సబ్ ఫీచర్

స్ఫూర్తి దాత సుమిత్రాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుత్రుడు పుట్టినప్పుడు కలిగేది పుత్రోత్సాహం కాదు. ఆ పుత్రుడ్ని లోకం కనుగొని పొగడుతుంటే అపుడు నిజమైన పుత్రోత్సాహం వస్తుంది అని వేమన చెప్పాడు. ఇక్కడ పుత్రుడు అంటే కేవలం మగపిల్లవాడు అనేక ఆదు ఆడపిల్ల అని కూడా అనుకోవచ్చు. తను కన్నబిడ్డను లోకం అంతా పొగడుతుంటే ఆ తల్లికి కావాల్సింది ఏముంటుంది? లోకాన్ని తను గెలిచినంత సంతోషపడిపోతుంటుంది.
ఆ మాటే నిజం చేశారు జార్ఖండ్ నివాసులు. రాజ్రప్ప ప్రాంతంలోని సెంట్రల్ కోల్డ్‌షేడ్స్ టౌన్‌షిప్ ఉంది. అక్కడి నివసించే ఓ సాధారణ మహిళ కొన్నాళ్లక్రితం ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యానని సంతోషపడే సమయంలో విధి ఆమెతో ఆడుకుంటుంది. ఒకరోజు భర్తను దూరం చేసుకుంది. అందరి మహిళల్లాగే ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా అనిపించిందామెకు. ఏం చేయాలో ఎలా బతకాలో ఒకరికి ముగ్గురు పిల్లల్ని ఎలా పెంచాలో అని తల్లడిల్లిపోయింది. కాని ఆమె ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. విధి ఆడే వింత నాటకంలో బొమ్మనైనా నా పిల్లల్ని నేను కష్టపడి పెంచుకుంటాను. వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతాను అని స్థిర నిర్ణయం తీసుకొంది. వెంటనే అక్కడ ఉన్న ఒక పారిశుద్ధ కార్యాలయంలో వీధులూడ్చే పనిలో చేరింది. ఆ ఒక్క పనే కాదు చిన్నచితకా పనులెన్నో చేసింది. తన పొట్ట కాక తన పిల్లల పొట్ట గురించి ఆలోచించేది. కేవలం వారికి తిండి సౌకర్యమే కాదు. వారు ఈ ప్రపంచంలో తమకంటూ ఓ స్థానాన్ని పొంది అందరిచేతా గుర్తింపబడేట్టుగా పెంచాలి అనుకొంది. నిత్యమూ వారికి ప్రోత్సాహకరమైన మాటలు చెప్పేది. చక్కగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుందని వారికి నమ్మబలికేది. వారు ముగ్గురు పిల్లలూ అమ్మమాటను వేదవాక్యంగా భావించారు. అమ్మ కలలు నిజం చేసేందుకు చక్కగా చదువుకున్నారు. అందులో చిన్నకొడుకు మహేంద్రకుమార్ ఇతడు చదువుకుని బీహార్ ప్రాంతంలోని సివాన్ జిల్లాకు కలెక్టరు అయ్యారు. మరో ఇద్దరు కొడుకులు కూడా ఒకరు రైల్వేస్‌లో ఇంజనీరుగాను, మరొకరు వైద్యునిగాను స్థిరపడ్డారు.
కాని ఆమె మాత్రం తన పనినే దైవంగా భావించింది. తన పదవీ కాలం పూర్తి చేసుకొని పదవీ విరమణ చేస్తున్నప్పుడు కొడుకులు ఆమెను పూజించి మా అమ్మనే మాకు స్ఫూర్తిదాతగా నిలిచింది.
మాకు మార్గదర్శియై మమ్ములను ఇంత వారిని చేసిందని నలుగురికీ చెప్పి ఆ పదవీ విరమణ సమయాన్ని ఒక పండుగలా జరిపించారా ముగ్గురు కొడుకులు.
ఆ తల్లి పేరు సుమిత్రాదేవి. ఆ పండుగలోపాల్గొన్న వారంతా రామాయణ కాలం నాటి సుమిత్రాదేవిలాగే ఈ సుమిత్ర కూడా తన కొడుకులను ప్రయోజకులను చేసింది. నేడు కన్నకొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపుతుంటే ఈ సుమిత్రాదేవి కొడుకులు మాత్రం తమ పాలిట దైవం మా కన్నతల్లే అని చెప్పడం వెనుక సుమిత్రాదేవి కఠోర శ్రమ ఉంది. ఆమె తల్లులందరికీ స్ఫూర్తిదాత అని మెచ్చుకున్నారు. తన కొడుకులను అందరూ మెచ్చుకుంటుంటే ఇదిగో ఈ ఉద్యోగమే నా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి నాకు చేయూతనిచ్చింది అని ఎంతో వినమ్రంగా చెప్పింది.

- జంగం శ్రీనివాసులు