంటూ సాయికి ఏదో ఒకటి పెడుతూనే వుండేదట.
కావుననే సారుూ సేవలో ఆమె కుటుంబం మొత్తం తరించారు. సాయిబాబావారు తాత్యాకు రోజూ డబ్బులు ఇస్తూండేవారు. ఎంతో గారాబంగా చూసుకునేవారు. బయాజీబాయి తర్వాత మనం కాశీబాయిని పేర్కొనాలి. ఈమె పుట్టింది శిరిడీలో, మెట్టింది నీఫాడ్‌లో. భర్త కాలంచేయగానే శిరిడీ వచ్చేసింది. ఒక కుమారుడు వున్నాడామెకు. చాలా బీదది కావడంవలన, శిరిడీలోనే పొలం పనులకు పోయేది. తన కొడుకును చూసుకోడానికి ఎవ్వరూ లేరామెకు. కొడుకు ఇంకా నెలల పసికందే అయినా పొట్టకూటికోసం పనీపాటలు చేసుకునేది. సాయిబాబావద్దనే మసీదులో తన బిడ్డను ఒక మూలన పడుకోబెట్టి కూలి పనికివెళ్ళేది. బాబాయే ఆ పసికందును చూసుకునేవాడు. ఆ పిల్లవాడు ఆ విధంగా సాయిబాబావారి సమక్షంలోనే పెరగడం ఎంత అదృష్టమో మరి. అతని పేరు మాధవ్. అయిదు సంవత్సరాల తర్వాత సాయిమాధవ్ చేత చిన్నచిన్న సరుకులు తెప్పించుకునేవారు. ఆ పిల్లవాడికి బాబా ఒక రూపాయి ఇచ్చేవాడు. మాధవ్ ఆ డబ్బును తల్లికి ఇచ్చేవాడు. కాశీబాయ్‌కి మాత్రం బాబా తన కొడుకుకు చాలా తక్కువ డబ్బు ఇస్తున్నాడనే భావన వుండేది. ఒకరోజున ఆ విషయం బాబానే అడిగేసింది. బాబా! అందరికైతే ఇరవైలు, ముప్పయిలు, యాభైలు ఇస్తావ్. నా బిడ్డ రోజూ నీకు ఎన్నో పనులు చేసిపెడుతూ వుంటే, ఒక్క రూపాయి మాత్రమే ఇస్తావే?, అంటూ నిష్ఠూరపడింది. కాశీబాయికి దురాశ ఎక్కువ. దీనికి బాబా ఏమి సమాధానం ఇచ్చారో చూడండి. ‘నిజమే అమ్మారుూ, ఇతరులకైతే ఏదో ఒక రోజు పైకం ఇవ్వడం ఆపేస్తాను. కానీ నీ కొడుకుకైతే ఎల్లప్పుడూ ఇస్తూనే వుంటానుకదా! నీలాగా దిక్కులేనివారికి నేనే దిక్కుకదా!’ అన్నారు బాబా.

-డా.పులిపర్తి కృష్ణమూర్తి